తెలంగాణలో కోవర్ట్‌ ఆ’పరేషన్‌’ పూర్తి కాంగ్రెస్‌ ఖాళీ

0
  • ‘షాక్‌’లో ఏఐసీసీ
  • కుంతియాకు 6.5 కోట్ల ప్లాట్‌
  • ఆడియో బట్టబయలు
  • ప్రతిపక్ష ¬దా గల్లంతు..?
  • ఆదాబ్‌ సంచలన పరిశోధన

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికల నేపథ్యం ఒకొక్కటిగా బట్టబయలు అవుతున్నాయి. కాంగ్రెస్‌ అధిష్టానానికి మింగుడు పడని చేదు వాస్తవాలు ఒకొక్కటిగా ఆధారాలతో బయటపడుతున్నాయి. అధిష్టానానికి మంగళవారం ఉదయం అందిన ఆడియో టేపుల ఆధారాలతో కొందరి రాజకీయ జీవితాలకు ‘తెర’పడే అవకాశాలున్నాయి. మరికొందరు తాము పార్టీలో కీలకంగా ఉంటూ… ప్రజాప్రతినిధులను కారు ఎక్కించే ప్రయత్నం దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలో కుంతియాపై ఏకంగా 6.5 కోట్ల విలువచేసే ప్లాటు తాయిలంగా అందినట్లు తెలుస్తోంది. కాంగ్రెసును పూర్తిగా ఖాళీ చేసేఈ కుట్రకు వ్యూహకర్తలుగా ఆ పార్టీ కీలక నేతలు ఉండటం గమనార్హం. తెలంగాణలో దూసుకెళ్లిన కారుకు ఖమ్మంలో మాత్రం బ్రేక్‌ పడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఇక్కడ ఘోరంగా ఎదురుదెబ్బతింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రపెద్దలతో గులాబీ దళం లోపాయికారి ఒప్పందాలు జరిగాయాని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కోవర్ట్‌ ఆపరేషన్‌ లతో ఏఐసీసీ ఒక్కసారిగా షాక్‌ తిన్నది. ‘ఆదాబ్‌’కు అందిన ఆడియో రికార్డుల మేరకు ఈ సంచలన పరిశోధన కథనం.

కుంతియా కుమ్మిన ప్లాట్‌ రూ.6.5కోట్లు:

ఓ పద్దతి ప్రకారం జరిగిన ఈ కుంభకోణంలో

హైదరాబాద్‌,.కొండాపూర్‌ లో జరిగింది. ఓ స్కూల్‌ పక్కనే ఉన్న అతి ఖరీదైన ప్లాట్‌ ఒకటి ఖమ్మం అసెంబ్లీ స్థానం ఆశించిన ఓ గ్రానైట్‌ వ్యాపారి నుంచి కుంతియా బినావిూగా చెప్పబడుతున్న ఒడిసం (భద్రత కారణాల దృష్ట్యా పేరు మార్చాం) అనే వ్యక్తి పేరుతో కొనుగోలు జరిగినట్లు తెలిసింది. ఏఐసీసీ కీలక సభ్యులు కొప్పులరాజుపై కూడా నగదు మార్పిడి జరిగినట్లు తెలుస్తోంది. వైరా సీటు ఆశించిన ఓ అభ్యర్థి నుంచి కాంగ్రెస్‌ నాయకుడు నల్లరంగు స్కార్పియో అదనపు తాయిలంగా పొందినట్లు తెలిసింది. అయితే టిపిసిసి అధ్యక్షుడి పేరు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. ఏఐసీసీ అధిష్టానానికి అందిన మరో ఆడియోలో భక్తచరణ్‌ దాస్‌ కుమారుడి పేరు ప్రముఖంగా ప్రస్థావన వచ్చింది. ఏకంగా ఓ అభ్యర్థి డబ్బులు చేతులు మారుతున్న ఫిర్యాదుకు వీడియో సాక్ష్యం జతపర్చారు. ఈ అభ్యర్థులు గతంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.ఇప్పుడు వీరంతా కారెక్కారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష ¬దా గల్లంతు.?

