త్రిషతో అలా కనెక్ట్‌ అయ్యారు

0

నటి త్రిష మార్కెట్‌ ఇప్పుడు వెలిగిపోతోంది. మధ్యలో కాస్త తడబడ్డా, విజయ్‌సేతుపతితో జత కట్టిన 96, రజనీకాంత్‌తో నటించిన పేట చిత్రాల విజయాలు ఈ చెన్నై చిన్నదానికి నూతనోత్సాహాన్నిచ్చాయి. 96 చిత్రంలో తన నటనకు ప్రశంసలు, పేట చిత్రంలో రజనీకాంత్‌తో నటించాలన్న చిరకాల ఆకాంక్ష తీరడమే ఆ సంతోషానికి కారణం. ఇప్పుడు ఈ బ్యూటీకి అవకాశాలు వరుస కడుతున్నాయి. చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ కథను అందించి, లైకా ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న చిత్రంలో త్రిష నటిస్తున్నారు. దీనికి ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రం ఫేమ్‌ శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి రాంగీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది యాక్షన్‌, ఎడ్వెంచర్‌ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం. త్రిష, అనిరుధ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అలా త్రిషతో అనిరుధ్‌ కనెక్ట్‌ అయ్యారన్నమాట. కాగా త్రిష సీనియర్‌ నటి సిమ్రాన్‌తో కలిసి మరో ఎడ్వెంచర్‌, థ్రిల్లర్‌ చిత్రంలోనూ నటిస్తున్నారు. సమంత్‌ రామక ష్ణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ కేరళ, పిచ్చావరవం, థాయ్‌ల్యాండ్‌లో జరుపుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here