Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

కబ్జాలను పరిశీలించండి…..

ముఖ్యమంత్రికి అమీన్‌పూర్‌ ప్రజల ఆహ్వానం

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో స్వాముల వేషంలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టిన జై గురు దత్త సాయి ఫౌండేషన్‌ పై సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు తీవ్ర అసంతప్తిని వ్యక్తపరిచారు. అమీన్‌పూర్‌ మండల తహసీల్దార్‌ స్వామి గౌడ్‌, ఆర్డీవో శ్రీను కబ్జాదారులకు నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోకుండా మౌనవ్రతం పాటించడం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తపరిచారు. అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్‌ 993 లోని ప్రభుత్వ స్థలంలో మున్సిపల్‌ అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలు చేపడుతున్నారని, కబ్జాదారులకు నోటీసులు జారీ చేసి గడువు ముగిసిన అమీన్పూర్‌ తహసీల్దార్‌ మౌనవ్రతం పాటిస్తున్నాడని జిల్లా యువజన సంఘాల సమాఖ్య నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి ప్రజావాణిలో కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు పై వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఫోన్‌లో ఎమ్మార్వో ఆర్‌డిఓ ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. కబ్జాలను నిరోధించడం అధికారుల బాధ్యతగా ఆయన అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల అమలు కోసం ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడానికి అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు రెవెన్యూ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. కాగా అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలో విచ్చలవిడిగా కొనసాగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ అధికారుల ఆగడాలను నిలువరించేందుకు అసెంబ్లీలో ఆయన ఉపన్యాసానికి వాస్తవ రూపాన్ని కలుగజేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కబ్జాలపై పోరాటం ప్రశంసించ దగ్గ విషయమని అయితే అది వాస్తవరూపం దాల్చాలంటే ముఖ్యమంత్రి కబ్జాలు అధికంగా ఉన్న అమీన్‌ పూర్‌, బోడుప్పల్‌ తదితర నగర శివారు ప్రాంతాలను సందర్శించాలని

శ్రీకాంత్‌ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి ప్రసంగంతో స్పందించిన కొంతమంది యువకులు ఆయన కళలకు వాస్తవరూపం కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్న పోరాటాన్ని వారు అభినందించారు ప్రభుత్వ స్థలాల కబ్జాలపై యువత స్పందించి ఫిర్యాదు చేసే వరకు లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వేతనంగా స్వీకరిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణలో కబ్జాల భరతం పట్టాలంటే యువత చేస్తున్న ప్రయత్నాలను అభినందించి రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఫిర్యాదులను ప్రోత్సహించే విధంగా తగు విధానాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. కబ్జాలను నిరోధించడమే లక్ష్యంగా అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూకటివేళ్లతో పెకలించి ఒక మోడల్‌గా అమీన్‌ పూర్‌ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయాలని శ్రీకాంత్‌ రెడ్డి ఆశాభావం వ్యక్తపరిచారు. ముఖ్యమంత్రి ప్రసంగం రాజకీయ ఎత్తుగడల కాకుండా రాష్ట్రం అభివద్ధి చెందాలనే ఆకాంక్షతో చెపడుతున్న చర్యలు ఆచరణ రూపం దాల్చాలని, కబ్జాలకు సహకరిస్తున్న ఆర్‌డీఓ శ్రీను ఎమ్మార్వో స్వామిగౌడ్‌పై తగు చర్యలు తీసుకొని బదిలి చేయాలని జిల్లా యువజన సంఘాల సమాఖ్య నాయకుడు శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close