Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

ప్రగతిభవన్‌లో అధికారులు, మంత్రితో చర్చ

హైకోర్టు ఆదేశాలపై ప్రధానంగా దృష్టి

హైదరాబాద్‌

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన ప్రతి అందడంతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఆర్టీసీలోని ఈడీ స్థాయి అధికారులతో కార్మికులను చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉంది. విలీనం మినహా మిగతా డిమాండ్లపై చర్చలకు పిలిచే అవకాశాలున్నాయి. కాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చ జరపాలన్న హైకోర్టు ఆదేశాల కాపీ ప్రభుత్వానికి చేరింది. తీర్పు కాపీని మంత్రి పువ్వాడ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌తో మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఉన్నాతాధికారులు సమావేశమయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె తరవాత బస్సుల రవాణా, తదిర ఘటనలపై చర్చించారని సమాచారం. గ్రామాల్లో బస్సులు 90శాతం తిరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో సమ్మె కారణంగా ఉత్పన్నమైన పరిణామాలు, హైకోర్టు ఆదేశాలపై వ్వయహరించాల్సిన వ్యూహంపైనేప్రధానంగా చర్చించారని సమాచారం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close