Featuredస్టేట్ న్యూస్

లెక్కలేని ఆరోగ్యం..

రోగుల ప్రాణాలంటే ఆలుసే..

ఆనారోగ్యాలపై స్పందనే లేదు..

ప్రతి నలుగురిలో ఒకరికి డెంగ్యూ..

అవస్థలు పడుతున్న ప్రజలు..

ఆనారోగ్యంతో తెలంగాణ తల్లడిల్లుతోంది.. వచ్చిన రోగానికి వైద్యం చేపించుకునే స్థోమత లేక సామాన్య ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారిపోయాయి. డబ్బులుంటేనే వైద్యం లేదంటే మరణమే దిక్కుగా మారిపోయింది. ఆనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులు పరిస్థితి మాత్రం మరీ ఆధ్వాన్నంగా ఉంది. అక్కడ వైద్యం అందినప్పుడు, రోగి బతికినప్పుడు అన్న చందంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు ఉన్న దగ్గర వైద్యులుండరు. వైద్యులు ఉన్నదగ్గర కనీస వసతులు కరువైపోయాయి. అసలు రాష్ట్రంలో వీరవిహరం చేస్తున్న రోగాలేవీ. వాటి నిర్మూలనకు తీసుకున్న చర్యలేవి అంటూ మాత్రం ఎక్కడ సమాధానమే దొరకడం లేదు. ప్రజల ప్రాణాలను తీస్తున్న డెంగ్యూ మరణాల లెక్క ఏ ఒక్కరి దగ్గర కనబడడం లేదు. నాయకులు నాలుగు అంటే అధికారులు రెండు మరణాలే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో రెండే డెంగ్యూ మరణాలు సంభవిస్తే మంచిర్యాల జిల్లాలోని ఒకే కుటుంబంలో నలుగురు ఏలా చనిపోయారంటే మాత్రం ఏ ఒక్కరి నోట నుంచి సమాధానం రావడం లేదు. ప్రజల ప్రాణాలంటే లెక్కేలేదు.. ఆనారోగ్యానికి గురైనవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులుండవు.. కార్పోరేట్‌ ఆసుపత్రులకు వెళుదామంటే డబ్బులుండవు.. ఏమి చేయాలో తోచక మధ్యలోనే ప్రాణాలు కొల్పతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో డెంగ్యూ వ్యాధి విరవీహరం చేస్తున్నా దాని నిర్మూలన కోసం చర్యలు చేపట్టినా దాఖలాలే లేవు. రాష్ట్రమొత్తం ఆనారోగ్యంతో తల్లడిల్లుతుంటే ప్రభుత్వం, ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు సైతం మొట్టికాయలు వేస్తోంది. రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి ఎప్పటినుంచి ఉంది. ఇప్పటివరకు ఎంతమంది మరణించారు. ఎంతమంది ఆనారోగ్యంతో ఉన్నారు వంటి కనీస సమాచారం ప్రభుత్వం దగ్గర లేనేలేకపోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో విజృంభిస్తున్న వ్యాధులపై, ప్రజల మరణాలపై నాయకులు, ప్రజల మధ్యనే కనీస సమన్వయం లేదని అర్ధమవుతోంది. రోగాల బారిన పడి రాష్ట్రమంతా ఆనారోగ్యానికి గురవుతున్నా ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ఉన్నత న్యాయస్థానం పలుమార్లు ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం అలసత్వం వలన ప్రజలు ప్రాణాలు కొల్పతున్నారని, ప్రజల ప్రాణాలకంటే ప్రభుత్వానికి అతి ముఖ్యపనులు ఏముంటాయో అర్థం కావడం లేదంటోంది హైకోర్టు.. హైకోర్టుతో పాటు ప్రతిపక్షాలు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యంపై కనీస చలనం రావడం లేదు..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

రోగాలు రాష్ట్రంతో ఆడుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలను అవలీలగా హరించివేస్తున్నాయి. వ్యాధుల తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉన్నా కాని వాటి నియంత్రణకు కనీస చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం. ఇప్పటికే ఆర్టీసీ విషయంలో తీవ్రంగా హెచ్చరిస్తున్న ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సమస్యలపై కూడా ప్రభుత్వానికి చురకలు అంటించింది. ఆర్టీసీ కార్మికులు సమస్యలు నేరవేర్చలేదు. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పుడు ఆనారోగ్యంతో తల్లడిల్లుతున్న ప్రజలు రక్షించలేకపోతున్నారంటూ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తీవ్రంగా పెరిగిపోతున్న డెంగ్యూను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని అడుగుతోంది. కాని ఎవరి దగ్గర సరియైనా సమాచారమే లేదు. ఆనారోగ్య విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఘాటుగా హెచ్చరించగా ఇప్పుడు డెంగ్యూపై వచ్చిన మరో నివేదిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్న డెంగ్యూతో పాటు విషజ్వరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ బారిన పడి మరణించటం వల్ల రాష్ట్రంలో వ్యాధుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమైపోతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా రక్త నమూనా పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలో ప్రభుత్వానికి షాకింగ్‌లాంటి నిజాలు బయటపడినట్లు చెపుతున్నారు. తాజాగా వారు రూపొందించిన నివేదిక ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరికి డెంగ్యూ ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్‌ గున్యా విషజ్వరాల తీవ్రతను తెలియజేసేలా తాజా నివేదిక ఉన్నట్లు చెబుతున్నారు..

విపరీతంగా పెరిగిన డెంగ్యూ రోగులు

తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ రోగలు విపరీతంగా పెరిగాయని చెపుతున్నారు. ప్రభుత్వం రూపొందించిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో 40,434 మంది నుంచి రక్త నమూనాల్ని సేకరించగా, అందులో 10237 మందికి డెంగీ ఉన్నట్లు నిర్థారణ జరిగిందని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇలా ఉంటే అనధికార లెక్కల ప్రకారం ఇరవై వేల వరకు డెంగ్యూ బాధితులు ఉన్నట్లు చెపుతున్నారు. ఇంత జరిగినా డెంగ్యూ కారణంగా మరణాలు రెండేనని ప్రభుత్వం చెపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం లెక్కలు మాత్రం తప్పుగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వారందరి సంగతి కాసేపు పక్కనపెడుతే ఒక్క మంచిర్యాల జిల్లాలో ఒకే కుటుంబంలో డెంగ్యూ కారణంగా నలుగురు మరణించిన విషయంపై అధికారులు ఏం చెపుతారంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానమే లేదు. డెంగ్యూ విషజ్వరాలపై తాజాగా రూపొందించిన నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారటమే కాకుండా మరోసారి హైకోర్టు చేతిలో చీవాట్లు సిద్దం కావాలసిందేనంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలతో అల్లాడుతున్న ప్రజల ఆరోగ్యసమస్యలపై సమరశంఖం పూరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ద ప్రాతిపదికన జ్వరాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ప్రభుత్వం ఏలాంటి చర్యలు తీసుకుంటుందో, ఎప్పుడు ముందడుగు వేస్తుందో చూడాల్సిందే..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close