Featuredజాతీయ వార్తలు

కీలక కమిటీ నుంచి తప్పుకున్న సీజేఐ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ విషయంలో నిర్ణయం తీసుకోనున్న అత్యున్నత స్థాయి కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టి రంజన్‌ గొగొయ్‌ తప్పుకున్నారు. ఆలోక్‌ వర్మను తిరిగి విధుల్లో చేరాలని, ఆయనను సెలవుపై పంపడం తగదని మంగళవారం తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో రంజన్‌ గొగొయ్‌ భాగమై ఉన్నందున ఆయన ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. తన స్థానంలో జస్టిస్‌ ఏకే సిక్రీని గొగొయ్‌ ప్రతిపాదించారు.ఆలోక్‌ వ్యవహారంలో నిర్ణయం తీసుకునేందుకు కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ లేదా ఆయన నామినీ సభ్యులుగా ఉంటారు. ఆలోక్‌ విషయంలో ఈ కమిటీ వారంలోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో మోదీ, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, జస్టిస్‌ ఏకే సిక్రీలతో కూడిన కమిటీ ఆలోక్‌పై చర్యల విషయంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నారు. సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాల మధ్య వివాదాలు రచ్చకెక్కడంతో కేంద్రం వారిద్దరినీ అక్టోబరులో సెలవుపై పంపింది. తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాలు చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆలోక్‌ను బలవంతంగా సెలవుపై పంపడం కుదరదని, ఆయన్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్‌ తాత్కాలిక సస్పెన్షన్‌ లేదా తొలగింపునకు సంబంధించి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. అలాంటి నిర్ణయాలను ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత స్థాయి కమిటీ అనుమతితో మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close