అమల్లోకి వినియోగదారుల రక్షణ బిల్లు

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

వినియోగదారుల రక్షణ బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఈ-మెయిల్‌ ద్వారా కూడా వినియోగదారుడు తన ఫిర్యాదును నమోదు చేయవచ్చు అని ఆయన తెలిపారు. తన కేసును విచారించేందుకు వినియోగ దారుడు లాయర్‌ను ఆశ్రయించాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఈ బిల్లుకు స్టాండింగ్‌ కమిటీ అనుమతి దక్కిందన్నారు. ఇది వివాదరహిత బిల్లు అని ఆయన తెలిపారు. కృత్రిమ ఉత్పత్తులకు వాణిజ్య ప్రకటనలు చేసే సెలబ్రిటీలకు శిక్ష ఉండదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ ప్రతిమా మోండల్‌ మాట్లాడుతూ.. నియోగదారుల రక్షణ బిల్లు వల్ల ఫిర్యాదు నమోదు చేసే పక్రియ సులువుగా మారిందని తెలిపారు. వాణిజ్య ఉత్పత్తులను సెలబ్రిటీలు ప్రమోట్‌ చేయడం పట్ల సరైన వివరణ ఇవ్వాలని ఆమె కోరారు. తప్పుడు ప్రకటనలతో సెలబ్రిటీలు తప్పించుకుంటు న్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. వినియోగదారుల రక్షణ బిల్లు ద్వారా సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీని ఏర్పాటు చేయనున్నారని అన్నారు. దీని ద్వారా వినియోగదారుల హక్కులను కాపాడనున్నారని, కొత్త బిల్లు ద్వారా.. కన్జ్యూమర్‌ డిస్‌ప్యూట్స్‌ రిడ్రసల్‌ కమిషన్‌, కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌, కన్జ్యూమర్‌ విూడియేషన్‌ సెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారని తప్పుడు ప్రకటనలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఉత్పత్తిని అమ్మేవారు, వాణిజ్య ప్రకటన చేసేవారు, దాన్ని ఎండార్స్‌ చేసేవారు బాధ్యులుగా ఉంటారని మంత్రి తెలిపారు. క్వాసీ జుడిషి యల్‌ పద్దతిలో విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. కొందరు సభ్యులు కోరిన సవరణలకు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు ఆమోదం దక్కింది.

27న ట్రిపుల్‌ తలాక్‌పై చర్చ.. అత్యంత వివాదాస్పదమైన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై ఈనెల 27వ తేదీన లోక్‌సభలో చర్చ చేపట్టనున్నారు. ముస్లిం వుమెన్‌ ప్రొటెక్షన్‌ బిల్లుపై ఆ రోజున లోక్‌సభలో చర్చ జరగనున్నది. ఆ బిల్లుపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీ మల్లిఖార్జున్‌ ఖర్గే గురువారం స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కోరారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై అభిప్రాయాలు వెలుబుచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఆ సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. సభ శాంతియుతంగా జరిగేందుకు అవకాశం ఇస్తే, కచ్చితంగా ట్రిపుల్‌ తలాక్‌పై చర్చిస్తామన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని వేయాలని నిర్ణయించినట్లు ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here