డేట్‌ లాక్‌ చేసుకున్న కామ్రేడ్‌

0

ఈ నెల 31న రావాల్సిన విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ విడుదల వాయిదా పడిందన్న వార్తల నేపధ్యంలో నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అప్‌ డేట్‌ రాకపోవడంతో అభిమానులు కొంత అయోమయంలో పడ్డారు. పోస్ట్‌ పోన్‌ పక్కా అని తెలిసినప్పటికీ ఏ డేట్‌ లో వస్తుంది అనే దాని గురించి క్లారిటీ మిస్‌ అవుతూ వచ్చింది. వాటికి చెక్‌ పెడుతూ మైత్రి మూవీ మేకర్స్‌ బిగ్‌ బెన్‌ సినిమా సంయుక్తంగా నిర్మించిన డియర్‌ కామ్రేడ్‌ రిలీజ్‌ డేట్‌ ని జూలై 26 ఫిక్స్‌ చేసినట్టు తాజా అప్‌ డేట్‌. అంటే ముందు అనుకున్న తేదికి సుమారు రెండు నెలల గ్యాప్‌ అన్నమాట. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ లో ఉన్న డియర్‌ కామ్రేడ్‌ టీంకు అదనంగా చాలా టైం దొరకబోతోంది. షూటింగ్‌ ఇటీవలే పూర్తయ్యిందని దర్శకుడు భరత్‌ కమ్మ సోషల్‌ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే డియర్‌ కామ్రేడ్‌ డేట్‌ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్న వరల్డ్‌ కప్‌ ను ద ష్టిలో ఉంచుకుని రిస్క్‌ లేకుండా ఫైనల్‌ జరిగే జూలై 14 తర్వాత తాపీగా తేదిని ఎంచుకున్నాడు. దీని వల్ల క్రికెట్‌ లవర్స్‌ ని మిస్‌ అయ్యే ఛాన్స్‌ ఉండదు. ఒకవేళ ఇండియా కనక ప్రపంచ కప్‌ లో బాగా ఆడితే జనం ఆ మ్యచులున్న తేదీలలో ధియేటర్లకు రావడం కష్టమే. అందుకే అంతా అయ్యాక రావడమే సేఫ్‌ అని డియర్‌ కామ్రేడ్‌ ఈ డేట్‌ ని ఎంచుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపో ఎల్లుండో రావొచ్చు. సో విజయ్‌ దేవరకొండ రష్మిక మందన్న ఫ్యాన్స్‌ జూలై చివరి దాకా వెయిట్‌ చేయక తప్పదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here