Featured

సిఎం జగన్మోహన్‌ రెడ్డి గారూ…. ఆ కోర్టు ఖర్చు ఎవరిది..?

  • సిఎం హోదాలో నిందితుడిగా..
  • దేశ చరిత్రలో తొలిసారి
  • ’60 లక్షల’ సాకు ఏల..?
  • విలువలు ఎక్కడ..?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అతను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా అప్పటికే పలు సిబిఐ కేసులలో, ఈడీ కేసులలో నిందితుడు. ఒకసారి రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడుకోవాలి.. తప్పదు. రాజకీయాలలో నైతిక విలువలు ఎక్కడ..? ముఖ్యమంత్రి ¬దాలో ఆయన నిందితుడు కాదు. అంతకుముందే 11 కేసులు, ఈడీ కేసులలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న నాయకుడు. ముఖ్యమంత్రి అయ్యారు. 63 ఏళ్ళ చరిత్రలో తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి ఇలా న్యాయస్థానం ముందుకు రావడం ఇదే ప్రథమం. అయితే నైతిక విలువలు ఉండాల్సిన అవసరం లేదా..? ఇది ఎవరికి తలవంపులు. ప్రజాస్వామ్యానికా..? రాజకీయానికా..? ముఖ్యమంత్రి ¬దాలో ఎదుర్కొంటున్న కేసులకు.. ముఖ్యమంత్రి ¬దాలో ఖర్చులు భరించవచ్చు. మరి ముఖ్యమంత్రి కాకముందే ఉన్న కేసులకు ఇప్పుడు ప్రజాధనం వృధా ఎందుకు..? తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై జగన్‌ రాజీనామా చేస్తారా..? లేదా..? ఆయన అంతరాత్మకు ఆరనే సమాధనం. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

గతంలో ఏం జరిగింది:

జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సీబీఐ కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. జగన్‌ మొత్తం 11 సీబీఐ కేసుల్లో ఏ1 గా ఉన్నారు. దీంతో గతంలో ప్రతి వారం ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యేవారు. ఎన్నికల ముందు నుంచీ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోరుతూ వచ్చారు. ఎన్నికల తరువాతా కోరారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒక్క రోజుకు మినహాయింపు ఇచ్చిన కోర్టులు, పూర్తిగా మినహాయింపు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి కోర్టుకు హాజరుకావల్సి వచ్చింది. సుమారు రెండు గంటల పాటు ఆయన కోర్టు ప్రాంగణంలో గడిపారు.

11 సిబిఐ కేసుల వివరాలు:

1వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-8, 2012 హెటిరో, అరబిందో ఫార్మా

2వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-9, 2012 వ్యక్తిగత పెట్టుబడిదారులు

3వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-10, 2012 రాంకీ

4వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-14, 2012 వాన్‌ పిక్‌

5వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-12, 2013 దాల్మియా సిమెంట్స్‌

6వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-24, 2013 ఇండియా సిమెంట్స్‌

7వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-25, 2013 రఘురాం సిమెంట్స్‌

8వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-26, 2013 పెన్నా సిమెంట్స్‌

9వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-27, 2013 ఇందు టెక్‌ జోన్‌

10వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-28, 2013 లేపాక్షి నాల్డెజ్‌ హబ్‌

11వ చార్జిషీటు కేసు నంబర్‌: సీసీ-26, 2014 ఏపీ హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌, ఈడీ నమోదు చేసిన 6 అభియోగపత్రాలకు సంబంధించిన కేసులపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులలో నిందితులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ తదితరులు విచారణకు హాజరయ్యారు. గత 8ఏళ్లుగా ఈకేసు విచారణ జరుగుతోంది.

విచారణ 17కి వాయిదా:

కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. డిశ్చార్జి పిటిషన్లన్నీ కలిపి విచారణ జరపాలన్న జగన్‌ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని సీబీఐ, ఈడీ కోర్టు ఈనెల 17కి వాయిదా వేసింది.

