Featuredస్టేట్ న్యూస్

మేడారంకు సీఎం కేసీఆర్‌.. పర్యటన ఖరారు

మేడారం జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 7వ తేదీన కుటుంబసమేతంగా కేసీఆర్‌ మేడారంలో పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే.. సీఎం రాక సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును కూడా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. జాతర సందర్బంగా మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. కోట్లాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని తరిస్తున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close