Featuredజాతీయ వార్తలు

‘ఉగ్ర’పోరులో భారత్‌కి పూర్తి సహకారం

  • మోడీ పెద్దన్నలాంటి వారు
  • భారత్‌కు అన్ని అంశాల్లో సహకరిస్తాం
  • సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌
  • ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో మోడీ, బిన్‌సల్మాన్‌ భేటీ
  • ద్వైపాక్షిక సంబంధాలపై ఇరుదేశాల అధినేతల చర్చ
  • భారత ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు పెద్దన్నలాంటి వారని సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అభివర్ణించారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ముచ్చటిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియా, చైనా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్న సౌదీ రాజుకు… ప్రధాని మోదీ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న సల్మాన్‌.. త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మాట్లాడుతూ… ప్రధాని మోదీని తాను ఆరాధనా భావంతో చూస్తాననీ… ఆయన తనకు పెద్దన్న లాంటి వారని పేర్కొన్నారు. సౌదీ ఆరేబియాను నిర్మించడం కోసం 70 ఏళ్లుగా భారత ప్రజలు తమ శక్తిని ధారపోశారన్నారు. భారత ప్రజలు తమకు మంచి స్నేహితులుగా తమ రాజ్యం భావిస్తోందన్నారు. ఇరు దేశాల భవిష్యత్తు కోసం మున్ముందు కూడా ఇదే సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నానని సల్మాన్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై వత్తిడి తేవాలని నిర్ణయించామన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం.. రెండు దేశాలకు ఇవే సమస్యలు అని, భారత్‌కు అన్ని అంశాల్లోనూ సహకరిస్తామని ప్రిన్స్‌ సల్మాన్‌ అన్నారు. ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని షేర్‌ చేసుకోవడంలోనూ తోడ్పాటు అందిస్తామన్నారు. భావితరాల వారికి మంచి భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తామని ప్రిన్స్‌ అన్నారు.

సౌదీ ఓ విలువైన వ్యూహాత్మక భాగస్వామి – ప్రధాని మోదీ

సౌదీ అరేబియా రాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో భేటీ అయ్యారు. ఇద్దరు నేతల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత సంయుక్తంగా విూడియా సమావేశం నిర్వహించారు. సౌదీ ఓ విలువైన వ్యూహాత్మక భాగస్వామని అని మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా మారాయన్నారు. భారత మౌలికవసతుల రంగంలో సౌదీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమిలో సౌదీ చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయాలన్న అంశాన్ని కూడా చర్చించామని మోదీ తెలిపారు. 

మోదీ ప్రొటోకాల్‌ను విస్మరించడంపై విమర్శలు..

ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వెళ్లి స్వాగతం పలకడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. ట్విటర్‌ ద్వారా మోదీపై విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్‌కు భారీగా ఆర్థిక సాయం చేస్తామని సౌదీ యువరాజు ఒప్పందం చేసుకున్న గంటల వ్యవధిలోనే ప్రధాని మోదీ ఇలా చేశారు. అమరవీరులు, భారతీయ సైనికుల సేవలు, త్యాగం గురించి ఏమనుకుంటున్నారో ప్రధాని మోదీ దేశానికి చూపించారంటూ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌కు 20బిలియన్‌ డాలర్ల మేరకు సాయం చేస్తామని హావిూ ఇచ్చి, పాక్‌ చేస్తున్న ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని ప్రశంసించిన వ్యక్తికి స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టారన్నారు. ఇదేనా పుల్వామా అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకునే మార్గం అంటూ సుర్జేవాలా ప్రశ్నించారు. జేఈఎం చీఫ్‌ మసూద్‌ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చేందుకు సౌదీ అరేబియా మద్దతు కోరే ధైర్యం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close