స్థిరంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు

0

న్యూఢీల్లీ : దేశీయంగా మంగళవారం (మే 7న) పెట్రోలు, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో మే 6 నాటి ధరలే కొనసాగనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోలు ధర రూ.73.00 వద్ద కొనసాగుతుండగా.. డీజిల్‌ ధర రూ.66.66 వద్ద కొనసాగుతోంది. ఇక వాణిజ్యరాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోలు ధర రూ.78.59 వద్ద, డీజిల్‌ ధర 69.81 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోలు ధర రూ.77.43 వద్ద, డీజిల్‌ ధర రూ.72.46 వద్ద కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోలు ధర రూ.77.13 వద్ద, డీజిల్‌ ధర రూ.71.81 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడలో పెట్రోలు ధర రూ.76.78 వద్ద, డీజిల్‌ ధర రూ.71.48 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కూడా ఇంధన ధరలు స్వల్పంగా పతమనమయ్యాయి. డబ్ల్యూటీఐ క్రూడాయిల్‌ ధరలు బ్యారెల్‌పై 0.03 శాతం తగ్గి 62.23 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు 0.15 శాతం తగ్గి బ్యారెల్‌ ధర 71.13 వద్ద కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here