మహర్షికి నాన్న సెంటిమెంట్‌

0

ఇంకో వారం రోజుల్లో విడుదల కానున్న మహర్షి కోసం అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. నిన్న వచ్చిన ట్రైలర్‌ కనివిని ఎరుగని అద్భుతం అనిపించకపోయినా కంటెంట్‌ మీద నమ్మకాన్ని కలిగించడంతో వంశీ పైడిపల్లి నిరాశ పరచడన్న భరోసా అయితే దొరికింది. అయితే మహేష్‌ కు మే నెల కలిసి రాదన్న నెగటివ్‌ సెంటిమెంట్‌ ప్రచారంలో ఉన్న నేపధ్యంలో దానికి ధీటుగా క ష్ణ ఫ్యాన్స్‌ ఘట్టమనేని ఫ్యామిలీకి అందులోనూ మహేష్‌ నాన్న క ష్ణ గారికి అద్బుతమైన హిట్స్‌ ఉన్న నెలగా మే గురించే చెబుతున్నారు. ఆయన వందో సినిమా అల్లూరి సీతారామరాజు విడుదలై చరిత్ర స ష్టించింది మే నెలలోనే. ఇదే కాదు క ష్ణ మహేష్‌ ల కాంబోలో రూపొంది హిట్‌ అయిన ఆయుధం వచ్చింది కూడా ఈ నెలలోనే. వీటితో పాటు భోగిమంటలు-టక్కరి దొంగ చక్కని చుక్క-పండంటి సంసారం-ఆస్తులు అంతస్తులు-దొంగల దోపిడీ-సాహసమే నా ఊపిరి ఇలా మొత్తం 29 క ష్ణ సినిమాలు మేలోనే రిలీజయ్యాయి. ఇందులో ఒకటి అరా తప్పిస్తే అన్ని కమర్షియల్‌ హిట్సే. సో ఈ సెంటిమెంట్‌ ఈ సారి మహేష్‌ కు ఫేవర్‌ గా ఉంటుందని ఫ్యాన్స్‌ మాట. దీన్నే సోషల్‌ మీడియాలో హై లైట్‌ చేస్తూ కామెంట్స్‌ కి బదులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్ని ఎలాగున్నా ఫైనల్‌ గా మాట్లాడాల్సింది కంటెంట్‌ కాబట్టి అది సరిగా ఉంటె ఇవేవి అక్కర్లేదు. సోషల్‌ మెసేజ్‌ మిక్స్‌ చేస్తూనే అన్ని హంగులు ఉండేలా దర్శకుడు వంశీ పైడిపల్లి తీసుకున్న శ్రద్ధ మహర్షి మీద అంచనాలు పెంచేలా చేసింది. సరిగ్గా వచ్చే గురువారం మహర్షి రచ్చ ఎలా ఉండబోతోందో చూడొచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here