Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

కోడెల మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌

టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎపి అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని సిఎం కెసిఆర్‌ ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపట్ల స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి బసవతారకం ఆస్పత్రికి చేరుకుని కోడెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమవారం ఉదయం కోడెలకు గుండె పోటు రావడంతో వెంటనే బసవతారకం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కోడెల చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే, కోడెల ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క కోడెల గుండెపోటుతోనే మృతి చెందినట్టు ఆయన వ్యక్తిగత సిబ్బంది చెబుతుండగా, ఒత్తిళ్ల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన అనుచరులు తెలిపారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close