Featuredరాజకీయ వార్తలు

రూరల్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం

– కాంగ్రెస్‌ అండకోసం ప్రజలు తపిస్తున్నారు

– ప్రజలను మోసం చేసిన కెసిఆర్‌

– హామీలన్నీ గాలికే.. ఆ ఐదుగురికే ఉద్యోగాలు

– పాలన చేతకాకనే ప్రభుత్వం రద్దు

ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధితో నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి భూపతిరెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ

నిజామాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ప్రజాఆకాంక్షలకు వ్యతిరేఖంగా జరిగిన నియంత పాలన నుంచి విముక్తి కోరుతూ కాంగ్రెస్‌ అండ కోసం ప్రజలు తపిస్తున్నా రని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్తి భూపతిరెడ్డి అన్నారు. రూరల్‌ లో కాంగ్రెస్‌పార్టీ జెండా ఎగరడం ఖాయం అని, డాక్టర్‌గా, ఉద్యమ కారునిగా ప్రజలతో నేర్పిన సత్సంబంధాలే నన్ను గెలుపిస్తాయని ధీమా వ్యక్తం చేశా రు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్థన్‌ను ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. గడిచిన నాలుగు సంవత్స రాల కాలంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాల నలో అన్ని వర్గాలవారు కులావవారు దగా పడ్డాయన్నారు. 60 సంవత్సరాల కాలంలో ఎన్నడు ఎరగని అవినీతి గడిచిన నాలుగు న్నర సంవత్సరాల ప్రభుత్వంలో కనిపిస్తుం దన్నారు. మిషన్‌

కాకతీయ, మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో వేలకోట్లు దోచుకతిన్నారు. అమర వీరుల త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఏ ఒక్క అమర వీరుల కుటుంబానికి గాని వర్గాలకు గాని లబ్ది చేకూరలేదన్నారు.

విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌… ఏ ఉద్యోగాల కోసం అయితే విద్యార్థులు నిరుద్యోగులు తపించారో ఆ ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యం జరిగిందన్నారు. కెజిటు పిజి విద్యావ్యవస్థ ఊసేలేదన్నారు. గెలిచిన నాలుగున్నర సంవత్సరాలు ప్రభుత్వ కాలంలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. లక్ష ఉద్యోగాలు గాలికి ఒదిలేసారని వాళ్ళ కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు తీసుకున్నామన్నారు.

పాలన చేతకాకనే ప్రభుత్వం రద్దు…ద్యమ పోరాటాలతో భాగంగా వచ్చిన తెలంగాణకు బంగారు తెలంగాణను చేస్తానని గద్దెనెక్కిన చంద్రశేఖర్‌రావు బంగారుతెలంగాణ ఏమోగాని రాష్ట్రం ఆగం అయిపోయిందన్నారు. ఐదు సంవత్సరాలపాటు స్వపరిపాలన అందించాలని ప్రజలు టిఆర్‌ఎస్‌పార్టీని గెలిపిస్తే పాలన చేతకాక 9 నెలలముందే ప్రభుత్వాన్ని రద్దు చేశారన్నారు. అసెంబ్లీని సమావేశ పర్చకుండా ప్రభుత్వాన్నిఏవిధంగా రద్దు చేశారని ప్రశ్నించారు. ఎందుకు ముందస్తు ఎన్నికల కు వెళ్ళామో చెప్పకుండా ఏము ఖం పెట్టుకొని చంద్రశేఖర్‌రావు ప్రజలను ఆశీర్వదించమని కోరుతున్నారు.

ప్రజలను మరోసారి మోసం చేయడం కోసం ముందస్తు ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన తెలంగాణలో గడిచిన నాలుగున్నర సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మోస పూరిత హామీలతో నెట్టుకవచ్చారన్నారు. పాలన చేతకాక రద్దు చేసిన ప్రభుత్వంలో ఈ వర్గానికిగాని ఈ కులానికిగాని లబ్డి చేకూరలేదన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ చంద్రశేఖర్‌రావు చేతిలో మరోసారి మోసపోవడానికి సిద్దంగాలేరనిభూపతిరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా చంద్రశేఖర్‌రావును ఆయన కుటుంబసభ్యులను ఫామ్‌ హౌస్‌కి పంపిస్తామని భూపతిరెడ్డి అన్నారు

రూరల్‌ ప్రజలచూపు భూపతిరెడ్డి వైపు…

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి భూపతి రెడ్డికి రూరల్‌నియోజకవర్గ ప్రజలు ఎక్కడికక్కడ అడుగడుగున భ్రహ్మరథం పడుతున్నారు. మీమంతా భూపతి రెడ్డివైపే ఉంటామని నియోజకవర్గ ప్రజలు గొంతు నొక్కి చెపుతున్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి భూపతి రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించుకుంటామని రూరల్‌ నియోజకవర్గ ప్రజలు థీమా వ్యక్తం చేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close