బిజినెస్

మళ్లీ వడ్డీరేట్ల కోతకు మొగు

న్యూఢీల్లీ : దేశ ఆర్థిక వ ద్ధిని పెంచేందుకు గత రెండు ద్వైమాసిక సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను తగ్గించిన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరోసారి వడ్డీరేట్ల కోతకు మొగ్గుచూపనుందట. జూన్‌లో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించే అవకాశాలున్నట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా వేస్తోంది. ‘దేశీయంగా, అంతర్జాతీయంగా వద్ధి నెమ్మదించడం, భారత్‌లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యాల కంటే తక్కువగా ఉండటంతో జూన్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయి. అయితే జూన్‌ తర్వాత ద్రవ్యోల్బణ ఒత్తిడి, ద్రవ్యలోటును దష్టిలో పెట్టుకుని రేట్ల కోతకు మొగ్గుచూపకపోవచ్చు. అంటే జూన్‌ తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చు’ అని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ తాజా నివేదికలో తన అంచనాలు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో జరిగిన ద్వైమాసిక సమీక్షల్లో 25 బేసిస్‌ పాయింట్ల చొప్పున కీలక వడ్డీరేట్లను తగ్గించింది ఆర్‌బీఐ. దీని ప్రకారం.. ప్రస్తుతం రెపో రేటు 6శాతంగా ఉంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close