గొడవ పడిన జంట బాక్స్‌ ఆఫీస్‌ క్లాష్‌

0

బాలీవుడ్‌ లో ఫైర్‌ బ్రాండ్‌ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు కంగనా రౌనత్‌. మాటల్లో చేతల్లో ఒకేరకమైన దూకుడు చూపించే ఈ రింగుల సుందరికి ఇండస్ట్రీలో స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువ. అందులోనూ గతంలో హ తిక్‌ రోషన్‌ తో మీడియా వేదికగా పెట్టుకున్న గొడవ ఎంత దూరం వెళ్లిందో అందరూ చూశారు. ఇప్పుడు మరోసారి క్లాష్‌ కు రెడీ అవుతోందీ జంట. కాకపోతే అది బాక్స్‌ ఆఫీస్‌ వద్ద. హతిక్‌ రోషన్‌ హీరోగా సూపర్‌ 30 కోచింగ్‌ సెంటర్‌ వ్యవస్థాపకుడి బయోపిక్‌ ఆధారంగా రూపొందుతున్న మూవీ రిలీజ్‌ ని కొద్దిరోజుల క్రితం జూలై 26గా ప్రకటించారు. నిజానికి ఇది గత డిసెంబర్‌ లేదా జనవరిలో రిలీజ్‌ కావాల్సింది దర్శకుడు వికాస్‌ బాహ్ల్‌ మీద మీటూ ఆరోపణలు రావడంతో ఇది నిరవధికంగా వాయిదా పడి చాలా భాగం రీ షూట్‌ చేసుకుని ఇప్పటికి సిద్ధమయ్యింది. మరొవైపు కంగనా రౌనత్‌ రాజ్‌ కుమార్‌ రావు జంటగా రూపొందిన మెంటల్‌ హై క్యా కూడా అదే డేట్‌ జూలై 26ని ఫిక్స్‌ చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. దీన్ని గతంలో జూన్‌ లో తీసుకువద్దాం అనుకున్నారు. కాని సాంకేతిక కారణాలతో పాటు అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మార్పు చేయాల్సి వచ్చినట్టు నిర్మాత ఏక్తా కపూర్‌ ప్రెస్‌ నోట్‌ లో పేర్కొంది. బాలీవుడ్‌ వర్గాలు మాత్రం కంగనా కావాలనే హతిక్‌ తో క్లాష్‌ కావాలని కోరుకుందని అందుకే ఏక్తాతో తనకున్న చనువుతో డేట్‌ మార్పించిందని టాక్‌ వచ్చింది. క్వీన్‌ కు దర్శకుడిగా ఉన్నప్పుడు వికాస్‌ బాహ్ల్‌ వేధించాడని చెప్పిందని కంగనానే. ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో హ తిక్‌ వికాస్‌ ల మీద ఒకేసారి రివెంజ్‌ తీర్చుకునే ప్లాన్‌ అన్నమాట. వికాస్‌ వదిలేసిన సూపర్‌ 30లో భాగాన్ని అనురాగ్‌ కశ్యప్‌ పూర్తి చేశాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here