సూర్య నమస్కారాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత కన్నుమూత

0

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రదీప్‌ సక్సేనా(58) గుండెపోటుతో కన్నుమూశారు. సూర్య సమస్కారం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ప్రదీప్‌ సక్సేనా చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. 2009 నుంచి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 12న మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా సూర్య నమస్కారం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం చింద్వారా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా చేస్తున్న సక్సేనా సూర్య నమస్కారం ఈవెంట్లో పాల్గొన్నారు. చింద్వారాలో సూర్య నమస్కారాలు చేస్తుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పివచ్చింది. ఈ విషయం చెప్పగానే ఆయనను హాస్పిటల్‌కు తరలించారని ఎస్పీ మనోజ్‌ రాయ్‌ తెలిపారు. సక్సేనాను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ఆయన చనిపోయారని చెప్పారు. కాగా, మధ్యప్రదేశ్‌ పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్‌ చీఫ్‌గానూ సేవలందించిన సక్సేనా మ తి పట్ల కాంగ్రెస్‌ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. సీఎం కమల్‌నాథ్‌, ప్రదీప్‌ సక్సేనాలు ఒకే జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం. సక్సేనా మ తి పట్ల మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు విచారం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here