చేతకాని కాంగ్రెసోళ్లు.. బాబును తెచ్చుకుంటున్నారు

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మన ప్రాజెక్టులకు అడ్డుపడేవారు.. మనకు అవసరామా అని ప్రజలంతా ఆలోచించుకోవాలని, డిసెంబర్‌ 7న ఓటుతో ప్రజా కూటమికి బుద్ది చెప్పాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో కల్వకుర్తి నియోజకవర్గానికి కన్నీళ్లే మిగిలినయి తప్ప ఈ నియోజకవర్గం తలరాత మార్చలేదని అన్నారు. మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. 70 ఏండ్ల నుంచి ఓట్లు వేస్తూనే ఉన్నారని, ఈ నియోజకవర్గానికి సాగు, తాగునీరు రాలేదన్నారు. ఈ ప్రజలకు కన్నీళ్లు మిగిలినవి తప్ప పనులు కాలేదని, మాటలు మిగిలిపోయాయని అన్నారు. ఎన్నికల్లో పార్టీలు, వ్యక్తులు గెలుచుడు ముఖ్యం కాదని, ప్రజలు గెలవాలని కేసీఆర్‌ సూచించారు. మహబూబ్‌ నగర్‌ ను చంద్రబాబు దత్తత తీసుకున్న కూడా తొమ్మిది చుక్కల నీరు కూడా రాలేదన్నారు. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చేశారని కల్వకుర్తి: అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిని పూర్తి చేసి సాగునీరు తీసుకువస్తున్నామని, కల్వకుర్తి నియోజకవర్గానికి రాబోయే రెండేళ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరిస్తామని అన్నారు. ప్రస్తుతం కల్వకుర్తి ఎత్తిపోతల కింద 30 వేల ఎకరాలకు నీరు పారుతోందని, చెరువులను నింపుకున్నామని అన్నారు. జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ కింద ఒక్క ఊరికి నీళ్లు రాలేదని అంటున్నాడని, విూరే ఆయనకు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికే దాదాపు 80శాతం ఇంటింటికి నీటికి సరఫరా అవుతుందని, మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో ఇంటింటికి నల్లానీరు అందిస్తామని తెలిపారు. తెరాసను ఎదుర్కొనే సత్తాలేక ఆంధ్రాకు పోయి చంద్రబాబు నాయుడిని వెంట పెట్టుకొస్తున్నారుని కేసీఆర్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఇక్కడి నాయకులు కొట్లాది రూ.35వేల కోట్లు మంజూరు చేయించుకొని ప్రాజెక్టులు నిర్మాణాలు చేయించుకున్నారని, రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల పూర్తయితే బ్రహ్మాండంగా పంటలు పండుతాయని కేసీఆర్‌ అన్నారు. కానీ కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టులు కట్టవద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని కేసీఆర్‌ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ నేతలుసైతం ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కోర్టులకు వెళ్లారని, వారిని ఓటుయాల్సిన అవసరం మనకుందా అని ప్రజలు ఆలోచించుకోవాలని కేసీఆర్‌ సూచించారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విూ తెలంగాణకు కనీసం నీళ్లు, కరెంట్‌ కూడా ఇవ్వం అని అసెంబ్లీ సాక్షిగా అన్నాడని, కానీ అప్పుడు మంత్రులుగా ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఆంధ్రావాళ్లకు నీళ్లు, నిధులు మళ్లిస్తుంటే ఇక్కడ నేతలు స్వాగతం పలికారని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు చంద్రబాబును తీసుకొచ్చి మనవేలుతోని మన కంటినే పొడిచేలా చేస్తున్నారని, మన ఇంట్లోకి వచ్చి మనళ్లే డబ్బుతో కొంటా, నోట్ల కట్టలతో గెలుస్తా అంటున్నాడని, కల్వకుర్తి ప్రజలు ఆలోచించాలని అన్నారు. నోట్ల కొట్టలకు, మద్యానికి అమ్ముడుపోయేందుకు మనం గొర్రెలం కాదని, ఆలోచించి ఓటు లేయాలని, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కేసీఆర్‌ కోరారు. 80 కొత్త పంచాయతీలు చేశామని, 57తండాలు గ్రామ పంచాయతీలు అయ్యాయని, శాసనసభ ఎన్నికల తరువాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, 57 పంచాయతీల్లో గిరిజనులే వాళ్ల గ్రామాలను పాలించుకుంటారని అన్నారు. ఎస్టీ,లు, ముస్లీంసోదరులు సంఖ్య పెరిగిందని, వారి రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేశామని, కేంద్రానికి పంపించామని అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం మత గజ్జి ప్రభుత్వమని అన్నారు. కేసీఆర్‌ ఏది పట్టినా మొండిపట్టు పడతాడని, తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడానో గిరిజనులకు, ముస్లీంలకు రిజర్వేషన్లు వచ్చేలా కొట్లాడతానని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. 103 నుంచి 105 వరకు సీట్లు తెరాస గెలుస్తోందని సర్వేలే చెబుతున్నాయని, అసెంబ్లీ సీట్లే కాకుండా తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లోనూ గెలిచి కేంద్రంలో కీలక భూమిక పోషించాలని కేసీఆర్‌ అన్నారు. కల్వకుర్తికి నీరు రావాలంటే కచ్చితంగా జైపాల్‌ యాదవ్‌ను గెలిపించుకోవాలని కేసీఆర్‌ సూచించారు. అమనగల్లు కొత్తగా మున్సిపాలిటీ అయిందని, దానిని నిధులు ఇచ్చి మరింత అభివృద్ధి చేస్తామని, ఆస్పత్రిని 150 పడకల ఆస్పత్రిగా చేయిస్తామని అన్నారు. అదేవిధంగా కల్వకుర్తిలో పాలిటెక్నికల్‌ కళాశాల, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో ఆగమాగమై ఓట్లు వేయవద్దని, అభివృద్ధి చేసేది ఎవరో ఆలోచించి ఓట్లు వేయాలని, తద్వారా కల్వకుర్తిలో జైపాల్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్‌ కల్వకుర్తి ప్రజలకు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here