Featuredజాతీయ వార్తలురాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ – ఎన్సీపీలది అవినీతి పొత్తు

  • దశాబ్దకాలంగా మహారాష్ట్రను అణగదొక్కింది ఆ రెండు పార్టీలే
  • మహారాష్ట్ర మాదిరిగానే కశ్మీర్‌ ప్రజలు భారత్‌లో భాగమే
  • వారి పరిరక్షణ కూడా మనకు ముఖ్యమే
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ పార్టీ సావర్కర్‌, అంబేడ్కర్‌ వంటి ఉన్నత వ్యక్తులను మరిచిందని, ఇప్పుడు ఆర్టికల్‌ 370 రద్దును కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం తారస్థాయికి చేరుకుంది. నేతలు మాటల్లో పదును పెంచారు. బుధవారం రాష్ట్రంలోని అకోలాలో ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సావర్కర్‌, అంబేడ్కర్‌ వంటి ఉన్నత వ్యక్తులను కాంగ్రెస్‌ మరిచిందని దుయ్యబట్టారు. ‘బీఆర్‌ అంబేడ్కర్‌కు ‘భారతరత్న’ ఇవ్వడానికి కాంగ్రెస్‌ నిరాకరించిందని, స్వాతంత్యయ్రోధుడు వీర్‌ సావర్కర్‌ను అవమానించిందని, ఇప్పుడు వాళ్లు ఆర్టికల్‌ 370 రద్దును కూడా వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతి నిర్మాణంలో సావర్కర్‌ చెప్పిన విలువలు జాతికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ప్రధాని అన్నారు. ఆర్టికల్‌ 370 గురించి మహారాష్ట్రలో మాట్లాడాల్సిన అవసరం ఏముందని చాలా మంది ప్రశ్నిస్తున్నారని, దీనికి కూడా నా వద్ద సమాధానం ఉందన్నారు. బాగా వినండి… మహారాష్ట్ర మాదిరిగానే జమ్మూకశ్మీర్‌ ప్రజలు కూడా భారత్‌లో భాగమే అని, వారి పరిరక్షణ కూడా మనకు ముఖ్యమేనని ప్రధాని స్పష్టం చేశారు. గిట్టని వాళ్లు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారుని, అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ – ఎన్సీపీది అవినీతి పొత్తు అని ప్రధాని అన్నారు. దశాబ్ద కాలంగా మహారాష్ట్రను అణగదొక్కింది ఆ రెండు పార్టీలే అన్నారు. ఇక అవన్నీ కుదరవంటూ తీవ్రంగా ప్రధాని విరుచుకుపడ్డారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close