ప్రతిభ ఉంటే ఐఎఎస్ లేదా ఐపీఎస్ అవ్వడం ఎంతో సులభం

0

ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అనేది మీ కలా? ప్రస్తుత కాలంలో సివిల్ సర్వీసెస్ పరిధి ఎంతో విసృతం అయ్యింది. ఎంతోమంది విద్యార్ధులు ఐఏఎస్ కావాలి అని కలలు కంటున్నారు. ఈ కలని సాకారం చేసుకోవడానికి చాలామంది విద్యార్ధులు నిత్యం కృషి చేస్తున్నారు. అయితే 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులకి ఇదే అద్భుతమైన ఆవకాశం. ఈ నెల 13వ తేదిన ఉదయం 10 – 1 వరకు వరంగల్ లో టాలెంట్ టెస్ట్ గురుకుల్ ది స్కూల్, బాలసముద్రం, హనుమకొండలో జరగబోతోంది. యువగ్యాని టీం తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్‍లోని అన్ని జిల్లాలకి పర్యటించి అఫ్‍లైన్ పరీక్షని నిర్వహిస్తారు. ఈ సంధర్భంగా గురుకుల్ ది స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలతా రెడ్డి గారు పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సంధర్భంగా ఆవిడ మాట్లాడుతూ “ప్రతిభ ఉన్న విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం అనీ, దీనిని వినియోగించుకొమని” సూచించారు. జిల్లాలలో మరియు ఆన్లైన్ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులు అందరూ రెండవ రౌండ్‍కి అర్హులే. అందులో నుండి 50 మందిని ఫైనల్ రౌండ్‍కి ఎంపిక చేస్తారు. అర్హత పొందిన 50 మంది నుండి మొదట వచ్చిన ముగ్గురికి ఇగ్నైట్ ఐఏఎస్ (ignite IAS) సంస్థ, హైదరాబాద్ వారు వచ్చే 5 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి ఉచిత శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో గురుకుల్ ది స్కూల్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు, వైస్ ప్రిన్సిపాల్ తెష్విక్ గారు, ఇగ్నైట్ ఐఏఎస్ (ignite ias) సంస్థ చీఫ్ మెంటార్ ఎన్.ఎస్. రెడ్డి గారు, డైరెక్టర్ చింతం శ్రీనివాస్ గారు, ప్రిన్సిపల్ జాన్ రుఫస్ మరియు యువగ్యాని స్వచంధ సంస్థ ప్రతినిధులు భార్గవ, హరీష్, విజయ్ శ్రీరాముల గారు పాల్గొన్నారు. వీరు అన్ని జిల్లాల్లో పర్యటించి విద్యార్ధులకి ఉచిత అవగాహన సదస్సులు నిర్వహించి వారికి, వారి తల్లితండ్రులకు సివిల్ సర్వీసెస్ పరీక్షల గురించి ఉండే సందేహాలు తీరుస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఎంతో మంది విద్యార్ధులు ఈ పరీక్ష రాసి తమ వంతు ప్రయత్నం చేశారు. మీరు కూడా ఈ పరీక్షకి వెంటనే రిజిస్టర్ చేసుకోవడానికి www.yuvagyani.com సంప్రదించండి లేదా ఈ నెంబర్లకి ఫోన్ చేయండి: 9000014827, 9000014830.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here