కేసీఆర్‌ గత పుష్కర కాలంగా వేస్తున్న ఏ స్కైచ్‌ ప్లాప్‌ కాలేదు. అందులో భాగంగా ఆయన ‘తెలుగుదేశం’ పార్టీని పక్కాగా పడుకోబెట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో నాయకులు లేకుండా చేయాలనే ఆలోచన ‘మధ్యంతరం’ రూపంలో చూపెట్టి చాచి కొట్టారు. పంచాయతీ, పార్లమెంట్‌ బాధ్యతలు ‘చిన్నదొర’కు అప్పగించారు. ఫాంహౌస్‌ లో కూర్చొని అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష ¬దా లేకుండా చేసే ‘ఆకర్ష కసరత్తులు’ సరదాగా చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా ఆ ప్రతిపక్ష ¬దాను కాంగ్రెస్‌ నుంచి ‘లా’క్కొని మిత్రపక్షమైన మజ్లీస్‌ కు కట్టబెట్టాలనే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి.

మూడు కొడితే టార్గెట్‌ ఫినిష్‌:

అసెంబ్లీలో కాంగ్రెస్‌ కు ప్రతిపక్ష ¬దా దక్కింది. అయితే కేసీఆర్‌ గతకొద్ది రోజులుగా రాజ్యాంగ నిపుణులతో అనేక దఫాలుగా భేటీలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఆయన కసి, కోపం మరో రూపంలో తీర్చుకోబోతున్నారు. ఈ ప్లాన్‌ సక్సెస్‌ అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా రెపరెపలు మరో నాలుగేళ్ళు కనిపించదు. ఏ కోరికతో కేసీఆర్‌ ముందస్తుకు వెళ్ళారో… అది తీరలేదు. 100 సీట్లు రాలేదు. కానీ వంద మార్కుకు ఆయన చేర్చారు. దీంతో ఆయన తాజాగా కాంగ్రెస్‌ కు ప్రతిపక్ష ¬దా దక్కకుండా పెద్ద ప్లాన్‌ సెట్‌ చేశారు.

ఇదే ప్లాన్‌..:

అసెంబ్లీలో మెజారిటీకి సరిగ్గా 60 సీట్లు రావాలి. అలాగే ప్రతిపక్ష ¬దా రావాలంటే ప్రాంతీయ పార్టీకి 5%, జాతీయ పార్టీకి 10% శాసనసభ స్థానాలు రావాల్సిన అవసరం ఉంది. అయితే మెజారిటీ మాజిక్‌ ఫిగర్‌ కారు దాటేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక మిగిలింది ప్రతిపక్ష ¬దా. ఇది లెక్క ప్రకారం 19 సీట్లు ఉన్న కాంగ్రేస్‌ కే రావాలి. అయితే గులాబీ దళపతి తన వజ్రాయుధం ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా ‘టచ్‌’లో ఉన్న ముగ్గురు కాంగ్రెస్‌ శాసనసభ్యులను కారెక్కిస్తే…. కాంగ్రెస్‌ ప్రతిపక్ష ¬దా గాలిలో కల్సిపోతుంది.

ఆనందంలో మజ్లీస్‌:

తెలంగాణ గాంధీ వేసిన ఈ పథకంతో మజ్లీస్‌ తబిబ్బు అవుతోంది. అంతర్గతంగా సంబరాలు చేసుకుంటోంది. ఎందుకంటే రాజ్యాంగ నిబంధనల మేరకు మజ్లీస్‌ కు ప్రతిపక్ష ¬దా దక్కుతుంది.

కాంగ్రెస్‌ లో ‘ఆందోళన’:

ఏఐసీసీ అధిష్టానం కేసీఆర్‌ వ్యూహంపై మల్లగుల్లాలు పడుతోంది. తాము దళితుడికి ప్రతిపక్ష నాయకుడి ¬దా ఇచ్చి మార్కులు కొడదాం అనుకుంది. అయితే కేసీఆర్‌ వేస్తున్న ఎత్తుగడలతో కనీసం ప్రతిపక్ష ¬దా దక్కడం లేదని మనోవేదనకు గురవుతోంది. స్థానిక నాయకులు సరిగ్గా మేనేజ్‌ చేయడం లేదని, ఓడిన అభ్యర్థులతో ఎలాంటి సవిూక్షలు జరపకపోవడంపై అనేక విమర్శలు వచ్చిపడుతున్నాయి. జంప్‌ జిలానీలు ఎవరనే విషయం ఒకటి, ఎంతమంది రెడ్డి సామాజిక వర్గ నేతలు కాంగ్రెస్‌ కొనసాగుతారనేది మరొక ‘బేతాళప్రశ్న’.

ఖుషీలో ‘కారు’:

తెరాస అధినేత కేసీఆర్‌ వేసిన ఎత్తుగడలతో అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్ష ¬దాలు తమకే దక్కనున్నడంతో ఆ,యా వర్గాలు ఎంతో ఆనందంలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here