Featuredజాతీయ వార్తలు

ఉక్కిరిబిక్కిరి..!

  • కాలుష్యంతో బెంబేలెత్తిపోతున్న ఢిల్లీ వాసులు
  • సరి-భేసి విధానం అమల్లోకి తెచ్చిన ఆప్‌ సర్కార్‌
  • రూల్స్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • రూల్‌ ఉల్లంఘించిన బీజేపీ నేతకు జరిమానా
  • వాహనదారులకు తప్పని వెతలు

న్యూఢిల్లీ

దేశ రాజధానిలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో ఢిల్లీలో నివసించేందుకు జనాలు బెంబేలెత్తుతున్నారు. కాలుష్య పొగలు కమ్ముకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 5 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ సర్కార్‌ సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేస్తోంది. ఈ పద్ధతిని వాహనదారులు సైతం స్వాగతిస్తున్నారు. అయినప్పటికీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని వాహనదారులు ఇప్పటికే విఙ్ఞప్తి చేశారు. కేజీవ్రాల్‌ ప్రభుత్వం కూడా చుట్టుపక్కల రాష్టాల్రతోనే ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశరాజధాని దిల్లీలో కాలుష్యం కారణంగా బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్‌ చేయడం చాలా కష్టంగా ఉందని ఆమె అన్నారు. అయితే కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మాస్క్‌, కళ్లద్దాలు పెట్టుకుని సెట్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రాం వేదికగా ఆమె పోస్ట్‌ చేశారు.

మళ్లీ సరి-బేసి విధానం..

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సరి-బేసి విధానాన్ని ప్రారంభించింది. ఉదయం 8గంటల నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ప్రజలెవరూ ఉల్లంఘనలకు పాల్పడొద్దని ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ కోరారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేసేందుకుగానూ రాష్ట్రవ్యాప్తంగా 200ట్రాఫిక్‌ బృందాల్ని మోహరించారు. అలాగే మరో 5000మంది స్వచ్ఛంద కార్యకర్తలు కూడా పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై రూ.4 వేలు జరిమానా విధించనున్నారు. సోమవారం కేవలం సరిసంఖ్య గల వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. నవంబర్‌ 15వరకు ఈ విధానం అమలులో ఉండనుంది. అయితే ఈ నిబంధన నుంచి విద్యుత్‌ వాహనాలకు మినహాయింపునిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సరి-బేసి విధానం అమలులో ఉన్నన్ని రోజులు దిల్లీ మెట్రో 61అదనపు సర్వీసులు నడపనుంది. సోమవారం ఉదయం కూడా ఢిల్లీ పూర్తిగా పొగమంచు గుప్పిట్లో చిక్కుకుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ఉదయం ఏక్యూఐ 500గా నమోదవడం గమనార్హం. ఢిల్లీలో గాలి నాణ్యత మూడేళ్లలో అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయింది.

రూల్‌ ఉల్లంఘించిన బీజేపీ నేతకు జరిమానా..

ఢిల్లీలో సోమవారం నుంచి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఉద్దేశంతో ఆప్‌ సర్కార్‌.. సరి-బేసి పద్ధతిలో కార్లు రో/-డడెక్కాలని రూల్‌ పెట్టింది.

అయితే బీజేపీ నేత విజయ్‌ గోయల్‌.. బేసి సంఖ్య కలిగి ఉన్న కారుతో రోడ్డుపైకి వచ్చారు. ఆప్‌ సర్కార్‌ విధానాన్ని తప్పుపడుతూ.. దానికి నిరసనగా ఆయన బేసి సంఖ్య రిజిస్టేష్రన్‌ ఉన్న కారుతో వీధుల్లోకి వచ్చారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులకు ఆ నేతకు చలానా రాశారు. రూల్స్‌ ఉల్లంఘించినందుకు జరిమానా వేశారు. కేజీ సర్కార్‌ సరి-బేసి నియమంతో డ్రామా ఆడుతోందని గోయల్‌ విమర్శించారు. ఆ రూల్‌తో కాలుష్యం ఏమాత్రం తగ్గదన్నారు. అయితే సీఎం కేజీవ్రాల్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి రోజు 30 లక్షల కార్లు ఢిల్లీ రోడ్లపై తిరుగుతున్నాయన్నారు. సరి-బేసి రూల్‌ వల్ల రోజు 15 లక్షల కార్లు రోడ్డుపైకి రావని, దీని వల్ల కచ్చితంగా కాలుష్యం తగ్గుతుందని కేజీ చెప్పారు. ప్రజలు సహకరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close