Featuredస్టేట్ న్యూస్

కొత్త సంవత్సర వేడుకలకు నగరం ముస్తాబు

  • పలుచోట్ల లైటింగ్‌ ఏర్పాట్లు
  • ఆకట్టుకుంటున్న అలంకరణలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబయ్యింది. నగరంలో పలు ¬టళ్లు, పబ్బులు, రిసార్టులు ప్రత్యేక కార్యక్రమాలతో ¬రెత్తించనున్నాయి. వీధులన్నీ లైటింగ్‌ మెరుపులతో దర్వనమివ్వనున్నాయి. ప్రధాన కూడళ్లు షాపింగ్మాల్స్‌ ప్రత్యేక అలంకరణలతో కనిపిస్తున్నాయి. స్టార్‌ ¬టళ్లు, పబ్బులు, రిసార్టుల్లో ధగదగలు మెరుస్తున్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే యువత ప్యతేక ఏర్పాట్లలో తలమునకలయ్యింది. మరోవైపు పోలీసులు తమ ఏర్పాట్లలో తామున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనజరక్కుండా చర్యలకు ఉద్యుక్తులవుతున్నారు. ఇందులో భాగంగా డిసెంబరు 31 రాత్రి నుంచి 2018 జనవరి 1న ఉదయం వరకూ ఒక్క ప్రమాదం కూడా జరక్కుండా పోలీస్‌ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.. ఇందులో భాగంగానే పబ్బులు, బార్లలో వేడుకలపై ఆంక్షలు విధించారు. మద్యం సరఫరాపై నిబంధన విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న తెల్లవారుజాము 5 గంటల వరకూ ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహించనున్నామని ట్రాఫిక్‌ పోలీసులు వివరించారు. అర్ధరాత్రి సంబరాలు.. యువతీ యువకుల కేరింతలు.. ¬రెత్తే సంగీతం.. హుషారెక్కించే వాతావరణం.. కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ డిసెంబరు 31న నగరమంతా పండుగ చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. కొత్త సంవత్సర సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వినోదాలు, వేడుకలపై పోలీస్‌యంత్రాగం దృష్టి కేంద్రీకరించింది. వేడుకలు సంతోషంగా పూర్తవ్వాలన్న లక్ష్యంతో ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్‌ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.తనిఖీలు నిర్వహించడం ద్వారా మద్యం తాగిన వారి వాహనాలు స్వాధీనం చేసుకుని ఆటోలు, ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు పబ్బులు, బార్ల యజమానులకు తాఖీదులు జారీ చేశారు. ప్రతి బృందంలో ఒకరు తాగకుండా ఉండాలని, ఇందుకు బాధ్యత యజమానులు తీసుకోవాలని ఆదేశించారు. ఒకరికి మద్యం సరఫరా చేయకూడదని పేర్కొన్నారు. వేడుకలు పూర్తయ్యాక బృందం సభ్యులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు ఒక్కరుండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోతాదుకు మించి మద్యం తాగిన ప్రతి ఒక్కరినీ పబ్బులు, బార్లలోపలే బ్రీత్‌ అనలైజర్లతో తనిఖీలు చేయాలని సూచించారు. మద్యం తాగిన వారి రక్తంలో మోతాదుకు మించి ఆల్కాహాల్‌ ఉన్నట్టు గుర్తిస్తే వారికి వాహనాలున్నా పబ్బులు, బార్ల యజమానులు డ్రైవర్లను నియమించి మద్యం తాగిన వారిని సురక్షితంగా ఇళ్లకు పంపించాలని వివరించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారు ప్రమాదాలు చేయకుండా రాత్రి 10 గంటల నుంచే ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. వందకుపైగా సంచార, మారువేషాల బృందాలతోపాటు కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు మందుబాబుల వాహనాలను నిలిపి తనిఖీలు చేయనున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ప్రతి వాహనదారుడి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. మరుసటి రోజు ఠాణాకు వెళ్లి తీసుకోవాలి. కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించే స్టార్‌ ¬టళ్లు, ఇతర వేదికల ప్రతినిధులు 15 రోజుల ముందు అనుమతులు తీసుకున్నారు.కొత్తసంవత్సర వేడుకల సందర్భంగా ప్రదర్శనలు, సంగీత కచేరీలు, నృత్యప్రదర్శనల్లో అసభ్యంగా దుస్తులు ధరించడం, నృత్యం చేయడం వంటివాటిని గుర్తిస్తే వెంటనే అనుమతి రద్దు చేస్తారు. ప్రత్యేక వేడుకల సందర్భంగా ఎక్కువ టిక్కెట్లు, పాసులు విక్రయించినా, మైనర్లను అనుమతించినా చర్యలు తప్పవు. ప్రవేశ, నిష్కమ్రణ ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు సరైన స్థలాన్ని ఏర్పాటు చేయాలి. సమయం మించకుండా వేడుకలను ముగించాలి. సంగీత¬రు 45 డెసిబుల్స్‌కన్నా ఎక్కువగా ఉన్నా, బాణాసంచా వినియోగించినా బాధ్యులైన వారిని అరెస్ట్‌చేయనున్నారు. పార్టీల పేరుతో మాదకద్రవ్యాలు సరఫరాచేస్తే యజమానులపై కేసులు నమోదు చేయనున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close