స్పోర్ట్స్

దివ్య దృష్టికి చదరంగం

హైదరాబాద్‌ : చదరంగం మేథావులు మాత్రమే ఆడే క్రీడ. అందులో కుల, మత, ప్రాంతాలకు తావులేదు. అలాంటి అధ్భుతమైన 64 గళ్ళ చదరంగ క్రీడ సాధారణ ప్రజానీకానికి, ఇతరులకు ‘గుడ్లప్పగించి చూసినా’… అంత తేలిగ్గా అర్థం కాదు. అలాంటిది పుట్టకతో దృష్టి లోపం ఉంటే… రంగుల ప్రపంచం చూడలేని బాధ తోడైతే… భగవంతుడు కూడా ఆ బాధ తీర్చలేనిది. తీర్చలేడు కూడా. కానీ….. మేధావులైన చదరంగ ప్రియులు.. నమ్మశక్యం కాని ఓ అధ్భుతాన్ని సుసాధ్యం చేశారు. చేస్తున్నారు. అదేమిటంటే రంగుల హరివిల్లు..ఇంధ్రదనస్సును చూడలేని ఆ కళ్ళకు.. చెస్‌ ప్రియులు కళ్ళుగా మారారు. అందుకోసం జిల్లాస్థాయి నుంచి ప్రంచస్థాయి వరకు ఉన్న సంబంధిత సంఘాలు నిశ్శబ్దంగా అండగా నిలిచి నేడు విజేతగా నిలిచాయి. కళ్ళుండి.. ఆడలేని క్రీడలలో అందరూ నిశ్శబ్దం. కానీ… మేథావుల క్రీడలో కళ్ళులేని వారికి ఉచితంగా ఎత్తులు నేర్పారు. నేర్పుతున్నారు. అదే చదరంగం. అందరికీ అనుసరణీయమైన ఆదర్శం. బహుపరాక్‌ విూ చేతులకు వజ్రాల కవచాలు తొడుక్కొని మనఃపూర్వక అభినందనలు సగర్వంగా.. సగౌరవంగా..సవినయంగా తెలపండి. అదే దేశభక్తి.

దేశంలో…: సుమారు నాలుగు వందల మంది అంథ క్రీడాకారులు ఉన్నారు. వీరందరికీ అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసిఎఫ్‌) పూర్తి సహకారం ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవలందిస్తోంది. ఆ సేవల వెనుక తమిళనాడుకు చెంది, ‘ఫిడే’కు సేవలందిస్తున్న సుందరాంగుడున్నారు. ఆయన భారత చదరంగానికి అనేక కోణాలలో సేవలందించడంతో పాటు అంథుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

అంతర్జాతీయ టోర్నీలో..:

ఖమ్మం, హైదరాబాద్‌, ఆంధ్రా, తమిళనాడు, ముంబై, ఢిల్లీలలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలలో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా వీరికి ప్రవేశం కల్పించారు. అందులో ప్రతిభ చూపడం, బహుమతులు గెలుచుకోవడం గమనార్హం.

వరంగల్‌ లో..:

అంధులకి ఉచ్ఛితం గా చదరంగం నేర్పిన జగన్‌ చెస్‌ అకాడవిూ అధ్యక్షులు జగన్‌ కి వరంగల్‌ జిల్లా కార్పొరేటర్‌ సత్యనారాయణ చేతుల విూదుగా సన్మానం, చేసిన అంథుల పాఠశాల యాజమాన్యం, అందులో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సమాజ సేవ చేస్తున్న జగన్‌ చెస్‌ అకాడవిూకి పలువురు అభినందనలు తెలిపారు.

–కర్టసీ: (అనంచిన్ని వెంకటేశ్వరరావు, చెస్‌ ప్రేమికుడు)

సహకారం:

కనకయ్య,(ఆదిలాబాద్‌),

రమేష్‌(నిజామాబాద్‌),

పారుపల్లి చంద్రశేఖర్‌ (సూర్యాపేట),

బాక్స్‌..:

విూం అండగా ఉంటాం: పోటీలలో పాల్గొంటున్న

అంథులకు సంబంధించిన పూర్తి బాధ్యత వరంగల్‌ చెస్‌ అసోసియేషన్‌ స్వీకరించిందని వరంగల్‌ చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి.వి. రాజగోపాల్‌ చెప్పారు.

అందరికీ సహాయం:

గడ్డం శ్రీనివాస్‌ (కార్యదర్శి, కరీంనగర్‌ పూర్వ జిల్లా)

బ్లైండ్‌ ఫోల్డ్‌ గేమ్‌ లో పాల్గొనటం ఓ అధ్భుతం. వారందరికీ సహాయం అందిస్తాం. అప్‌ టు బాటమ్‌ అందరికీ చెస్‌ ఫలాలు అందించాలి. అది అందరూ అనుభవించాలి.

బాక్స్‌:…

రాష్ట్ర చెస్‌ లో ఉచిత ప్రవేశం:

తెలుగు రాష్ట్రాల్లో అంధులు ఏ స్థాయిలో పాల్గొన్న వారందరి బాధ్యత తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్‌ తీసుకుంటుందని, అయితే వారు తెలంగాణ అసోసియేషన్‌ లో క్రీడాకారులుగా రిజిస్టర్‌ చేసుకోవాలని దీనికి ఎలాంటి ఆర్థిక భారం లేదని తెలంగాణ రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కె.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు.

స్పెషల్‌ బాక్స్‌

ఃనీలీ:

అందరికీ నేనున్నాను.. ‘ఫిడే’ సుందర్‌

భారతదేశంలో చదరంగం పుట్టిందని, లక్షలాది మంది క్రీడాకారులు భారతదేశం నుంచి వెలుగులోకి వస్తున్నారని ప్రపంచ చదరంగ సమాఖ్య ఉపాధ్యాక్షులు డి.వి.సుందర్‌ అభిప్రాయపడ్డారు. అంథులకు చెస్‌ నేర్పే విషయంలో, తోడ్పాటు అందించే విషయంలో అఖిల భారత చదరంగ సమాఖ్య, ప్రపంచ చదరంగ సమాఖ్య ముందుకు వెళుతున్నాయని.. ఇది భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని ఫిడే ఉపాధ్యక్షులు డి.వి.సుందర్‌ ఆప్యాయంగా చెప్పారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close