Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

జాతీయ¬దా…. సుడి’గండం’లో సిపిఐ

అదే బాటలో ఎన్సీపీ, తృణమూల్‌ పార్టీలు

? స్వయంకృతపరాధమే..!

? ఇప్పటికి బయటపడ్డ సిపిఎం

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

స్వతంత్ర భారతావనిలో ఓ ఎర్రపార్టీ కాలగర్భంలో కలవనున్నదా..? మళ్ళీ కోలుకొని పోరుబాటలో నిలబడుతుందా..? అంటే కాలం చెప్పాల్సిన భేతాళప్రశ్న. అసలు విషయం ఏమిటంటే సామ్రాజ్య వాదం, చట్టుబండలు, బూజు పట్టిన బూర్జువా కహానీలను ప్రజలు పట్టించుకోవడం మానేశారు. ఇదే పంథాలో వెళితే కమ్యూనిస్టుల పని అయిపోతోంది. వారి సిద్ధాంతాలను, ఆచరణ తీరును ప్రజలు తిరస్కరిస్తున్నారు. దానికి ప్రబలతార్కాణం మొన్నటి ఎన్నికల్లో వాళ్లు సాధించిన సీట్ల సంఖ్య. ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ పార్టీ ¬దా ను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కోల్పోనుంది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న విశ్లేషణ కథనం.

కొంపముంచిన ‘దేబిరింపు’:

తమిళనాడులో డీఎంకేతో కలిసి సాధించిన ‘భిక్ష సీట్లు’ తీసేస్తే? దేశం మొత్తం విూద కమ్యూనిస్టులు సొంతంగా సాధించిన సీట్ల సంఖ్య ఒకటంటే ఒక్కటి. కేవలం ఒక్కటి మాత్రమే. బెంగాల్లో దారుణంగా దెబ్బతిన్నది. త్రిపురలో డౌనయిపోయింది. కేరళలో ప్రతికూలత మొదలైంది. దేశంలో వామపక్షాల స్థితిగతులపై ఇలాంటి విశ్లేషణలు పార్టీల అంతర్గతంగా వాడిగా, వేడిగా సాగుతున్నాయి.

పాపం సిపిఐ:

సీపీఐపై మరో వేటు పడబోతున్నది. త్వరలో అది జాతీయ పార్టీ ¬దాయే కోల్పోనున్నది. సీపీఎం పార్టీకి ప్రస్తుతానికి వచ్చిన ముప్పేవిూ లేదు కానీ, కొన్నేళ్లు గడిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే దాని జాతీయ ¬దా కూడా ప్రమాదంలో పడినట్టే.

గతంలోనే పోయేది..కానీ..:

నిజానికి సీపీఐ జాతీయ పార్టీ ¬దా 2014 ఎన్నికల ఫలితాల అనంతరమే ప్రమాదంలో పడింది. కానీ అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓ నియమానికి సవరణ చేయడం వల్ల అది అదృష్టం కొద్దీ తప్పిపోయింది. ఐదేళ్లకోసారి గాకుండా పదేళ్లకోసారి ఈ ¬దాల రివ్యూ చేయాలనేది ఆ నియమ సవరణ జరిగింది. దీంతో నాడు సిపిఐ బయటపడింది. చూస్తుండగానే ఇప్పుడిక ఆ పదేళ్లూ గడిచాయి. మొన్నటి ఎన్నికల్లోనూ చతికిలపడింది. ఈసారి ఎన్నికల సంఘం నుంచి ఈ ప్రక్రియకు సంబంధించిన నోటీసు అందుకోవాల్సిందే.! అదేకాదు, తృణమూల్‌ పార్టీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీల జాతీయ ¬దాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి.

