సామాన్యుడే సమిధ…

0
  • బడా బాబులంతా పదిలం…
  • ఐదేళ్లలో 5.55లక్షల మొండి బకాయిలు రద్దు…

మధ్యతరగతి వాడెప్పుడూ బడా బాబుల ముందు.. బడా నాయకులు ముందు.. బలికావాల్సిందే.. పనికిమాలినా విధానాలతో పైసకు పనికిరాని నిబంధనలు పెడుతున్న బ్యాంకర్ల వ్యవస్థ సామాన్యుడిని సమిధగా మారుస్తున్నాయి.. నడిచే ఎద్దుకే దెబ్బలన్నట్లుగా రూపాయి రూపాయి పోదుపు చేసేవాడికే పనికిమాలిన నిబంధనలు పుట్టుకొస్తాయి.. నలుగురికి తిండి పెట్టడానికి పంట పండించుకుంటాము పదివేల అప్పుకావాలంటే వందసార్లు తిప్పుకుంటారు.. తిప్పుకున్నా సరియైన సమయంలో రుణం చేతికొస్తుందా అంటే అదీ లేదు.. తిరిగి తిరిగి విసిగి వేసారిన రైతన్నకు చివరకు మిగిలేది కాళ్లనొప్పులే.. దేశానికి వెన్నుముక రైతే కదా వారినెందుకు ఇబ్బందీ పెడుతున్నారని అడగడానికి ఒక్కరికంటే ఒక్కనాయకుడికి నోరు పెగలదు.. ఎందుంటే వారి రుణాలు కావాలి. ఉన్నదీ, లేనిదీ చెప్పి, లేనిదీ ఉన్నది రాసి కోట్లకు కోట్లు రుణాలు తీసుకుంటూ మధ్యతరగతి జీవితాలతో ఆటలాడుతారు.. ఎవరికి అందినంతగా, ఎవరికి తోచినంతగా వాళ్లు రుణాల పేరుతో దోచుకుంటున్నారు. అత్యవసరానికి డబ్బులు కావాలని ఎటిఎం వాడినా కూడా పన్నుల మీద పన్నుల వేసే పనికిమాలిన బ్యాంకర్ల వ్యవస్థ మనది.. అవసరానికి మించి వాడారంటూ బ్యాంకులో దాచుకున్న డబ్బులను సైతం ట్యాక్స్‌ల పేరుతో అక్రమంగా, అతి దారుణంగా వసూలు చేస్తున్నారు… రూపాయి, రెండు రూపాయల మీద ఇంత అక్కసు వెళ్లగక్కే ఈ బడా బ్యాంకర్లకు కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకొని ఎగనామం పెట్టేవారు మాత్రం కనబడకపోవడం శోచనీయం..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): నెలలో మూడుసార్లు మించి మన డబ్బులను మనం ఏటిఎం ద్వారా తీసుకుంటే ఫైన్‌… బ్యాంకులో ఒక నెలలో పరిమిత సంఖ్యలో మాత్రమే డబ్బులు డిపాజిట్‌ చేయాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు జమ చేసినా అదనపు చార్జీలు చెల్లించాల్సిందే. అదే సమయంలో బ్యాంకుల నుంచి డబ్బులు వెనక్కి తీసుకున్నా ఛార్జీల భారం తప్పదు. ఇదే కాకుండా చెక్‌బుక్‌ దగ్గర నుంచి బ్యాంకుకు సంబంధించి ఏ సేవ పొందాలన్నా అందుకు ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించక తప్పదు.. ప్రతి పనికి దాన్ని అవసరాన్ని, అవకాశాన్ని బట్టి దోచేయ్యడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సామాన్యుడు కదా ఏం చేసినా అడిగేవారుండరు, పట్టించుకునే వారుండరు అనే ధీమా నేడు బ్యాంకర్లలో ఉంది. వారికి అనుగుణంగానే మనలను పాలించే నాయకులు సైతం ఢంకా బజాయిస్తారు. ఎందుకంటే వారికి, వారికి సన్నిహితులకు కూడా విరివిగా రుణాలు కావాలి.. సామాన్యులపై మరింతగా ముక్కు పిండి వసూళ్లు చేసే బ్యాంకులు తాము ఇచ్చిన అప్పుల్ని వసూలు చేసే విషయంలో ఎంత నిబద్దతతో పనిచేస్తాయో కూడా తెలిసిందే. సామాన్యుడు ఒక బ్యాంకులో పదేళ్ల నుంచి ఖాతా ఉన్నా కాని లక్ష రూపాయల రుణం కావాలని వెళితే సవాలక్ష సందేహల్ని తీర్చి, పదుల సంఖ్యలో పేపర్లను సమర్పించిన తర్వాతే బ్యాంకు నుంచి డబ్బులు చేతికి అందిస్తారు. మనం ఇచ్చిన పేపర్లలో చిన్న తేడా ఉందని తెలిసినా లేనిపోని నిబంధనలు అంటగడుతారు. సామాన్యుల విషయంలో ఇంత ఖచ్చితంగా ఉండే బ్యాంకులు దేశంలోని బడా బాబుల కంపెనీలు, సంస్థల విషయంలో మాత్రం పట్టించుకోనట్టే, ఎంతో ఉదారంగా ఉంటాయన్న విషయాన్ని కొన్ని గణాంకాలు చూస్తే అర్థమవడమే కాదు అవ్కాయ్యే పరిస్థితి కనబడుతోంది. పదివేలు, లక్షరూపాయలు రుణం తీసుకున్న సామాన్యులు రుణం చెల్లించడంలో ఆలస్యమైతే ఇంటి మీదికి దూరి నానా రచ్చ చేస్తారు. అదే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎన్ని వేల కోట్ల రుణాలు తీసుకున్న వసూలు చేయడానికి ధైర్యం కాదు కదా ముందుకే రావడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు తీసుకున్న రుణాలను వసూలు చేయడం చాతకాక వాటిని రద్దు చేస్తున్నారనే ఆరోపణలు మామూలైపోయాయి. వసూలు కాని మొండి బకాయిల విషయంలో బ్యాంకులు రద్దు చేయడం కొత్త విషయమేమి కాకున్నా గడిచిన పదేళ్లలో ఇలా రద్దు చేసినా పారిశ్రామికవేత్తల ఎగవేత లెక్కలు చూస్తే మాత్రం ఆందోళనకు గురికావడమే.. ఐదేళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో మొండి బకాయిల్ని తక్కువగా చేసి చూపించాలన్న అతృతతో బ్యాంకులు వ్యవహిరించిన తీరు గుండెలు అదిరిపోయేలా ఉన్నాయి. రుణాలు ఇచ్చేటప్పుడు సవాలక్ష సందేహలతో తాట తీసే బ్యాంకులు అంత గుడ్డిగా రుణాలు ఎలా ఇస్తాయో ఎవరికి అంతుచిక్కదు. బ్యాంకులకు డబ్బులు కట్టలేమనే పెద్ద మనుషుల విషయంలో బ్యాంకులు ఏం చేశాయన్నది చూస్తే మాత్రం ఏమి కనిపించదు.

