ప్చ్‌.. డీసీసీ పీఠమా..!

0

ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి

స్థానిక సంస్థల ఎన్నికల సందడి ఓ వైపు కొనసాగుతుంటే.. కాంగ్రెస్లోమాత్రం కీలకమైన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు నేతలు ముందుకు రావడంలేదు. గతంలో పార్టీ అధ్యక్ష పగ్గాల కోసం పోటాపోటీగా దిల్లీ వరకు రాజకీయాలు సాగించే నాయకులు ఇప్పుడు ఈ పదవి పేరు చెబితేనే వెనుక డుగు వేస్తున్నారు. రానున్న మున్సిపల్‌, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు కాకుండా కొత్త జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులను వారం రోజుల్లో నియమించాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశాలు జారీ చేయగా.. మాత్రం ఆ పార్టీ సీనియర్ల నుంచి స్పందన కనిపించడంలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యంతోపాటు పార్టీని నడిపిండం ఆర్థికంగా భారంకావడం వంటి కారణాల వల్ల డీసీసీ పీఠాలపై మొక్కుబడిగానే పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళన దిశగా అధిష్ఠానం అడుగులు వేస్తోంది. పార్టీని బలోపేతం చేయడానికి కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించడానికి సన్నాహాలు చేస్తోంది.

వాస్తవానికి రెండేళ్ల క్రితమే : కొత్త జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించడానికి ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో భ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాల విభజన తర్వాత కూడా పాత జిల్లా వారీగానే డీసీసీ అధ్యక్షులను ఎన్నిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలవడంతో సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. సామాజిక సవిూకరణాలతో జిల్లా అధ్యక్ష పదవులను నియమించాలని పార్టీ అధిష్ఠానం పీసీసీలకు నిర్దేశించింది. సంక్రాంతి వరకు పేర్లు సూచించాలని అధిష్ఠానం పేర్కొనడంతో ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీనియర్లు డీసీసీ అధ్యక్షులుగా ఉండటానికి ఆసక్తి చూపకుండా.. ఆసక్తి చూపే వాళ్లకు బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. ఇటీవల దారుణంగా ఓటమి చవిచూసిన ప్రముఖ నేతలు కూడా అధిష్టానం ఆదేశిస్తే డీసీసీ పగ్గాలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. అయితే వీరేవరికి కాకుండా కాంగ్రెస్‌ పార్టీలో నిజాయితీగా పనిచేసిన వారికే పట్టం కట్టాలని ఏఐసిసి ఆలోచన చేస్తుంది. ఇదిలా ఉండగా సర్వే సత్యనారాయణ చేసిన విమర్శలపై శుక్రవారం వార్‌రూంలో చర్చలు జరిగినట్లు తెలిసింది. సీఎల్‌పీ నాలుగు పేర్లు ప్రతిపాదనలోకి తీసుకోగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి పేరు. దళిత వర్గాలనుంచి దమోదర రాజనరసింహ పేర్లు చర్చకు వచ్చాయని తెలిసింది. – ఆనంచిన్ని వెంకటేశ్వరరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here