అవినీతి ఆనకొండలు సరెండర్‌..

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాబందుల మించిన అవినీతి ఆనకొం డలు కథనానికి కదలిక వచ్చింది. ప్రభుత్వం నుంచి ప్రతి నెల వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రజలను లంచార రూపంలో పీక్కుతినే అధికా రులు కొకొల్లలు. ప్రభుత్వం ఒక పక్క రైతులందరికి అన్ని విధాలుగా ఆదు కుంటున్నామని చెపుతుండగా రెవె న్యూ శాఖలోని విఆర్వో, విఆర్వేలు అందిన కాడికి దండుకుంటూ రైతుల ను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అందులో భాగంగానే ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండ లంలోని రైతులకు అందాల్సిన భూమిని పట్టాలివ్వకుండా లంచాల కోసం వేధిస్తున్న రెవెన్యూ అధికారుల పనితీరుకు నిరసనగా మండల కేంద్రంలోని రైతులు అధికారులు న్యాయంగా చేయాల్సిన పనికి డబ్బులు అడుగుతున్నారని మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. ఇక్కడి రెవెన్యూ అధికారులు గత కొన్ని నెలల నుంచి రైతులకు చేయాల్సిన ప్రతి పనికి పైసలు వసూలు చేస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. విసిగి వేసారిన రైతులు బతకడానికి ఇబ్బందిగా ఉంటే అధికారులకు లంచం డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలని ప్రశ్నించిన అధికారులు వినడం లేదని రైతులు ఆరోపించారు. ఇంక చేసేదేమి లేక రెవెన్యూ అధికారులు తమకు న్యాయంగా రావాల్సిన భూమిని తమ పేరు మీద పట్టాలు ఇవ్వమని అడుగుతే లంచాలు అడుగుతున్నారని అందుకే బిక్షాటన చేశామని రైతులు ఆరోపించారు. రైతులు బిక్షాటన చేస్తున్న కథనాలను ఆధారంగా చేసుకొని ములుగు జిల్లా ఇంచార్జ్‌ కలెక్టర్‌ వారిపై విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగానే వచ్చిన రుజువుల ఆధారంగా వెంకటాపూర్‌ మండలంలోని లక్ష్మిదేవిపేట విఆర్వో వీరస్వామి, వెంకటాపూర్‌ విఆర్వో నాగరాజు, నల్లగుంట విఆర్వో రాజయ్యలను కలెక్టర్‌ ఆదేశానుసారం వెంకటాపూర్‌ తహశీల్దార్‌ దేవాసింగ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. దీంతో ఆయన విచారించి అందుకు బాధ్యులైన ఐనా వారిని గుర్తించి చర్యల నిమిత్తం కలెక్టర్‌ కార్యాలయానికి అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here