శారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం కేసీఆర్‌

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): ముఖ్య మంత్రి కేసీఆర్‌ మరోసారి ఏపీకి వెళ్లనున్నారు. వచ్చేనెల 10న విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో వచ్చేనెల 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఇటీవల ఎర్రవల్లిలో ఐదురోజుల పాటు సహస్ర చండీ యాగాన్ని కేసీఆర్‌ నిర్వహిం చారు. శారదాపీఠాధిపతి

స్వరూపానంద స్వామి యాగానికి హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాల్సిందిగా కేసీఆర్‌ను స్వరూపానంద స్వామి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చేనెల 14న సీఎం కేసీఆర్‌ విశాఖ వెళ్లి శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. అక్కడ జరిగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో కేసీఆర్‌ కుటుంబసభ్యులతో కలిసి పాల్గొంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించ నున్నారు. డిసెంబర్‌ నెలలో ఫెడరల్‌ ఫ్రెంట్‌కు సంబంధించి టూర్‌కు బయలుదేరిన సమయంలో మొదటగా కేసీఆర్‌ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here