Featuredబిజినెస్

కరోనా భయం.. చైనాకు బయల్దేరిన ఎయిరిండియా విమానం

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కరోనా వైరస్‌ ఔట్‌ బ్రేక్‌తో భారత్‌ మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్‌ పుట్టిన చైనాలోని వూహాన్‌ సిటీలో చిక్కుబడిన సుమారు 400 మంది భారతీయులను స్వదే శానికి తిరిగి తీసుకురానున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ఎయిరిండియా విమానం శుక్రవా రం ఢిల్లీ నుంచి చైనాకు బయల్దేరింది. ఇది ఆరు గంటలపాటు ప్రయాణించి చైనా చేరుకుం టుం ది. ఈ బహత్‌ ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు..వూహాన్‌ నుంచి ఇక్కడికి తెచ్చే భారతీ యు లను ఢిల్లీ, హర్యానాలోని మానెసార్‌లలో గల ఆసుపత్రుల్లో 14 రోజులపాటు ఐసో లేషన్‌ సెం టర్లలో ఉంచుతారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్ఫెక్షన్‌ ముప్పు లేకుండా చూసే ందుకు అన్ని చర్యలూ తీసుకుంటారు. ఈ విమానంలో 5 గురుడాక్టర్లు, ఓపారామెడిక్‌ ఉంటారు. గ్లోవ్స్‌, మాస్కులు, అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. వైద్యులు, సిబ్బంది అంతా పూర్తి ప్రొటెక్టివ్‌ మాస్కులు ధరిస్తారు. వూహాన్‌లో కరోనా సోకనివారినే విమానంఎక్కేందుకు అను మతిస్తారు. ఇక పైలట్లు, వైద్యులు, ఇంజనీర్లు, సిబ్బంది తిరిగి వఛ్చిన అనంతరం వారి ఇళ్ల లోనే వారం రోజులపాటు వేరుగా ఉండాల్సి ఉంటుంది. వీరిలో ఎవరికైనా కరోనా వైరస్‌ సోకి న లక్ష ణాలు కనిపించిన పక్షంలో వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తారు. ప్రస్తుతం గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జె న్సీని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉదయం వరకు ఈ వ్యాధి కారణంగా సుమారు 200 మంది మరణించినట్టు అంచనా. వూహాన్‌ నుంచి కేరళ వచ్చిన ఓ మహిళను త్రిసూర్‌ లోని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రంలో దాదాపు 700 మంది పై వైద్య సంబంధ నిఘా ఉంది. మన ఎయిరిండియా విమానం వూహాన్‌ సిటీలో సుమారు రెండు, మూడు గంటల ఉంటుంది. రేపు తెల్లవారు జామున రండు గంటలకు తిరిగి భారత్‌ బయల్దేరుతుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close