Featuredస్టేట్ న్యూస్

నిజాయితీకి చెప్పుదెబ్బలు.. కేసులు

తనకున్న పాత ఇంటిని కూల్చివేసి కొత్త ఇంటిని నిర్మించాలని అనుకున్నాడు కంటోన్మెంట్‌ బోర్డు ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి. దీనికి కావలసిన అనుమతుల కోసం కంటోన్మెంట్‌ బోర్డు అధికారుల దగ్గరకు వెళితే ఎనిమిది లక్షల రూపాయలు లంచం ఇస్తేనే పనిఅవుతుందని చెప్పారు.అన్ని సక్రమంగా ఉన్నా లంచం ఎందుకు ఇవ్వాలని ఆ వ్యక్తి నిరాకరించారు. ఇలా అతను లంచం ఇవ్వడానికి నిరాకరించినందుకు ఏడాదిన్నర కాలం గడిచిపోయినా ఇంటి నిర్మాణం అనుమతులు రాకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కారు, లంచం అడిగిన అధికారుల మీద న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసులు పంపించారు.మాపైనే లీగల్‌ నోటీసులు పంపిస్తావాఅని..అది ద ష్టిలో పెట్టుకుని ఓ అధికారిని బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి ఏకంగా బాధితులపై దుర్భాషలాడుతూ, చెప్పుదెబ్బలు కురిపించింది.పోలీస్‌ స్టేషన్కు వెళితే అక్కడ కూడా అతనికి నిరాశే ఎదురైంది.పోలీసులు తీరా ఆ బాధితులు పైన కేసులు నమోదు చేసి పోలీసులు తమ పక్షపాత ధోరణి చాటుకున్నారు.ఈ సంఘటన సికింద్రాబాద్‌ నార్త్‌ జోన్‌ పరిధిలోని మారేడ్పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

  • వేధిస్తున్న అధికారినిపై ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు.
  • బాధిత పిర్యాదుదారుడిపైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు
  • ఇంటి నిర్మాణం కోసం ఏడాదిన్నరగా చెప్పులరిగేలా తిరిగినా బాధితుడు
  • కంటోన్మెంట్‌ బోర్డు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శ
  • మరెడ్‌ పల్లి పోలీసుల మాయా

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మారేడ్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే దశరథ రామ్‌ రెడ్డి లాల్బజార్‌ లోని ఎలక్ట్రికల్‌ డిపార్ట్మెంట్‌ లో లైన్మెన్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. మారేడ్పల్లి లోని ప్లాట్‌ నెంబర్‌ 1 1 5 లో తనకు ఉన్న 120 గజాల స్థానంలో పాత ఇంటి నిర్మాణాన్ని కూల్చేసి కొత్త ఇల్లును నిర్మిం చాలనుకున్నాడు. ఇంటి నిర్మాణ అనుమతులకోసం గత రెండు సంవత్సరాలుగా కంటోన్మెంట్‌ బోర్డు అధికారుల చుట్టూ తిరు గుతున్నాడు. తను ఇల్లు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని అధికా రులను ప్రాధేయపడ్డాడు.ఇంటి నిర్మాణం చేయాలంటే 8 లక్షలు లంచం ఇవ్వాలని బాధిత రాంరెడ్డిని కంటోన్మెంట్‌ బోర్డు అధి కారిని సరిత డిమాండ్‌ చేసిందని ఆరోపించారు. ఇంటి నిర్మా ణానికి అన్ని ధ్రువ పత్రాలు ఉన్న నేనెందుకు లంచం ఇవ్వాలని భారతీయుడు సినిమా లో కమల్‌ హాసన్‌ స్థాయిలో కంటోన్మెంట్‌ అధికారులకు రాం రెడ్డి చెప్పాడు.డబ్బు ఇవ్వకపోతే ఇంకా పది సంవత్సరాలు అయినా నీకు ఇంటి నిర్మాణ అనుమతులు దొరకదని.. నువ్వు కంటోన్మెంట్‌ బోర్డు చుట్టూ తిరుగుతూనే ఉండాలని అధికారిని చెప్పినట్లు బాధితుడు చెప్పాడు.పైసలిస్తేనే పని ఐతడిని అధికారులు నిక్కచ్చిగా చెప్పారని బాధితుడు వాపో యాడు.తనను లంచం అడిగిన అధికారులపై న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసును పంపించి ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన ఉన్నతాధికారులు ఆ అధికారినిపై చర్యలు తీసుకోక పొగ నిర్లక్ష్యంగా భాదితునికి సమాధా నమిచ్చారు. చేసేది లేక బాధితుడు రామ్‌ రెడ్డి సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించాడు. బాధితుడి వర్షన్‌ విన్న కోర్టు స్టేటస్కు మెంటేన్‌ చేయాలని ఆర్డర్‌ ఇచ్చింది. అయినా కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు అతని ఇంటి వద్దకు వెళ్లి తరచూ అతనికి, అతనికి ఇంటి సభ్యుల్ని వేధిస్తున్నారని కోర్టులో ఆపిల్‌ చేశాడు. ఇది తెలుసుకున్న కంటోన్మెంట్‌ అధికారిని సరిత బం దం అతని ఇంటి వద్దకు సోమవారం 27/01/2020 ఉదయం వెళ్లి అతనిపై చెప్పుదెబ్బలు కొట్టి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దుర్భాషలాడారు.వెంటనే బాధితుడు గాంధీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి 11గంటల సమయం లో మారేడ్పల్లి పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి కంటోన్మెంట్‌ బోర్డు లో పనిచేస్తున్న సర్వేయర్‌ సరిత తనపై దాడి చేసిందని ఫిర్యాదు చేశాడు. తనపై చెప్పుదెబ్బలు కొడుతూ తన పై దాడి చేసి దుర్భాషలాడిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అదే రోజు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో కంటోన్మెంట్‌ బోర్డు అధికారిని సరిత పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి తన విధులకు ఆటంకం కలిగిస్తూ తనపై దుర్భాషలాడాడని బాధితుడు రాంరెడ్డి పై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కొద్దిసేపడికే బాధిత రామ్‌ రెడ్డి పైనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తమ పక్ష పాత ధోరణి చాటుకున్నారని బాధితుడు రాంరెడ్డి ఆరోపించారు. ఉద యం అధికారినిపై తాను ఫిర్యాదు చేస్తే చర్యలు చేపట్టని మారే డ్పల్లి పోలీసులు సాయంత్రం అధికారిని తనపై(రాంరెడ్డి)పై ఫిర్యా దు చేసే తనపై పై ఎఫ్‌ఐర్‌ నమోదు చేసి తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని బాధితుడు వాపోయాడు.అన్యాయం జరిగింది నాకు.. అధికారిని తనపై దాడి చేసిందని నేను ఫిర్యాదు చేస్తే నా ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా మారేడ్పల్లి పోలీసులు తన పైనే కేసు నమోదు చేసి తన ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని బాధితుడు వాపోయాడు.అర్ధబలం, అంగబలం ఉంటేనే పోలీస్‌ స్టేషన్లో న్యాయం జరుగుతుందని.. సామాన్యుడికి న్యాయం జరగడం లేదని బాధితుడు రామ్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు నిజానిజాలు తెలుసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.

