Featuredప్రాంతీయ వార్తలు

వైభవంగా శ్రీ రామ లింగేశ్వర జాతర ఉత్సవాలు

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు

తాండూర్ (ఆదాబ్ హైదరాబాద్): హిందువులకు అతి పవిత్రమైన శ్రావణ మాసం ముగింపు సందర్భంగా సోమవారం తాండూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వెలిసిన శ్రీరామలింగేశ్వర దేవాలయం లో జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండే స్వామి వారికి ప్రత్యేక పూజలు పల్లకి సేవ భజనలు కీర్తనలు అన్నదాన కార్యక్రమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. జాతర ఉత్సవాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాండూర్ శాసనసభ్యులు రోహిత్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కుటుంబ సభ్యులైన కరంచంద్ ఆ మోహన్ ఉత్తం చంద్ లు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులురాంలింగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాందాస్, శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రత్నమ్మ, ఎంపీటీసీ సీతాబాయి, సర్పంచులు దశరథ్ ,అమృత్ రెడ్డి, కౌసల్య, గ్రామ యువజన విభాగం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close