నెలరోజుల్లో భగీరథ పూర్తి

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మొన్నటి ఎన్నికల్లో ఓటుతోనే కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజలుఎ ఈ రెండు పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పారని అన్నారు. నల్లగొండలో ప్లోరోసిస్‌ సమస్యపై టీఆర్‌ఎస్‌ పోరాడితే ఆనాడు మంత్రులుగా ఉన్న ఉత్తమ్‌, జానారెడ్డి పట్టించుకోలేదు. నల్లగొండ జిల్లాలో 2 లక్షల మంది జీవచ్ఛవాలు ఉన్నా.. నాటి సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కార్‌ పట్టించుకోలేదు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు 9వేల కోట్లు తీసుకుపోతుంటే కాంగ్రెస్‌ మంత్రులు నోరు మెదపలేదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో

పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో నాగార్జున సాగర్‌ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన విూ అందరికీ ధన్యవాదాలు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ విజయం సామాన్య విజయం కాదు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం చేసినా.. వారి డొల్ల మాటలకు తెలంగాణ ప్రజలు పడిపొలేదు. తండాల్లో చైతన్యం వచ్చింది కాబట్టే.. జానారెడ్డిని ఇన్నేళ్లు ఏం చేశావు అని నిలదీశారు. నెల రోజుల్లో మిషన్‌ భగీరథ పూర్తి కాబోతున్నది. ఎ/-లోరోసిస్‌ శాశ్వతంగా తరిమికొడతాం. 3,400 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంఓల కర్నె ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here