కుప్పకూలిన జెట్‌ షేర్లు

0

న్యూఢీల్లీ : రుణ సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీ సీఈఓ వినయ్‌ దూబే, డిప్యూటీ సీఈఓ అమిత్‌ అగర్వాల్‌ ఒక్క రోజు వ్యవధిలోనే తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిణామాలు కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత రెండు రోజులుగా భారీగా నష్టపోయిన జెట్‌ షేర్లు మూడో రోజు కూడా కుప్పకూలుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో జెట్‌ షేరు భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ఒకానొక దశలో షేరు ధర 7శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బీఎస్‌ఈలో జెట్‌ షేరు విలువ 5.07శాతం నష్టంతో రూ. 122.55 వద్ద కొనసాగుతోంది. గడిచిన మూడు సెషన్లలో కంపెనీ షేరు ధర 20శాతానికి పైగా పడిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ గత నెల 17న తాత్కాలికంగా మూతబడిన విషయం తెలిసిందే. సంస్థ కార్యకలాపాలు నిలిపివేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా.. జెట్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. మరోవైపు ఇప్పటికే కంపెనీ నుంచి నలుగురు ఎగ్జిక్యూటివ్‌లు తప్పుకున్నారు. బోర్డు సభ్యుల్లో కూడా పలువురు రాజీనామా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here