Featuredరాజకీయ వార్తలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోవర్ట్‌ ఆ’పరేషన్‌’..

(అనంచిన్ని వెంకటేశ్వరరావు న్యూఢిల్లీ ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అంతర్గతంగా పదవుల కోసం జరిగిన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు తెరాస అధిష్టానాలకు మింగుడు పడని చేదు వాస్తవాలు ఒకొక్కటిగా ఆధారాలతో బయటపడుతున్నాయి. అధిష్టానాలకు అందిన ఆడియో టేపుల ఆధారాలతో కొందరి రాజకీయ జీవితాలకు ‘తెర’పడే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీలో ఓ పెద్దాయనపై ఏకంగా 6.5 కోట్ల విలువచేసే ప్లాటు తాయిలంగా

ఏకంగా తెరాసను చీల్చే విధంగా కోవర్టు ఆపరేషన్‌ జరిగింది. గులాబీ దళపతికి ముందే ఉప్పు అందటంతో ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కుట్రకు కేంద్రంగా ఉన్న ఖమ్మంలో మాత్రం తెరాస ఎదురుదెబ్బ తింది. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’కు అందిన ఆడియో రికార్డుల మేరకు ఈ సంచలన పరిశోధన కథనం.

కుంతియాకు 6.5కోట్ల ప్లాట్‌:

హైదరాబాద్‌, కొండాపూర్‌, ఓ స్కూల్‌ పక్కనే ఉన్న అతి ఖరీదైన ప్లాట్‌ ఒకటి ఖమ్మం అసెంబ్లీ స్థానం ఆశించిన ఓ గ్రానైట్‌ వ్యాపారి నుంచి కుంతియా బినావిూగా చెప్పబడుతున్న ఒడిసం (భద్రత కారణాల దృష్ట్యా పేరు మార్చాం) అనే వ్యక్తి పేరుతో కొనుగోలు జరిగినట్లు తెలిసింది. ఏఐసీసీ కీలక సభ్యులు కొప్పులరాజుపై కూడా నగదు మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది. వైరా సీటు ఆశించిన ఓ అభ్యర్థి నుంచి కాంగ్రెస్‌ నాయకుడు నల్ల రంగు స్కార్పియో అదనపు తాయిలంగా పొందినట్లు తెలిసింది. అయితే టిపిసిసి అధ్యక్షుడి పేరు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. అయితే ఏఐసీసీ అధిష్టానానికి అందిన మరో ఆడియోలో భక్తచరణ్‌ దాస్‌ కుమారుడి పేరు ప్రముఖంగా ప్రస్థావన వచ్చింది. ఏకంగా ఓ అభ్యర్థి డబ్బులు చేతులు మారుతున్న ఫిర్యాదుకు వీడియో సాక్ష్యం జతపర్చారు.

గులాబీ’షాక్‌’:

వంద సీట్లు ఖాయమని పదేపదే చెప్పిన గులాబీదళపతికి ఊహించని శరాఘాతం ముందే తెలిసింది. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకార్యదర్శి మల్లు భట్టి విక్రమార్క, తెరాస పార్టీకి చెందిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు ప్రస్థావనకు రావడం గమనార్హం. ఏమాత్రం తేడా వచ్చినా.. హంగ్‌ దిశగా అసెంబ్లీ వెళ్ళినా వీరు తమ ఆయుధాలు కలసికట్టుగా వాడటానికి సిద్దంగా ఉన్నట్లు ఇద్జరు ప్రముఖుల సంభాషణ ఉంది. అయితే గులాబీ దళపతికి ఈ ముందస్తు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సకల జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుసింది. దానికి తోడుగా ‘చిన్నదొర’ అనుక్షణం నియోజకవర్గ స్థాయిలో అనేక సవిూక్షలు జరిపారు. దీంతో ఖమ్మం కేంద్రంగా జరిగిన ‘హంగామా’ కుట్ర కేవలం ఖమ్మం ఉమ్మడి జిల్లాకే పరిమితమైంది. గులాబీ దళపతి సవిూక్షలో ఈ ఆడియో రికార్డుల ప్రస్థావన లేకుండా అన్ని విషయాలను కడిగి పారేశారు.

హంగ్‌ వస్తే..:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు ఏ పార్టీకి వచ్చినా చీలికలకు ముందే రంగం సిద్ధం చేసుకున్నారు. తెరాసకు మెజారిటీ వస్తే ఇందులో ప్రధానంగా హరీష్‌ రావును తెరపై చూపి పబ్బం గడుపుకోవాలని ఓ వర్గం భావించింది. అయితే హరీష్‌ రావు మాత్రం ఏరోజు ఆ ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ వస్తే తెరాసలో ఉన్న బిసి నాయకులకు తెలుగుదేశం ద్వారా గాలం వేయడానికి ఖమ్మం సీనియర్‌ నాయకుడు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి నేతలు, తెరాసలోని రెడ్డి నేతలు జతకట్టి ముందుకు సాగాలని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ దళిత నేత భావించారు. అయితే ఫలితాలతో అన్ని పరిస్థితులు తల్లకిందులు కావడంతో తాత్కాలికంగా ‘కోవర్ట్‌ ఆపరేషన్‌’లకు తెరపడింది. కానీ నెమ్మదిగా ఆ, యా అధిష్ఠానాలకు మాత్రం సీరియస్‌ గా జాబితాలో పేర్లు అందాయి. మరి ఈ నాయకుల భవిష్యత్‌ ఏమిటనేది కాంగ్రెస్‌ లో ఓ విధంగా, తెరాసలో మరో విధంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల భావన.

(రేపటి సంచికలో ‘కుట్ర’ కోణంలో… ఎవరు..?)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close