పదేళ్లలో లక్షల కోట్ల రూపాయలు మాఫీ..

పదేళ్ల వ్యవధిలో మొత్తంగా ఏడు లక్షల కోట్ల మొండిబకాయల్ని బ్యాంకులు రద్దు చేస్తే గడిచిన ఐదేళ్లలో వీటి సంఖ్య భారీగా ఉండడం గమనార్హం. బిజెపి అధికారం చేపట్టిన గడచిన ఐదేళ్లలో బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిలు రూ.5.55 లక్షల కోట్లు రుణాలు రద్దు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇంత భారీ మొత్తం కేవలం 300 సంస్థలకు చెందిన మొండి బకాయిల్ని రద్దు చేశారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నానంటూ చెబుతున్న ప్రధాని మంత్రి దేశ సంపదను కొల్లగొట్లే బడాబాబుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నదీ ఇప్పుడు ప్రధాన అంశంగా మారిపోయింది. కోట్లకు కోట్లు అప్పులు తీసుకొని ఎగనామం పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తేనే మిగతా వారు కూడా భయంతో ఉంటారనే ఆలోచన మన పాలకులకు రావడం లేదు. దేశంలో గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలని చెప్పుకుంటున్న వారంతా ఏదో ఒక రాజకీయపార్టీకి కాని, రాజకీయనాయకులకు సంబంధించిన వ్యక్తులు కావడంతో బ్యాంకులు సైతం చూసిచూడనట్టుగానే పోతున్నట్లు సమాచారం.

ఐదేళ్లలో రద్దు చేసిన మొండి బకాయిలు..

బ్యాంకు రద్దు చేసినా మొండిబకాయిలను చూస్తే గుండెలు అదిరిపోయేలా ఉన్నాయి.

2016.17లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల మొత్తం రూ. 108374

2017.18లో బ్యాంకులు రద్దు చేసిన రుణాలు మొత్తం రూ. 1613 అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 50శాతం ఎక్కువ..

2018 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మూడు నెలల కాలంలో రద్దు చేసిన రుణాలు రూ. 64000కోట్లు..

2018 తొమ్మిది నెలల కాలంలో రద్దు చేసిన రుణాలు మొత్తం.. 156702..

మొత్తం ఐదేళ్ల బిజెపి పాలనలో బ్యాంకులు రద్దు చేసిన మొత్తం రుణాలు రూ.555603 కోట్లు.

గత పదేళ్లలో బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిలు మొత్తం రూ. 7 లక్షల కోట్లు.. ఇందులో ఒక వంతు మోడీ ప్రభుత్వానికి ముందు వారు రద్దు చేస్తే, ఐదేళ్ల వ్యవధిలో నాలుగు వంతుల రుణాల్ని బిజెపి ప్రభుత్వం రద్దు చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here