ప్రస్తుతం దేశంలో ఏడు పార్టీలే జాతీయ ¬దా కలిగి ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, ఎన్సీపీలు ఉన్నాయి. వీటిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఢోకా లేదు. జాతీయ ¬దా గుర్తింపు కొనసాగింపు విషయంలో 2014 ఎన్నికల తరువాత ఇదే పరిస్థితి ఏర్పడింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఈ ‘అవసరమైనన్ని’ సీట్లు సాధించడంతో ఈ ప్రమాదం తప్పించుకున్నట్టే కనిపిస్తోంది. ఈసారికి సీపీఎంకూ పర్లేదు. ఇక ఉన్న సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీలకు మాత్రమే ముప్పు పొంచిఉంది. నిజానికి సీపీఐ, సీపీఎంలకు చాలాచోట్ల ఓట్లున్నయి. కానీ టీఎంసీ, ఎన్సీపీ మరీ మహారాష్ట్ర, బెంగాల్‌ రాష్ట్రాలకే పరిమితం. ఆ పార్టీల స్థూల కార్యాచరణ, భావజాలం, ఆలోచనలు కూడా ఆ రాష్ట్రాలను దాటి ఉండవు. రావడానికి అవి ఇష్టపడవు.

ఇవే నిబంధనలు:

జాతీయ ¬దా కావాలంటే, లేదా కొనసాగాలంటే? కనీసం నాలుగు లేదా అంతకుమించి రాష్ట్రాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోకసభ ఎన్నికల్లో గానీ కనీసం 6 శాతం వోట్లు సంపాదించాలి. అలాగే కనీసం నాలుగు లోకసభ సీట్లయినా గెలుచుకోవాలి. కనీసం 3 రాష్ట్రాల్లో కలిపి రెండు శాతం సీట్లనయినా లోకసభకు గెలుచుకోవాలి అంతేకాదు, నాలుగు రాష్ట్రాల్లోనయినా అది గుర్తింపు పొందిన పార్టీ అయి ఉండాలి.

మారిన సిపిఎం నిలిచింది ఇలా:

కేంద్ర రాష్ట్రాల్లో పాలక పార్టీలను ఓడించేందుకు తక్షణ కర్తవ్యాల్లో నిమగ్నం కావడం వల్లే బలం పెంచుకోలేక పోయామని, పార్టీ స్వతంత్రంగా ఎదగలేకపోవడానికి ఇదే కారణమని, మూడో ప్రత్యమ్నాయ ప్రయోగం కూడా పార్టీకి అంతగా లాభించలేదని సీపీఎం జాతీయ మహసభలు అభిప్రాయపడ్డాయి. ఈ మార్పు కారణంగానే ఆ పార్టీ జాతీయ ¬దాను కాపాడిందని చెప్పవచ్చు. సొంతంగా బలం పెంచుకునే దిశలో భవిష్యత్తు కార్యచరణను రూపొందింకోవాలని విశాఖలో జరుగిన ఈ మహాసభ నిర్ణయించింది. గత 25 సంవత్సరాల కాలంలో అవలంభించిన ఎత్తుగడలపై సవిూక్షించారు. హైద్రాబాద్‌ లో జరిగిన కేంద్రకమిటీ ఈ ముసాయిదాను రూపొందించింది. అన్ని స్థాయిల్లో పార్టీ శాఖలు చర్చించి 1432 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 29 సవరణలను జాతీయ మహసభలు ఆమోదించాయి. అదే సిపిఐ విషయానికి వచ్చే సరికి సీట్లు, పొత్తుల కోసం ఇతరపార్టీల గుమ్మాల వద్ద పడిగాపులు కాచింది. ఇది తెలంగాణ ఎన్నికల సమయంలో మరీ దిగజారినట్లు కనిపించింది. ప్రజల మనసెరిగిన కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంతో దూసుకెళుతున్న సందర్భంలో సుధీర్ఘ పోరాట చరిత ఉన్న ఈ ఎర్ర పార్టీలు సరైన దిశలో స్పందించకపోవడం, ఇతర రాష్ట్రాల్లోని నాయకత్వ లేమి ఈదుస్థితికి కారణం.

ముక్తాయింపు ముగింపులో..:

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ నుంచి ఓ రెబల్‌ నామినేషన్‌ ను అడ్డుకోవడం వంటి సంఘటనలు సిపిఐ పార్టి ప్రతిష్టను పరోక్షంగా దెబ్బతీశాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో పార్టీ సిద్దాంతాలను పక్కన పెట్టి వ్యక్తి ఆరాధన చేయడం, ఎన్నికల ముందు ‘బూర్జువా పార్టీలు’ అంటూ తిట్టిన పార్టీలనే బలపర్చటం వంటి సంఘటనలతో ఎర్రటి నిప్పుకు చెదలు పట్టినట్లు అయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close