FeaturedInterviewsరాజకీయ వార్తలు

వేల కోట్లు సంపాదించిన కేసీఆర్

ముఖ్యమంత్రి రేసులో లేను. కోవర్టులను గుర్తించాం.
కేసీఆర్ కోట్లు దాచుకున్నాడు..

★ వ్యవస్థల నిర్వీర్యం
★ అప్పుల ఊబిలో తెలంగాణ
★ ప్రజల కోసం జతకట్టాం

కాంగ్రెస్ మ్యినిఫెస్టో కమిటి చైర్మన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ.

ఆయన పరశివుని భక్తుడు. మంత్రాలు పఠిస్తూ పూజాది కార్యక్రమాలు చేస్తారు.
సరిగ్గా తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిస్తున్న రోజున షష్ఠిపూర్తి చేసుకోబోతున్నారు. గేలిస్తే కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి రేసులో ఉంటారు. కానీ ఆయనకు ఆ పదవిపై ఆశలేదు. ఇలాగే ఉంటానని చెపుతారు. తప్పు జరిగితే ధైర్యంగా ఒప్పుకునే అరుదైన వ్యక్తి. రాష్ట్ర ఆర్థిక విషయాలపై ఆయనకు ఒక నిర్థిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మనో నిబ్బరం ఆయన సొంతం. అందరితో దామన్నగా పిలవబడే దామోదర రాజనర్సింహతో ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ.

? రాష్ట్రం సుమారు 1,80,000 కోట్ల అప్పులతో ఉంది కదా..?

● అవును రాబోయే మా ప్రభుత్వానికి ఇదో పెద్ద సవాల్.

? మరి మీ పార్టీ కూడా అనేక ఉచిత పథకాలు ప్రకటించింది కదా..?

● అవును. దేశంలో పేద, మధ్య తరగతి వారిని దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ తెచ్చింది. రాష్ట్రంలో కూడా అదే విధంగా పాటించాం. ఇక ముందు కూడా పాటిస్తాం.

? కేసీఆర్ కోట్టు దాచుకున్నారని విమర్శలు చేస్తున్నారు.?

● కోట్లు కాదు.. వేలకోట్లు వెనకేసుకున్నాడు. ఏ కోణంలో చూసినా అవినీతే తాండవిస్తోంది. నిర్భంధాలు కొనసాగించింది.

? ఎలాంటి నిర్భంధాలు..?
● ప్రశ్నించే వాడు మిగలకూడదనే భావనలో కేసీఆర్ ఉన్నాడు. అస్సలు ప్రతిపక్షాలు లేకుండా ఆయన ఒక్క పార్టీ మాత్రమే బతకాలనే ప్లాన్ చేశాడు. ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాడు.

? కూటమిలో 18 మంది కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ గుర్తించింది. ఏమంటారు..?

● ఈ విషయంపై గత ఆరేడు నెలలుగా ఏఐసీసీ తెలంగాణ పిసిసిని హెచ్చరించింది. కొందరిని గుర్తించాం. ఈ విపరీత ధోరణికి కేసీఆర్ నీచ రాజకీయాలే కారణం.

? ఈసారి కాంగ్రెస్ లో సీట్ల వ్యవహారం ఎలా ఉంది.?

● గెలిచే పార్టీకదా ఆశావహులు సహజంగా ఎక్కువమంది ఉన్నారు. అందుకే ఏడు అంచెల వడపోతలతో ఆభ్యర్థుల నిర్ణం ప్రజాభీష్టాం మేరకు జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి విషయం. సామాన్య కార్యకర్తలతో అనేక దశలలో అధిష్టానం టచ్ లో ఉంది.

? ఇక ‘కులం’ కార్డు గురించి..?

● దేశానికి ఏది అనవసరమో అదే అదరికి అవసరమై కూర్చుంది. ఆది రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరడం దురదృష్టంకరం. నేను దానికి వ్యతిరేకం.

? పద్మినీ రెడ్డి గురించి మీరు పడిన ఇబ్బంది..?

● నేను నియంతను కాను. నా భార్య పద్మినీ రెడ్డి అభిప్రాయాలను గౌరవిస్తాను. తాను మళ్ళీ మనసు మార్చుకొని వచ్చింది. అనందం.

? పార్టీ ఆమెకు హామీలు ఇచ్చిందా..?

● ఆమె అందరిలాంటి సామాన్య కార్యకర్త. ప్రతిభ ఉంటే సహజంగానే పార్టీ గుర్తిస్తుంది. అంతేకాని ఎలాంటి హామీలతో ఆమె తిరిగిరాలేదు. ఇష్టపూర్వకంగా తిరిగొచ్చింది.

? మీ అస్తుల వివరాలు..?

● నా జీవితం తెరిచిన పుస్తకం. కేసీఆర్ నా ఫైళ్ళన్నీ తిరగేసి, మరగేశాడు. ఏం దొరకలేదు. అందుకే మౌనంగా ఉన్నాడు.

? మీరు దినచర్యలో భాగంగా పూజలు చేస్తారు కదా..?
నేను శివభక్తుడిని. అమ్మవారి ఉపాసకుడను. నేను స్వయంగా మంత్రాలు పఠిస్తాను. అందుకే నా వద్దకు చెడు రాదు. చెడు చేసే వారు రారు.

? చివరిగా పార్టీ గెలిస్తే మీరు సిఎం రేసులో ఉన్నారా..?

● నేను ఏరేసులో లేను. ముఖ్యమంత్రి పదవిపై అస్సలు ఆశ లేదు. ఆ వైపు ఆలోచనలు కలలో కూడా రానివ్వను. పార్టీ ఆదేశాల మేరకు అధిష్టానం ఏం చెపితే అది ఒక నిబద్ధత కలిగిన కాంగ్రేస్ కార్యకర్తగా పనిచేస్తాను.

గోల్కొండ రిసార్టులో కాంగ్రెసు జాబితా గురించి కబురు అందటంతో ఆదాబ్ హైదరాబాద్ బెస్టాఫ్ లక్ చెపుతూ సెలవు తీసుకుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close