Featuredస్టేట్ న్యూస్

చేనేత సహకారంలో అవినీతి ఆడిటర్‌…

తెలంగాణ ఎన్జీవో నాయకుడు సహకార శాఖలో 20 సంవత్సరాలకు పైగా ఆడిటర్‌ గా అవినీతిని బయట పోక్క కుండా భద్రంగా కాపాడిన మర్గం రాజేష్‌కు ప్రభుత్వం నజరానా ప్రకటిం చింది. చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో రాష్ట్ర స్థాయి ఆడిట్‌ కోఆర్డినేటర్‌గా నియమిస్తూ మూడేళ్లపాటు నెలకు 50 వేల వేతనాన్ని చెల్లించా లని జీవో జారీ చేసింది, ఉద్యోగాల కోసమే, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడి అమరులైన వీరుల గుండెలను రాజేష్‌ నియామకం తూట్లు పొడిచింది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి తెరాస ప్రభుత్వ నిర్ణయం షాక్‌ లా తగిలింది. అవినీతి సామ్రాట్‌ ను అందలం ఎక్కించడం మేమిటని వెయ్యి గొంతుకలు ప్రశ్నిస్తున్నాయి.

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్రంలోని సహకార సంఘా లలో జరిగిన అనేక అవినీతి కుంభకోణాలను గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కు మనిపించిన ఆడిటర్‌ మర్గం రాజేష్‌ కు పదవి విరమణ పొం దిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘం లో ఉన్న తమైన పదవినిచ్చి సత్కరించడం చర్చనీయాం శంగా మారింది .రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌ వారి కార్యాలయంలో 20 సంవత్సరాల పాటు ఆడిటర్గా బాధ్యతలు నిర్వహించి అనేకమందికి అవినీతి వాటాలు పంచిన అధికారిగా, ఎన్జీవో నాయకునిగా, తన పలుకుబడితో, ఇచ్చినవారికి లేదనకుండా అనేక పైరవీలు చేసిన నాయకు నికిని, ప్రభుత్వం మరో మూడేళ్లు పాటు చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ఆడిట్‌ కోఆర్డినేటర్‌గా నియమించారు.మూడు సంవత్స రాల పదవీ కాలంలో నెలకు 50వేల రూపాయలు వేతనంగా చెల్లించడం పట్ల సైతం సర్వ త్రా నిరసన వ్యక్తమవుతోంది ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశతో ప్రాణా లకు తెగించి ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది రాజేష్‌ సంఘటనతో ముక్కున వేలేసుకుంటున్నారు. చేనేత కార్మికుల సహకార సంఘంలో పనిచేస్తున్న ఆడిటర్లు తమ పదవుల్లో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తుండగా ఏకంగా అవినీతి సామ్రాట్‌ ను అందలం ఎక్కిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చేనేత పారిశ్రామికుల సహకార సంఘాలలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవినీతి జరుగుతుందని దీని కారణంగా నేతన్న ల జీవితాలు తలక్రిందులు అయ్యే ప్రమాదం పొంచి ఉన్న ప్రభుత్వం రాజేష్‌ లాంటి వ్యక్తులకు మళ్లీ ఉద్యోగం కల్పించడం దారుణమైన విషయం అని వారు ఆగ్రహం వ్యక్త పరిచారు. చేనేత సహకార సంఘా లలో ఆడిటింగ్‌ నిర్వహించి వారి జీవితాలలో వెలుగు నింపాల్సిన బాధ్యతాయుతమైన పదవిని రిటైర్‌ అయిన, బాధ్యతలు ఎంత మాత్రం లేని ఓ వ్యక్తి చేతిలో గాలికి వదిలేయడం తీవ్రమైన విషయమని వారు పేర్కొన్నారు. సహకార సంఘా ల రిజిస్టార్‌ సహకార శాఖ కమి షనర్‌ ఎం .వీరబ్రహ్మయ్య అవినీ తికి నిలయమైన ఆడిటర్‌ ఎం. రాజేష్‌ను రిటైర్‌ కాకమునుపే చేనేత సహకార పారిశ్రామికుల సంఘంలో ఆడిట్‌ కోఆర్డినేటర్‌ గా 50 వేల వేతనంతో మూడు సంవత్స రాల పాటు పదవిలో ఉండే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేసేం దుకు ప్రభుత్వానికి ప్రపోజల్‌ను (కూవ్‌్‌వతీ చీశీ:జజడ=జూ, ువశ్రీaఅస్త్రaఅa, నవస/ ూవరష్ట్రఱ/ =ష, చీశీ. 05/2019, స్‌:28.01.2019) పంపించారు. ఐఏఎస్‌ అధికారి వీరబ్రహ్మయ్య సూచనతో ప్రభుత్వం రాజేష్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సహకార సంఘాల చరిత్రలో ఇప్పటివరకు ఏ అధికారికి ఇవ్వ నటువంటి విధంగా ఎం. రాజేష్‌ ను అందలం ఎక్కించడంతో సహకార శాఖ కమిషనర్‌ సైతం రాజేష్‌ అవినీతిని సమర్థించి తన వంతును స్వీకరించినట్లు స్పష్టమవుతోందని చేనేత కార్మికులతో పాటు పలువురు ఆడిటర్లు అనుమానాలు వ్యక్త పరిచారు. ప్రస్తుతం టెస్కో స్టేట్‌ ఆడిట్‌ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం. రాజేష్‌ సంస్థలోని పలు కుంభకోణాలు వెలుగులోకి రాకుండా చేతి వాటాన్ని ప్రదర్శిస్తాడని అందుకే ఆయనను సహకార శాఖ కమిషనర్‌ ఏరికోరి తెచ్చుకున్నాడని ఆరోపణలున్నాయి.

నన్ను ప్రభుత్వం నియమించింది : రాజేష్‌

చేనేత పారిశ్రామిక సహకార సంస్థలో రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్జీవో నాయకుడు ఎం.రాజేష్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధితో మాట్లాడుతూ తన నియామకం ప్రభుత్వం నిర్ణయమన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు సత్య దూరమని ఆయన ఖండించారు. తాను సమర్థ వంతంగా పని చేస్తున్నందుకు ప్రభుత్వం రిటైర్‌ మెం ట్‌ తర్వాత సైతం మూడేళ్లపాటు తన సేవలను కోరి విధుల్లో చేర్చుకుందని, బాధ్యతాయుతంగా తన విధు లను నెరవేరుస్తానని ఎం.రాజేష్‌ వివరించారు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close