Featuredస్టేట్ న్యూస్

చింతమడక ఒక్కటే గ్రామమా…

ఒక్క గ్రామానికే పదికోట్ల నిధులా…

  • మరి మిగతా గ్రామాల పరిస్థితేంటీ…
  • శిథిలావస్థలో వేలాది గ్రామాలు…

ఆ గ్రామం జనాభా 2335.. అక్కడ ఉన్న ఇండ్లు 579.. ఉన్నత చదువుల కోసం బయటికెళ్లిన వారు కొంతమంది.. ఉద్యోగ నిమిత్తం వెళ్లినవారు ఇంకొంతమంది.. గ్రామాన్ని పట్టుకొని కూలి పనిచేసే వారున్నారు, వ్యవసాయం చేసే వారున్నారు.. మనం అనుకుంటున్న బంగారు తెలంగాణలోని అన్ని గ్రామాల్లాగానే అదొక గ్రామం.. కాని ఆ గ్రామం అనుకోకుండా అద్దాల మేడలా మారబోతుంది.. సమస్యల్లేని లేకుండా, నిరుద్యోగి కనబడకుండా, ఏలాంటి లోటుపాట్లు ఆగుపడకుండా తయారవుతోంది.. అధునాతనమైన ఆస్పత్రులు, విశాలమైన ప్రభుత్వ పాఠశాలలు, పెద్ద పెద్ద రోడ్లు, విరామం లేకుండా తాగునీరు అన్నింటికి అక్కడ శాశ్వత పరిష్కారాన్ని కలుగుతోంది.. భూతద్దం పట్టుకొని వెతికినా చిన్న సమస్య కూడా కనబడకుండా, చిన్న మరమ్మత్తులు కనిపించకుండా పనులన్నీ చకచకా జరుగుతూనే ఉన్నాయి… ప్రత్యేక నిధుల కింద మన ముఖ్యమంత్రివర్యులు పదికోట్లు సైతం మంజూరు చేశారు. అక్కడి గ్రామ నాయకుడితో మాట్లాడి గ్రామంలో ఇంకా చిన్నచితకా సమస్యలెమున్నా నా దృష్టికి తీసుకురావాలని చెప్పారు.. అక్కడ ప్రతి విషయాన్ని కూలకషంగా తెలుసుకొని అన్ని రంగాలుగా, అన్ని రకాలుగా అభివృద్ది చేసేలా ప్రణాళిక సైతం పూర్తి చేశారు. అంత చిన్న గ్రామానికే ప్రత్యేక దృష్టి సారించిన మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు తెలంగాణలో ఎన్ని గ్రామాలపై ఇంకెంతగా అభివృద్ది చేస్తారో అనుకుంటే మాత్రం అది మన తప్పే అవుతోంది.. ఎందుకంటే అంత ప్రత్యేక దృష్టి సారించిన ఆ గ్రామం మన ముఖ్యమంత్రి పుట్టిన ఊరు చింతమడక.. అందుకే దానికి అన్ని ప్రత్యేక నిధులు.. వేరే ఏ గ్రామంలో ఎన్ని సమస్యలున్నా వాటి సంగతి తర్వాత, అవకాశం ఉంటే చూడడం లేకుంటే లేదు.. అంతే.. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవుండదు.. వారి గ్రామ అభివృద్ది చేయడానికి నిధులకు ఇబ్బంది ఉండదు.. తెలంగాణ ప్రజలంతా ఓటు వేసి గెలిపించిన మన కెసిఆర్‌ సారు ఆ ఒక్క గ్రామంపైనే ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారంటే అదీ ఆయన పుట్టి పెరిగిన సొంత గ్రామం.. మనలను పాలించే ముఖ్యమంత్రి ఒక్క చింతమడకకేనా, లేక తెలంగాణ రాష్ట్రానికా అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన ప్రధాన ఆంశం…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