గతంలోనూ మారేడ్‌ పోలీసులపై విమర్శ.. గత సంవత్సరం మే నెల 18 వ తేదీన సత్యనారాయణ అనే జర్నలిస్ట్‌ ఇంటర్వ్యూ నిమిత్తం జిహెచ్‌ ఎంసి సికింద్రాబాద్‌ జోన్‌ కార్యాలయంలోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఏసిపి కుద్దుస్‌ వద్దకు వెళ్ళాడు.కుద్దుస్‌ తో మాట్లాడుతున్న సమయంలో ఏసీపీ క్యాబిన్‌ లోకి హటాత్తుగా కుమార్‌,శ్రీధర్‌ చారి అనే వ్యక్తులు వారి అనుచరులు ఇద్దరితో వచ్చి తనను బెదిరిం చారు.మా భవనం ఫొటో పెట్టి మీ పత్రిక లో(ఆదాబ్‌ హైదరాబాద్‌) న్యూస్‌ రాస్తావా.. ఎంత ధైర్యంఅని… దుర్భాషలాడుతూ, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఏసీపీ కుద్దుస్‌ ముందే బెదిరించి అక్కడినుండి వెళ్లిపోయారు.తరువాత కొద్దీ సమయానికి కుమార్‌, శ్రీధర్‌ చారి అతని అనుచరులు ఇద్దరిపై లిఖిత పూర్వకంగా మరెడ్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ లో పిర్యాదు చేశాడు సత్యనారాయణ. పిర్యాదు పై ఆన్లైన్‌ రిషిప్ట్‌ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు పోలీసులు.15 రోజుల అనంతరం.. సత్యనారాయణ ను బెదిరించిన వారిలో ఒకరైన కుమార్‌ తనపై తనతోటి ఉద్యోగి పై ఆధారాలు లేని పిర్యాదు చేశారు.తాను ఇచ్చిన పిర్యాదు పై చర్యలు చెప్పటని మరెడ్‌ పల్లి పోలీ సులు, ఇంసిడెంట్‌ జరిగిన 15 రోజుల తర్వాత1/06/2019 రోజున తమపై పిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తమ పక్ష పాత ధోరణిని మరెడ్‌ పల్లి పోలీసులు చూపారని సత్యనారాయణ ఆరోపించారు. భాదితులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌ కు రావాల్సిన అవసరం లేదని పెట్రోలింగ్‌ వాహనం లో నేను ఫిర్యాదు చేయొచ్చు అని సిపి అంజనీ కుమార్‌ ఒకవైపు ఆదేశాలు జారీ చేస్తే వాటిని విస్మరిస్తున్న నార్త్‌ జోన్‌ పోలీసులు ఫిర్యాదుదార్ల పైనే ఎఫ్‌ఐఆర్లు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నార్త్‌ జోన్‌ పోలీసుల తీరుపై పోలీసు ఉన్నతాధికారులు దష్టి సారించి చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close