దూసుకొస్తున్న ‘ఫణి’

0
  • కేరళలో రెడ్‌ అలర్ట్‌
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రానున్న 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం
  • కోస్తాంధ్రపై ప్రభావం
  • అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

విశాఖపట్నం (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శ్రీలకంలోని ట్రింకోమలీకి 1140 కి.విూ తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 1490 కి.విూ ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 1760 కి.విూ దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం శనివారం రాత్రికి తుఫానుగా మారనుందని ఐఎండీ పేర్కొంది. అనంతరం 96 గంటల్లో శ్రీలంక తీరానికి వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మద్య తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. మే 1వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్‌ కారణంగా తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. తుపాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెను గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు.. అలలు సాధారణం కంటే ఒక విూటర్‌ ఎగసిపడే అవకాశం ఉంది. ఈ ప్రభావం కేరళ రాష్ట్రంపై కూడా పడే ఉన్న క్రమంలో కేరళలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 2018లో వచ్చిన వరదలకు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ‘ఫణి’ తుఫాన్‌ ప్రభావం చసపిస్తుందనే భయంతో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here