పాలకులు ఏలా ఉండాలి.. ప్రజల సమస్యలను, తమ సమస్యలుగా భావిస్తూ అందరిని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలోకి తీసుకెళ్లాలి. నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తూ వారి ఉన్నతికి పాటుపడాలి.. గ్రామాల వారీగా సమస్యలను గుర్తిస్తూ వాటిని పరిష్కరిస్తూ ప్రజల నాయకుడిగా గుర్తింపు పొందాలి అదే నాయకత్వం, అదే పరిపాలన.. కాని తెలంగాణలో మాత్రం అంతా రివర్స్‌గానే ఉంటుంది.. ఓటేసి గెలిపించిన ప్రజల అభిప్రాయాలతో సంబంధం ఉండదు.కనీస సౌకర్యాలు లేక ప్రజలు తల్లడిల్లుతున్న పట్టించుకునే ఆలోచన ఉండదు.. వారికి నచ్చినట్లుగానే పరిపాలిస్తూ ప్రజల అభివృద్దిని విస్మరిస్తూపోతున్నారు.. బంగారు తెలంగాణ అని చెప్పుకోవడానికి, రాసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలా ఉంది కాని రాష్ట్రమంతా పలు సమస్యలతో స్వాగతం పలుకుతూనే ఉంది.. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిలో మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణ, కోట్లాది ప్రజలు కోట్లాడి కోటి ఆశలతో కలలుగన్న తెలంగాణ నేడు పనిచేసిన ఉద్యోగులకు జీతాలు లేక అప్పుల కుంపటిగా మారిపోయింది.. నేరవేరని సమస్యలతో తెలంగాణ పల్లెలు కన్నీరు పెడుతున్నాయి.. నడవడానికి ఇంకా దారులు లేని గ్రామాలు, కరెంట్‌ బల్బుకు నోచుకొని పల్లెలు, చదువుకోవడానికి నానా నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థులు, వైద్యం అందక దారిలోనే గాలిలో కలుస్తున్న ప్రాణాలు.. ఎన్నో సమస్యలతో, చెప్పుకోలేని వ్యధలతో ఉన్న తెలంగాణ దీనాపరిస్థితిని పట్టించుకోవడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కొత్త రాష్ట్రం, కొత్త పాలనలో కొన్ని రోజులు ఒడిదొడుకులు ఉంటాయని అనుకోవచ్చు. ఇప్పటికి ఆరుసంవత్సరాలైనా పాలన పూరైన కూడా గ్రామాల్లో ఏ మేరకు సదుపాయాలు కల్పించామో, ఏ మేరకు మనం కొరుకున్న బంగారు తెలంగాణ ఫలితాలు సాధించామో రాష్ట్రాన్ని పాలిస్తున్నా పాలకులకే తెలియాలి..