ఇలా మొదలైంది:

2011 ఆగస్టు 10న కాంగ్రెస్‌ నాయకులు శంకర రావు, తెలుగుదేశం నాయకులు ఎర్రన్నాయుడు హైకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ ఆధారంగా జగన్‌ పై కేసు పెట్టి విచారణ ప్రారంభించింది సీబిఐ.2012 మే 27వ తేదీన ఆయన్ను అరెస్టు చేశారు. 16 నెలలు జైల్లో ఉన్నారు జగన్‌. విడుదల తరువాత కేసు చార్జిషీట్లు పూర్తయ్యాక, సీబీఐ కోర్టులో ప్రతీ శుక్రవారం జగన్‌ కేసు విచారణ చేపట్టారు. దీంతో వారం వారం ఆయన విచారణకు హాజరయ్యేవారు. పాదయాత్ర సందర్భంగా.. ఒకరోజు విశ్రాంతిని ఇస్తూ.. కూడా ఆయన ఈ కేసుల విచారణకు హాజరయ్యారు.

రూ. 60 లక్షలు:

సిబిఐ కేసులకు సంబంధించి శుక్రవారం ఏపి సిఎం ¬దాలో జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాదులోని కోర్టుకు హాజరైతే ఒక్క రోజుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 60 లక్షలు. ఆ ఖర్చు వివరాలను జగన్‌ తరఫున న్యాయవాది నిరంజన్‌ రెడ్డి చెప్పారు. సిఎం ¬దాలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఒక రోజు సిబిఐ కోర్టుకు హాజరైతే సెక్యూరిటీ, ప్రోటోకాల్‌, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ. 60 లక్షల దాకా అవుతుందని, కోర్టుకు హాజరైనప్పుడు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితిలో జగన్‌ కోర్టుకు హాజరు కావడం వల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని ఆయన చెప్పారు. ఆ ఖర్చును, ఎపి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్‌ కు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ రూ. 60 లక్షలు ప్రభుత్వం చెల్లించటంపైనే ప్రజాస్వామ్య వాదులు గర్హిస్తున్నారు.

బోనెక్కిన తొలి ముఖ్యమంత్రి ఈయనే..- యనమల

సిఎం జగన్‌ పై శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోర్టుబోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రిగా జగన్‌ ఘనత సాధించారని ఎద్దేవా చేశారు. 63 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ రాష్ట్రానికి ఇంత చెడ్డపేరు తీసుకురాలేదని దుయ్యబట్టారు.

జగన్‌ రాజీనామా నిర్ణయం..?: ఊసరవెల్లి రాజకీయిలకు జగన్‌ దూరం. ఒక విధంగా దేశ రాజకీయాలకు ఆదర్శం. అధికార పార్టీలోకి ఏ ప్రజా ప్రతినిధి రావాలనంకంన్నా.. తప్పకుండా గతంలో పార్టీకి, ఆ ¬దాకు తప్పకుండా రాజీనామా చేసి రావాలనే నిబంధన ఎంతో నైతిక విలువలతో కూడిన కఠినమైన నిర్ణయం. అలాంటి మార్గ నిర్థేశం చేసిన జగన్‌ ముందు ఓ సంక్లిష్టమైన సమస్య నిలబడి ఉంది. ఏ నైతిక విలువల కోసం ఆయన ముందుకు సిగుతున్నారో… ఇప్పుడు అదే నైతిక విలువలు ఆయన్ని నిలబెట్టీ అడూగుతున్నాయి. ఓ ముఖ్యమంత్రి ¬దాలో ఆయన.. ఓ నిందితుడిగా నిలబడి ఉండటం తగదు. అది ఆయన మనస్థత్వానోకి విరుద్ధం. మరి జగన్మోహన్‌ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా..?.లేక ఇలాగే ముందుకు సాగుతారా.. ? అనేది.. ఆయన.. ఆయన అంతరాత్మ తేల్చుకోవలసిన తరుణం ఇదే..! ఏం జరుగుతోంది అనే విషయం వేచిచూద్దాం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close