Featuredస్టేట్ న్యూస్

కాంగ్రెస్‌లో కలవరపాటు..

  • హస్తం సరికొత్త వ్యూహాం..
  • ప్రజా పరిరక్షణ యాత్రలు
  • ప్రతిపక్ష ¬దా పోతుందనే భయం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్రంలో వరుస ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్‌ ను గుక్కతిప్పుకోకుండా చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనంటూ చెప్పుకున్న హస్తం నాయకులు .. ఫలితాలు రివర్స్‌ లో రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గెలిచిన 19 ఎమ్మెల్యేలు కూడా మరుసటి రోజు నుంచే పక్క చూపులు చూస్తూ .. గోడ దూకుతుండటంతో కాంగ్రెస్‌ కు దెబ్బవిూద దెబ్బ తగులుతోంది. ఆ వెంటనే ఎంపీ ఎన్నికలు ముంచుకురావడంతో .. లోక్‌ సభ వ్యూహలకు పదును పెడుతున్నామంటూ .. కొన్ని రోజులు టైమ్‌ పాస్‌ చేశారు హస్తం నేతలు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు తమవేనంటూ ప్రచారాన్ని ఊదరగొట్టారు. అయితే ఫలితాలు ఎలా వస్తాయనేది పక్కన పెడితే .. మెజారిటీ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు చేతులెత్తేయడం ఆ పార్టీని కలవరపాటుకు గురి చేసిందనే చెప్పాలి. ఇక లోక్‌ సభ ఎలక్షన్‌ ఇలా ముగిసిందో లోదో .. మళ్ళీ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల సైరన్‌ మోగింది. ఇక దీంతో ఈ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టారు కాంగ్రెస్‌ నాయకులు. ఈ లోకల్‌ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తాచాటుతుందని పదే పదే కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అయితే .. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో సత్తా చాటగలదా .. ఇదే ఇప్పుడు చర్చనీయాంంశమవుతోంది. ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులతో ఇటు రాష్ట్ర పార్టీనే కాదు .. క్షేత్రస్థాయి క్యాడర్‌ కూడా డీలా పడి ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక పోరులో సత్తా చాటడం అంత ఈజీ కాదనే తెలుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గానికి చెందిన బాద్యులు.. లోకల్‌ బాడీ ఎన్నికల్లో పెద్దగా సీరియస్‌ గా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఇంకా దయనీయమైన పరిస్థితి ఉంది. ఆ నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల బాద్యతలను పక్క నియోజకవర్గానికి చెందిన నాయకులకు అప్పగిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గం పరిస్థితులు సరిగ్గా అవగాహన లేని వారు అభ్యర్థుల ఎంపికలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ఇక పోటీ చేసే అభ్యర్థులు పార్టీ మారబోమని అఫిడవిట్‌ ఇవ్వాలన్న పార్టీ షరతులు కూడా కొంత గందరగోళానికి కారణమౌతున్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితులు కళ్ళముందు కనిపిస్తుంటే .. మెజారిటీ జడ్పీ స్థానాలు మావేనంటూ కాంగ్రెస్‌ రాష్ట్ర ముఖ్యనేతలు చెబుతుండటం సొంత పార్టీ నాయకులకు కూడా రుచించడం లేదు. క్యాడర్‌ లో కూడా ఈ మాటలు పెద్ద ప్రభావం చూడం లేదనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఎక్కడన్నా ఎవరన్నా గెలిచినా .. అది వారి సొంత ఇమేజ్‌ తోనే కానీ .. పార్టీ ప్రభవం పెద్దగా ఉండబోదని ద్వితీయ శ్రేణి నేతలంటున్నారు.

కాంగ్రెస్‌ సరికొత్త వ్యూహాం..

వరుస వలసలు పార్టీని ఇబ్బంది పెడుతుండడంతో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్దమైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వలసలు ఆగకపోవడంతో చివరకు జనంలోకి వెల్లడమే మేలని హస్తం పార్టీ నిర్ణయించింది. ప్రజా పరిరక్షణ యాత్ర పేరుతో.. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజికవర్గాల్లో యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. అసెంబ్లీ ఎన్నికల తరువాత వరుస వలసలు కాంగ్రెస్‌ పార్టీకి ప్రమాదకంగా మారుతుండడంతో ఆ పార్టీ ప్రజాబాట పడుతోంది. ప్రతిపక్ష ¬దా పోతుందనే భయం హస్తం పార్టీకి తలనొప్పిగా మారుతుండడంతో పార్టీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క ప్రజా పరిరక్షణ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెల్లడానికి రెడీ అయ్యారు.. ఆదివారం భద్రాద్రి నుంచి యాత్రను ప్రారంభించారు. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని సీఎల్పీని, టీఆర్‌ఎస్‌ ఎల్పీలో విలీనం కూడా చేసే ఆలోచనలో ఉంది గులాబీ టీం. దీంతో కాంగ్రెస్‌ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో యాత్ర ప్రారంభించారు. భట్టి విక్రమార్క. భద్రాచలంలో పూజలు చేసి ఉదయం పదకొండున్నరకు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఈ యాత్ర లక్ష్యం పార్టీని వీడిన ఎమ్మెల్యేల నియోజికవర్గాల్లో కార్యకర్తలను, నేతలను కాపాడుకోవడమే. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ద్వారా కార్యకర్తల్లో భరోసార నింపుతారా అధికారపార్టీ దూకుడు తగ్గిస్తారో చూడాలి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close