ఒక్క చింతమడకకే గుర్తింపా…

ముఖ్యమంత్రి సొంత ఊరు.. పాలించేది ఆయనే.. అధికార పగ్గాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనిష్టం ఆయన గ్రామానికి ఏదైనా చేసుకుంటారు. ఎన్ని నిధులైనా ప్రకటించుకుంటారు అనే ఆలోచన ప్రజలందరిలో వస్తుంది.. చింతమడక ప్రజలోక్కరే ఓటు వేస్తే ప్రభుత్వం ఏర్పడలేదు. టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాలేదు.. తెలంగాణలోనే కోట్లాది ప్రజలు తమ సమస్యలను తీర్చాలని, రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి నడిపించాలని ఓటు వేసి గెలిపించి అధికారాన్ని చేతిలో పెట్టారు. కాని అధికారం చేతిలోకొచ్చాక పాలకులు చేస్తున్న పనితీరుపై ప్రజలు ఆసహానం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాడి, బలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఆరు సంవత్సరాలైనా ఎక్కడి సమస్యలు అక్కడే మిగిలిపోయాయని కుమిలిపోతున్నారు. చదువుకోవడానికి పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు సరియైన వసతులు లేక, వెళ్లేందుకు రహదారులు లేక హరిగోస పడుతున్న గాని మన యంత్రాంగానికి చెవికెక్కడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆదిలోనే గంగలో కలిపారు. రెండువేలకు పైగా ఉన్న సిఎం చింతమడక గ్రామానికే పదికోట్లు కేటాయించి పనులన్నీ త్వరితగతిన చేసేందుకు ఆదేశాల మీద ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంటే తెలంగాణలో ఉన్నదీ ఒక్క చింతమడక గ్రామమేనా.. అక్కడ బుతుకున్న వాళ్లు మాత్రమే మనుషులా అనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకుంటుంది. ఆ గ్రామానికి కేటాయించినట్లే తెలంగాణలోని ప్రతి గ్రామానికి కనీస నిధులు కేటాయించి వాటిని అభివృద్ది చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అనే ప్రశ్నలు తెలంగాణ వ్యాప్తంగా వినపడుతున్నాయి. బంగారు తెలంగాణ అనే మాట వినబడుతోంది కాని ఇప్పటివరకు తులంగాణలో సాధించిన ప్రగతి ఏంటో మాత్రం ఎవ్వరికి కనబడుతనే లేదు..

అధినేతను ప్రశ్నించే అవకాశమే లేదు..

అధినేత ఏది చేసినా చూస్తూ ఉండాలి.. ఆయన గ్రామానికి ఎన్నికోట్లు ఐనా విడుదల చేయోచ్చు. ఎన్ని అభివృద్ది పనులైనా చేపట్టుకోవచ్చు.. మిగతా గ్రామాల పరిస్థితేంటని ప్రశ్నించే వారు ఉండరు. ప్రశ్నించిన పట్టించుకునే వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలైనా గుర్తురాని చింతమడక గ్రామం అనుకోకుండా ఇప్పుడెందుకు గుర్తువచ్చిందనేది అందరూ ఆలోచిస్తున్న ప్రధాన అంశంగా మారిపోయింది. పక్కరాష్ట్రం వాడు దోచుకుంటున్నాడు అందుకే మన రాష్ట్రం మనకొస్తే కనీస వసతులతో పాటు గ్రామాలు, ప్రజలు అభివృద్ది చెందుతారని అనుకున్నారు. కాని ఇక్కడ తెలంగాణ పాలకులే తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకబాటుకు గురిచేస్తున్నారు. మనం రాష్ట్రం బంగారుమయంగా మార్చుకుందామని కలలు కన్న ప్రతి ఒక్క తెలంగాణ వాది కలలు కలలుగానే మిగిలిపోయాయి. పలు సమస్యలతో ప్రజలంతా తల్లడిల్లుతుంటే వాటిపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వయంత్రాంగం తమ బాధ్యత కాదన్నట్లుగానే వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుసాగిస్తున్నారు. కనీస వసతులు లేక తల్లడిల్లుతున్న గ్రామాలు మన తెలంగాణ పల్లెలో వేల సంఖ్యలో ఉన్నాయి. చిన్న చినుకుపడివతే కనీసం నడవడానికి దారిలేని పల్లెలు నిత్యకృత్యమైపోయాయి. వాటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.. రాష్ట్రం ఏర్పడ్డాక అందరికి సమాన అవకాశాలు వస్తాయని, చదువుకున్న ప్రతి ఒక్కడికి ఉపాధి దొరుకుతుందని భావించిన యువత బతుకులను నిర్వీర్యం చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతోంది.. తెలంగాణలో ఉన్నది ఒక్క చింతమడక గ్రామమే కాదు.. లక్షలాది గ్రామాలున్నాయి.. వాటిని కూడా చింతమడక గ్రామంలా తయారుచేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.. ప్రజలు కోరికను పాలకులు పాటిస్తారా, విస్మరిస్తారా అనేది వారికే వదిలేయాల్సిందే…

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close