Featuredరాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ నిండా..జోకర్లు.. బ్రోకర్లు…లోఫర్లు

నల్లగొండ (ఆదాబ్‌ హైదరాబాద్‌): జోకర్లు… బ్రోకర్లు… లోఫర్లతో నిండిపోయిన కాంగ్రెస్‌ పార్టీనీ ఓడించాల్సిన తరుణం ఆసన్నమైందనిరాష్ట్ర విద్యుత్‌ యస్‌ సి అభివద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు.ఇప్పటికి నాగార్జునసాగర్‌ నియోజక వర్గంలో సమస్యలు తిష్ఠవేశాయంటే అందుకు కారణం 2014 ఎన్నికలలో టి ఆర్‌ యస్‌ కు ఓటు వేయకపోవడ మేనని అన్నారు. శనివారం సాయంత్రం హాలియా లో జరిగిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గ టిఆర్‌యస్‌ పార్టీ సన్నహాక సమావేశానికి మంత్రి జగదీష్‌ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా జరిగిన సన్నహాక సభలో మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రసంగిస్తూ నెల్లికల్లు గ్రామంలో ఏర్పడ్డ మంచినీటి ఎద్దడి నిరసనగా ఎన్నికలు బహిష్కరించనున్నామని అక్కడి ప్రజలు పేర్కొనగా… బహిష్కరించాల్సి వస్తే ముమ్మాటికి నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని ముందుగా బహిష్కరించాలని మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీకీ ఓటువెయ్యడం అంటేనే ఇక్కడి ప్రజలు ఇకపై సాగర్‌ ఎడమ కాలువ భూములకు నీరు వద్దు అని అగ్రిమెంట్‌ చేసినట్లౌతుందని ఆయన హెచ్చరించారు.టి ఆర్‌ యస్‌ పార్టీ నుండి విడిపోయి కాంగ్రెస్‌ తో కలసి వస్తే లాభపడవచ్చు అన్నది కాంగ్రెస్‌ నేతల మనోగతమని …అటువంటి ఆశలను వమ్ము చేస్తూ ఒక్క తాటిమీదకు గులాబీ దండు చేరి గుంటనక్కలకు గుణపాఠం చెప్పారని ఆయన ఎద్దేవాచేశారు. బీ-ఫామ్‌ ఇస్తే చాలు ఎన్నికలలో గెలువవచ్చు అన్నది టి ఆర్‌ యస్‌ నేతల మనోగతమని …టికెట్‌ కొరకై ప్రయత్నం చేశారని …అయినా నిరాశ పడకుండా టి ఆర్‌ యస్‌ విజయానికి నడుం బిగించారని ఆయన చెప్పారు.టి ఆర్‌ యస్‌ పార్టీ నుండి ఏ ఒక్కరూ విడిపోరని..అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని గౌరవించే సంస్క తి టి ఆర్‌ యస్‌ పార్టీలో ఉందన్నారు. యావత్‌ భారతదేశం లోనే సువర్ణాక్షరాలతో సువర్ణధ్యాయాన్ని లికించిన పార్టీ టి ఆర్‌ యస్‌ అని ఆయన కొనియాడారు. ప్రభుత్వం, పాలనఎలా ఉండాలో యావత్‌ భారతదేశానికి నేర్పిన మొట్టమొదటి పార్టీ టి ఆర్‌ యస్‌ అని ఆయన చెప్పుకొచ్చారు.35 ఏండ్లుగా నాగార్జునసాగర్‌ నియోజకవర్గాన్ని ఏకధాటిగా పాలించిన జానారెడ్డి సొంత ఊరితో పాటు లక్షలాది ఎకరాలకు నిరందిస్తున్న నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కేంద్రంలో మంచినీరు అందించలేనిదుస్థితి కి కారణం జానారెడ్డి కాదా అని ఆయన నిలదీశారు.నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో టి ఆర్‌ యస్‌ అభ్యర్థి నోముల నరసీమయ్య గారిని గెలిపించుకోగలిగితే ఇక్కడ టికెట్‌ ఆశించిన యం సి కోటిరెడ్డి కి అదే స్థాయిలో సమాణహోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రకటించారు.35 ఏండ్లుగా రాజవరం మొదటి తూము కు నీళ్లు ఇవ్వలేకపోయిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను విమర్శించడం విడ్డురంగా ఉందంటూ దుయ్యబట్టారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ ,తెలుగుదేశం పార్టీల ఎలుబడిలోనే ఉన్నాయాని ఆయా పార్టీలు అధికారంలో ఉండగా క ష్ణా పుష్కరాలు వస్తే ఏ ఒక్కరోజు అయినా కష్ణవేణిని సొంతం చేసుకోలేక పోయారన్నారు.అదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో వచ్చిన క ష్ణా పుష్కరాల పేరుతో 500 కోట్లు జిల్లాలో ఖర్చు పెడితే ఒక్క నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో నే 150 కోట్లు ఖర్చు చేసిన ఘనత టి ఆర్‌ యస్‌ పార్టీ ప్రభుత్వానిదన్నారు.నాగార్జున సాగర్‌ నియోజకవర్గ టి ఆర్‌ యస్‌ అభ్యర్థి నోముల నరసీమయ్య అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సన్నహాక సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, నల్గొండ లోకసబ సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డి ,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌,మాజీ శాసనసభ్యుడు రామూర్తి యాదవ్‌,సీనియర్‌ టి ఆర్‌ యస్‌ నేత యం సి కోటిరెడ్డి మాజీ అప్కాబ్‌ చేయిర్మెన్‌ విజయేందర్‌ రెడ్డి,రామచంద్రనాయక్‌,కేవీ రామారావు ,కర్నాటి విజయభాస్కర్‌ రెడ్డి ,కంచర్ల విజయేందర్‌ రెడ్డి ,గాలి రవి కుమార్‌, గడ్డంపల్లి రవీందర్‌ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని యం పి పి లు జడ్‌ పి టి సి లు పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close