ముఖ్యమంత్రి పీఠం (ఆదాబ్ కథనం-5)

0

అన్నీ ఉన్న అనాథలు
★ నిబద్ధత కలిగిన కార్యకర్తలు
★ ఆర్థికభారం లేదు
★ అభ్యర్థుల కోసం వెతుకులాట
★ కనిపించని బలం ప్రయత్నం
(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్ హైదరాబాద్)
స్వాతంత్ర్యం తరువాత ‘గాంధీ హత్య’తో కుదేలయింది. నెమ్మది, నెమ్మదిగా దేవుళ్ళ చాటు,మాటున… ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రాపకం సంపాదించింది. ‘రథయాత్ర’లతో రక్తి కట్టించింది. బ్యాలట్ పై కన్నేసి.. ఎట్టకేలకు ఎన్నికల విజయబాట పట్టింది. జాతీయస్థాయిలో భాజపాకు దగ్గరగా ఉండే పార్టీలు తెలంగాణరాష్ట్రంలో మాత్రం వారికి దూరంగా ఉండటం గమనార్హం.

మతం నుంచి… మానవీయకోణంలోకి..:
భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ‘అంటరానిది. పార్టీకి మతం రంగు ఉంది. ఆపార్టీకి అనుకోని వరంలా వాజపేయి దొరికారు. ఆయన మాత్రం దేశ సమగ్రత దృష్టిలో ఉంచుకుని చేసిన వందలాది ప్రసంగాలు దేశ ప్రజలను ఆకర్శించాయి. దాంతో కాంగ్రెసుకు దూరమైన, వ్యతిరేకమైన పార్టీలు భాజపాకు దగ్గరయ్యాయి.

2 నుంచి 282 వరకు..:
1984, 8వ లోక్ సభలో 533 సీట్లకు గాను కేవలం 2 సీట్లతో బాజపా ఎన్నికల ప్రస్థానం ప్రారంభమైంది. 9వ లోక్ సభలో 85 సీట్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనంత ఎన్నికల్లో 120 సీట్లతో బయటి నుంచి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి సహాయం అందించింది. ‘రథయాత్ర’తో 161 స్థానాలు, 182 స్థానాలతో.. ప్రభుత్వం ఏర్పాటు, అనంతరం ప్రతిపక్షం. ఆ తరువాత
138, 116 సీట్లతో గ్రాఫ్ పడింది. మళ్ళీ నరేంద్రమోడీ రాకతో 282 స్థానాలతో ఎర్రకోటపై పాగా వేసింది. గతంలో బంగారు లక్ష్మణ్ తెహల్కా ఉదంతం దెబ్బతీసింది. మోడీ హయంలో నోట్ల రద్దు, జిఎస్టీ, పెట్రో మంట ప్రభావం ఉంటుంది.

తెలంగాణలో..:
“జాతీయస్థాయిలో మోడీ ప్రభంజనాన్ని స్థానిక నాయకులు సరిగ్గా ఉపయోగించు కోలేకపోయారు. తెరాస చేస్తున్న కార్యక్రమాలపై కంటితుడుపు మాటలు తప్ప ఏనాడూ కాంగ్రెసులా దూకుడు ప్రదర్శించలేదు. ఒకవేళ భాజాపా రంగంలోకి దిగితే ‘కాంగీ’కి లాభం చేకూర్చే అవకాశం ఉందనే భావన ఇక్కడి నాయకత్వానికి ఉండవచ్చు.

కేసీఆర్ ఢిల్లీ టూర్..
ప్రగతిభవన్ కు భాజపా నేతలు:
కేసీఆర్ ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీని కలసి ‘ముందస్తు ముచ్చట్లు’ అయిన తరువాత కానీ కేసీఆర్ కు స్థానిక భాజపా నేతలు గుర్తుకు రాలేదు. ఢిల్లీ నుంచి కేసీఆర్ వచ్చిన మరుసటిరోజు ఉదయం స్థానిక నాయకులకు ఆహ్వానం.. వెంటనే నాయకులు ప్రగతిభవన్ కు వెళ్ళి రావడం కిందస్థాయి కార్యకర్తలకు మింగుడుపడని విషయం.

గతం..:
గతంలో తెలుగుదేశంతో జతకట్టి 45 స్థానాలకు పోటీచేసింది. 7.03% ఓట్లతో 5 స్థనాలు గెలుచుకుంది. ఒక్క రాజాసింగ్ మినహా మిగిలిన నాయకులు సంప్రదాయంగా కాలం గడిపేశారు.

ప్రస్థుతం:
కోదండరామ్ కోసం బాగానే ప్రత్నించిన తెభాజపాకు తెరాసలో భంగ్గపడ్డ బాబూమోహన్ దొరికారు. పాతబస్తీ ప్రాంతంలో ఒకప్పుడు హవా చేసిన తెభాజపా ఈసారి ఆస్థాయిలో ఓటింగ్ రాకపోవచ్చు. తెరసతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన మజ్లీస్ ఎక్కువ లాభ పడింది. భాజపా ఏమాత్రం ‘మోడి’ అస్త్రాన్ని ఇక్కడ ఉపయోగించుకోలేక పోయింది. పైనుంచి కింద వరకు కొనసాగిన అంతర్గత ఒప్పందాలపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయకుంటే ఆ ఐదు కాస్త మరింత తగ్గే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణలో ‘హంగ్’ వస్తే కర్నాటకలో లాగా చక్రం తిప్పే నాయకులు ఇక్కడ లేరు. ముఖ్యమంత్రిగా బరిలో నిలిచే అభ్యర్థుల కోసం ఈ పార్టీ మరో తరం వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here