Featuredరాజకీయ వార్తలు

తెలంగాణను వీడని చలిపులి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో చలి పులి ప్రజలను వణికిస్తూనే ఉంది. పెథాయ్‌ తుఫాన్‌ తీవ్రత తగ్గిపోయినా.. చలి మాత్రం తగ్గలేదు. ఉత్తర తెలంగాణలో రాబోయే

రెండు, మూడు రోజుల్లో చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంపై పెథాయ్‌ తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా ఉంటాయని చెప్పారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుందని, ఇతర జిల్లాల్లో తక్కువగా ఉంటుందని వివరించారు. పెథాయ్‌ తుపాను ప్రభావం తగ్గినా సూరీడు దర్శనమివ్వడం ఆలస్యం అవుతూనే ఉంది. దీంతో ఆదిలాబాద్‌ తదితర జిల్లాలను చలి వెంటాడుతోంది. చల్లని గాలులు వీస్తుండటంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. క్రమంగా కనిష్ఠ ఉష్ణోగ్రత తగ్గుతూ వచ్చింది. చలి తీవ్రత ఉన్నప్పటికీ జనాలు మాత్రం రక్షణ కవచాలు ధరించి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. మరో మూడ్రోజుల పాటు శీతల పవనాలు వీస్తాయని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటు న్నారు. చలి కారణంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకో వాలని వైద్యులు సూచిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతాయని, గురువారం 26 డిగ్రీలుగా నమోదైందని తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 4.8 డిగ్రీలుగా నమోదైంది. ఇంత తక్కువ నమోదవడం ఈ సీజన్‌లో ఇదే తొలి సారి. వైరల్‌ జ్వరాలతో బాధ పడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతకు తొమ్మిది మంది మృతి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురు; ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు; నిర్మల్‌, నిజా మాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

భారీగా పెరుగుతున్న చలితీవ్రత రాత్రిళ్లు పెరుగుతున్న చలి : తెలుగు రాష్ట్రాలను చలి వణికించేస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతల శాతం పడిపోతోంది. ఐదారు డిగ్రీలకు ఉష్ణోగ్రతల శాతం పడిపోతోంది. విశాఖ మన్యం చలి గుప్పెట్లో వణికుతోంది. రాత్రిళ్లు హైదరాబాద్‌ సహా అంతటా చలి పెరుగుతోంది. విశాఖ ఏజెన్సీలో 6 డిగ్రీలకు మించి నమోదు కావటంలేదు. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయింది. నగరాల్లోనే చలి వణికిస్తోందనుకుంటే.. ఇక విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు గజగజలాడిస్తున్నాయి. ప్రతిసారీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత చేరుకుంది. దాంతో అక్కడ సాయంత్రం అయ్యేసరికే అంతా నిర్మానుష్యంగా మారుతోంది. రాత్రిపూట అస్సలు ఎవరూ బయటకు రావడం లేదు. మరోవైపు ఇదే సమయంలో అక్కడ పర్యాటకుల సందడి కూడా పెరుగుతుంది. అంబసింగితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. విశాఖ ఏజెన్సీలో చలితీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాయంత్రం అయితే.. బయటకు రావడానికి ప్రజలు వెనుకాముందా డుతున్నారు. ఉన్నవాళ్లు ఉన్నిదుస్తులతో తిరుగుతుంటే.. లేనివారు మంటలు వేసుకొని చలి పులి నుంచి తప్పించుకొంటున్నారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం పూర్తి నిర్మలంగా ఉండడం, ఎక్కడా తేమ లేకపోవడం చలి తీవ్రత మరింత పెరిగేందుకు దోహదపడుతోందని తెలిపారు. చలిగాలులు ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ, కోస్తా విూదుగా దిగువన కర్ణాటక వరకు విస్తరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల చుట్టూ ఉన్న విదర్భ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యమహారాష్ట్రలు ఇప్పటికే చలి గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఆ ప్రభావం తెలంగాణ, కోస్తాలపై పడింది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. తెలంగాణ, ఉత్తర కోస్తా, కోస్తాల్లో శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. మధ్య భారతంలో నెలకొన్న అధిక పీడనం ప్రభావంతో చలిగాలులు నేరుగా తెలుగు రాష్ట్రాలను తాకుతున్నా యని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. మంచు క్రమేపీ పెరుగుతుండడం కూడా చలికి ఒక కారణమన్నారు. రేడియేషన్‌ ప్రభావంతో భూమి త్వరగా చల్లబడు తోందని, అందువల్లే రాత్రి ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోతున్నాయని వివరించారు. ఆకాశంలో ఎక్కడా మేఘాలు కానరావడం లేదని, పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మంచు ఎక్కువగా కురుస్తుందని, రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయని పేర్కొంది. తేమ శాతం కూడా క్రమంగా తగ్గుతోందని, దీనివల్ల చలిగాలులు పెరిగే అవకాశం వున్నదని వివరించింది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు వచ్చేవరకు చలిగాలులు ఉంటాయని పేర్కొంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close