పల్స్ పోలేదు వచ్చింది

0

★ నిషేధిత వాక్సిన్ సరఫరా
★ తెలంగాణ చిన్నారులపైనా
★ ఉత్తరప్రదేశ్, మహారాష్టలలో కూడా

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్) :భారత్ ‘పూర్తి స్థాయి పోలియో రహిత దేశంగా అవతరించబోతుంది’అంటూ వేసిన వాక్సిన్.. చిన్నారుల పాలిట శాపంగా మారనున్నది. పోలియో అరికట్టడానికి 2016, ఏప్రిల్ తరువాత వేసిన వాక్సిన్పో లియో వ్యాప్తి చేసే కారకంగా మారిన దిగ్భ్రాంతి కరమైన విషయం ఇది.

50 వేల నుంచి లక్షన్నర వయల్స్ కల్తీ వాక్సిన్ అభంశుభం తెలియని చిన్నారులకు వేశారు. పోలియో రావద్దని వేయించిన వాక్సిన్ కారణంగానే పోలియో వచ్చిపడుతుంది. అది టైప్-2 పోలియో వైరస్‌తోనే కల్తీ అయ్యింది. ఏప్రిల్ 2016 తరువాత పుట్టి, పోలియో చుక్కలు వేసిన పిల్లలో ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని తెలుస్తోంది. ఈ పోలియో చుక్కల మందు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఆ వ్యాక్సిన్ సరఫరా అయిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది.

ఇలా బయటపడింది: సీడీఎస్సీవో 13 వ్యాక్సిన్ బ్యాచులను పరీక్షించినప్పుడు ఈ సందేహం తలెత్తింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ రొటీన్‌గా కొన్ని మల పరీక్షలు చేసినప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఈ కల్తీ బాగోతాన్ని పసిగట్టింది. ఆ పరీక్షల్లో ఆధారాలు దొరికాయి. మరిన్ని పరీక్షల్ని చేసి, కల్తీ వ్యాక్సిన్ సరఫరా జరిగిందని నిర్థారణ జరిగింది. దాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా వేసిందని తేలింది. ఇప్పుడు ఈ కల్తీ వ్యాక్సిన్ వల్ల సదరు పోలియో వైరస్ బలం పుంజుకుని, కొందరు పిల్లల్లోనైనా పోలియోను కలగజేస్తుందనేది ఇప్పుడు కలవరం కలిగిస్తున్న విషయం. ఈ వ్యాక్సిన్ ను ఘజియాబాద్‌లోని బయోమెడ్ అనే సంస్థ ఉత్పత్తి చేసింది. సెప్టెంబరు 27న సదరు కంపెనీ ఎండీని అరెస్టు చేయడంతో ఈ ఉదతం వెలుగు చూసింది. ఆయన కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉండి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగి పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) శనివారం ముగ్గురు సభ్యులతో ఓ టీం ఏర్పాటు చేసింది… అక్టోబరు 3 నుంచి అది ఈ కల్తీ వైరస్ ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేసే కార్యక్రమం చేపడుతోంది. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని తక్షణం నిలిపేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.

నిషేధించినా… సరఫరా:
2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా ఇండియాను ‘పోలియో ఫ్రీ’ దేశంగా ప్రకటించింది. 2016లో టైప్-2 స్ట్రెయిన్ ఉండే వ్యాక్సిన్లను మొత్తంగా భారతదేశం దిగుమతి చేసుకుంది. అప్పటికే ఉన్న టైప్-2 వ్యాక్సిన్ నిల్వలను కూడా నిర్వీర్యం చేయించింది. ఏప్రిల్ 2016 తరువాత కేవలం టైప్-1 లేదా టైప్-3 వ్యాక్సిన్లు బైవలెంట్ వ్యాక్సిన్లు మాత్రమే అమ్మాలి. కానీ ఘజియాబాద్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన టైప్-2 వ్యాక్సిన్ ఎలా సరఫరా చేసిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం. అదీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ‘పల్స్ పోలియో’ కార్యక్రమానికి సరఫరా చేసింది. ఏప్రిల్ 2016 తరువాత ఆ టైప్-2 వ్యాక్సిన్ వేయబడిన పిల్లలపై దాని ప్రభావం ఏమిటీ అనేది ఇప్పుడు ఆందోళన చెందాల్సిన ఈ దశాబ్దపు ఆంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here