సినిమా వార్తలు

సిబిసిఐడి ఆఫీసర్‌గా అరవింద స్వామి

తమిళ చిత్రం ‘తనీ ఒరువన్‌’తో అరవింద స్వామి సినిమాల్లోకి రీమేక్‌ ఇచ్చిన సంగతి తెలసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్‌ ‘ధృవ’లో కూడా ఈయనే విలన్‌గా నటించారు. అప్పటి నుండి విలన్‌గా, హీరోగా సినిమాలను చేస్తూ వస్తున్నారు. రీ ఎంట్రీ తర్వాత స్కిప్‌ట్స్‌ ఎంపికలో ఈ సీనియర్‌ హీరో అచితూచి అడుగులేస్తున్నారు. ‘నాగాసురన్‌’ సినిమా తర్వాత ఆయన మరో సినిమాలో నటించకపోవడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే అరవిందస్వామి ఓ డిటెక్టివ్‌ థ్రిల్లర్‌లో నటించబోతున్నారు. ‘హరహర మహాదేవకి’, ‘ఇరుట్టు అరయిల్‌ మొరట్టుకుత్తు'(చీకటి గదిలో చితక్కొట్టుడు) వంటి అడల్ట్‌ కంటెంట్‌ మూవీస్‌ను డైరెక్ట్‌ చేసిన సంతోష్‌ పి.జయకుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇప్పటి వరకు సంతోష్‌ తెరకెక్కించిన చిత్రాలకు భిన్నంగా థ్రిల్లర్‌ జోనర్‌లో సాగే చిత్రమిది. ఇందులో అరవిందస్వామి సి.బి.సి.ఐ.డి ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు. నిజ ఘటనల ఆధారంగా సినిమా రూపొందనుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close