Featuredఅంతర్జాతీయ వార్తలు

మాట్లాడుకుందాం..రా !

ఇస్లామాబాద్‌ : పుల్వామా దాడి తదనంతర పరిణామాలతో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి శాంతి చర్చలు అంటూ కొత్త నాటకానికి తెరతీశారు. పుల్వామా దాడి చేసిం ది తామే అని పాక్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ చెబుతున్నా, ఆధారాలు లేవంటూ కళ్లుమూసుకున్న ఆయన… తాజాగా భారత్‌ను చర్చల కోసం ఆహ్వానించారు. పుల్వామా ఘట న అనంతరం భారత్‌కు మేము శాంతి ప్రతిపా దన చేశాం. పుల్వామా దాడిలో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాల బాధను నేను అర్థం చేసుకోగలను. పలు ఆస్పత్రులను సందర్శించి, హింస కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి బాధను నేను కళ్లారా చూశాను.. అంటూ ఇమ్రాన్‌ సన్నాయి నొక్కులు నొక్కారు. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ జరుపుతామని తాము ఇప్పటికే భారత్‌కు చెప్పామనీ… భారత్‌కు సహకరించేందుకు కూడా తాము సిద్ధమని చెప్పామన్నారు. భారత్‌ ఇప్పటికీ చర్యలు తీసుకునే యోచనలో ఉందన్న ఉద్దేశంతోనే… దాడులకు ప్రతిదాడులు ఉంటాయని చెప్పాను. నిన్న ఉదయం భారత్‌ మమ్మల్ని కష్టపెట్టినప్పటికీ మా వైమానిక దళాలను తొందర పడొద్దని

చెప్పాను. భారత్‌ చర్యల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేవరకు ముందుకెళ్లొద్దని సూచించాను.. అని ఆయన చెప్పుకొచ్చారు. పాక్‌ వైమానిక దళాలు సరిహద్దులు దాటి భారత్‌లోకి ప్రవేశించడంపైనా ఆయన స్పందించారు. విూరు మా దేశంలోకి అడుగుపెడితే, మేము కూడా అదేపని చేయగలమని చెప్పేందుకు మాత్రమే మేము ఈ మేరకు స్పందించాం. వాళ్లకు చెందిన రెండు మిగ్‌ విమానాలను కూల్చివేశాం. ఇక ఇక్కడి నుంచి మేము మరింత తెలివిగా వ్యవహరిస్తాం… అని ఆయన పరోక్షంగా భారత్‌ను హెచ్చరించారు. విూ దగ్గరున్న ఆయుధాలు, మా దగ్గరున్న ఆయుధాలతో తలెత్తే పరిణామాలను తట్టుకోగలమా అని నేను భారత్‌ను అడిగాను. ఇదింకా ముదిరితే… నా చేతుల్లోగానీ, మోదీ చేతుల్లో గానీ ఏవిూ ఉండదు..అంటూ యుద్దానికి సిద్ధమన్న సంకేతాలు వదిలారు. పుల్వామా దాడితో భారత్‌ పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలననీ… దీనిపై దర్యాప్తు చేసేందుకు, చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం… చర్చల ద్వారా పరిష్కరించుకుందాం.. అని ఆయన పేర్కొన్నారు. అందుకే భారత్‌ను మరోసారి శాంతి చర్చలకు ఆహ్వానిస్తున్నాని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఇవాళ ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఒకవేళ భారత్‌ కవ్వింపు చర్యలకు పాల్పడితే, తాము తిప్పికొట్టనున్నట్లు ముందే చెప్పానన్నారు. పుల్వామాలో దాడి జరిగిన తర్వాత .. భారత్‌ను శాంతి చర్చలకు ఆహ్వానించామన్నారు. పుల్వామా దాడి పట్ల విచారణ చేపడుతామన్నారు. అయినా భారత్‌ దాడి చేస్తుందేమో అన్న ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నామన్నారు. విూరు మా దేశంలోకి వస్తే, మేం కూడా విూదేశంలోకి వస్తామని ముందే చెప్పామన్నారు. దానికి తగినట్లుగానే ఇవాళ మిగ్‌ 21 విమానాలను కూల్చేశామన్నారు. ఇక నుంచైనా మన విచక్షణతోనే ముందుకు వెళ్దామన్నారు. అన్ని యుద్దాల్లో అంచనాలు తప్పాయన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ ఒక వారంలోనే ముగుస్తుందనుకున్నారు, కానీ ఆరేండ్లు అది సాగిందన్నారు. ఉగ్రవాదంపై యుద్ధం కూడా 17 ఏళ్లుగా కొనసాగుతోందన్నారు.

యుద్ద సన్నాహాల్లో పాక్‌

సివిల్‌ డిఫెన్స్‌ సైరన్‌ల మోత

భారత్‌పై యుద్దానికి పాకిస్తాన్‌ పూర్తి స్థాయి సన్నాహాలు ప్రారంభించింది. ఇస్లామాబాద్‌ రావల్పిండిలో సివిల్‌ డిఫెన్స్‌ సైరన్‌లను మోగించింది. ఇలా చేయడమంటే యుద్దానికి సంకేతంగా భావిస్తారు. గత కొన్నేళ్లుగా సివిల్‌ డిఫెన్స్‌ సైరన్‌లను పాక్‌ మోగించలేదు. పౌరులను అప్రమత్తం చేసేందుకు ఇప్పుడు సైరన్ల మోత మోగించింది. మరోవైపు శ్రీనగర్‌, రాజౌరీలో భారత్‌ గగనతల నిషేదాజ్ఞలు ప్రకటించింది. నో ఫ్లయింగ్‌ జోన్లుగా ప్రకటించి విమానాల రాకపోకలపై నిషేదాజ్ఞలు విధించారు. జమ్మూకశ్మీర్‌లో పలు విమానాశ్రయాల్లో హై అలర్టు ప్రకటించిన అధికారులు పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. అమృతసర్‌, ఛండీగఢ్‌లోనూ విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు.

ఈ వైపు యుద్ధ విమానాలను భారత్‌ వైపు పంపిన పాకిస్తాన్‌ మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ ట్విట్టర్లలో విమానాల కూల్చివేతకు సంబంధించిన ట్వీట్‌లు చేశారు. బుధవారం ఉదయం రెండు భారత విమానాలు పాక్‌ గగనతలంలోకి ప్రవేశించాయని.. తాము వాటిని కూల్చివేశామని ఆయన ప్రకటించారు. రెండు భారత విమానాల్లో ఒకటి కశ్మీర్‌లోనూ, మరొకటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనూ కూలిపోయాయని వెల్లడించారు. ఒక భారత పైలట్‌ను కూడా అరెస్టు చేసినట్లు ఆయన ట్వీట్‌ చేశారు. అయితే రెండు విమానాలను కూల్చి వేశామంటూ పాక్‌ చేసిన ప్రకటనను భారత్‌ ఖండించింది. తమ పైలట్లు ఎవరినీ పాక్‌ నిర్బంధించలేదని ప్రకటించింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగిన పాక్‌కు బుద్ధి చెప్పామని భారత్‌ ప్రకటించింది. సరిహద్దుల్లో తాజా పరిణామాలపై కేంద్ర ¬ంమంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. సరిహద్దుల్లో పరిస్థితిని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close