Featuredప్రాంతీయ వార్తలుస్టేట్ న్యూస్

మారిన రూటు రైతుకు చేటు

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

అధికారం వచ్చింది… దానికి దైవశక్తి తోడైందని కేసీఆర్‌ కుటుంబం నమ్ముతోంది. అందులో ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ… నేలతల్లిని నమ్ముకునే రైతు. లౌక్యం తెలియని ఆయన, ఆయన కుటుంబం బోరుమని రోదిస్తోంది. గుండెలవిసేలా అందరూ కలసి వాటేసుకొని ఏడుస్తున్నారు. ఆశ్చర్యం వారి కళ్ళ వెంట నీరు రావడం లేదు.. కానీ రక్తం మాత్రం ధారగా.. ఏరులై పారుతోంది. అయ్యా..అమ్మా పోయినప్పుడు రాని రక్తపు ఏడుపు వారిలో వస్తోంది. ప్రభుత్వ అధికారులు అందరూ అప్పటికే నిండిన రక్తపు దోసిళ్ళు పడుతున్నారు.అవీ నిండిపోయాయి. ఆ ప్రతిపాదిత జాతీయ రహదారి కూడా సరిపోవడం లేదు. ”ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం బాగుండాలని కోరుకుంటూ.. రోజూ వారికి వరి అన్నంపెట్టే ఈ వేలాది కుటుంబాలు ఈరోజు రక్త రోదనలు. చేస్తున్నాయి. ఒక్క క్షణం ఆ నిష్కంళంక హదయాలు… కేసీఆర్‌ కుటుంబం గురించి మరో ఆలోచన చేస్తే… వద్దు.. వద్దు.. నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది.

ఆ రైతుల కుటుంబాలకు చెందిన వారి తాతలు.. అమ్మమ్మలు, నాయనమ్మలు అక్కడే తిరిగారు.. అందుకే ఆ భూమి అంటే వారికి వల్లమాలిన వాత్సల్యం. అంతకంటే ఎక్కువ. అదే సెంటిమెంట్‌… సెంటిమెంట్‌ కు ఆర్ఘ్యుమెంట్‌ లేదు. అది కేసీఆర్‌ అయినా.. మరో దేవుడైనా…

కానీ.., ఆ రైతన్న కుటుంబం మాత్రం అది కోరుకోవడం లేదు. అలా ఒక రు కాదు.. ఇద్దరు కాదు..నాలుగువేల కుటుంబాలు.. కేవలం.. ”మా భూమి, మమ్మల్ని వదిలేయండి.. మీరు సల్లగా ఉండండి.. అంటూ” దీనం గా.. దయనీయంగా వేడుకుంటున్నారు… కాదూ.. కూడదు.. అంటే… త్యాగ ఉద్యమాలతో విరాజిల్లుతున్న ఖమ్మం… మరోసారి ఆత్మ బలిది నాలకు వెనుకాడదు.. రైతన్న కుటుంబాలు కోరుకుంటున్న ఈ చిన్న కోరిక తీర్చాల్సిన బాధ్యత, పుణ్యం కేసీఆర్‌దే. లేకుంటే.. ఆ పాపం కూడా కేసీఆర్‌ దే. ఈ పరిశీలనా కథనం మీకోసం ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ ప్రత్యేకం.

అసలేం జరిగింది..: ఖమ్మం నుండి దేవరపల్లి వరకు గ్రీన్‌ ఫీల్డ్‌ జాతీయ రహదారి కోసం రైతులు సుమారు లక్ష ఎకరాల భూమి కోల్పోతున్నారు. ఖమ్మం జిల్లా, చింతాకాని, ఖమ్మం అర్బన్‌, కొణిజెర్ల, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండల రైతులు బాధితులుగా ఉన్నారు. వీరంతా జీవనోపాధి కోసం ఈ వ్యవసాయ భూములపై ??ఆధారపడుతున్నారు. బావులు, బోరు బావులు, నాగార్జున సాగర్‌ కాలువ, కోదుమూరు లిఫ్ట్‌ నీటిపారుదల, లంకాసాగర్‌ ప్రాజెక్ట్‌, మరో ప్రాజెక్ట్‌ ద్వారా వచ్చే నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తూ రెండు పంటలు పండిస్తారు. ఈ వ్యవసాయ భూములలో పాడి, మొక్కజొన్న, మిర్చి, పత్తి వంటి పంటలు పండిస్తారు.

కొండ చిలువలా..: జాతీయ రహదారి నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుల సమ్మతి లేకుండా భూములను స్వాధీనం చేసుకోవడానికి శ్రీకారం చుట్టింది. ఈ రైతులు వారి పూర్వీకుల నుండి ఆ భూములే.వారికి వారి జీవనోపాధి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణం ముందు ఒకలా ఉంది.. ఆ తరువాత రాజకీయుల ఆత్యాశతో నేరుగా ఉండాల్సిన రోడ్డు… కొండచిలువలా 83 మెలికలు తిరిగింది.

ఇదా పద్దతి : ఈ రైతులు గ్రీన్‌ ల్యాండ్‌ జాతీయ రహదారికి తమ

భూములను ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 15న రైతుల నుండి భూసేకరణకు పత్రికలో మొట్టమొదటి నోటీసు ప్రకటించింది. అ తరువాత అధికారులు రావడం రాళ్ళు పాతడం… సర్వే లంటూ హంగామా చేయడం చకచకా జరిగిపోయాయి. రాజకీయ ఒత్తిళ్ళ కాలణంగా మొదటి మార్గం దారి మళ్ళింది. మళ్ళీ మరో నోటిఫికేషన్‌ అక్టోబర్‌18న ఇచ్చింది. ఈ విషయంలో తాజా మాజీమంత్రి బంధగణం భూములు ఉన్నట్లు తెలిసింది. రైతులు మాత్రం ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇచ్చేది లేదని ఖమ్మం, టిటిడిసి ఆవరణలో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

దయ లేని దండయాత్ర : రైతుల అనుమతి లేకుండా, వారి ఆమోదం లేకుండా ప్రభుత్వం భూ దండయాత్రను కొనసాగిస్తోందని అఖిల భారత కాంగ్రెస్‌ కిసాన్‌ సమన్వయ కర్త ఎకే. రామారావు గురువారం ఖమ్మంలో చెప్పారు. రైతుల కుటుంబాల భవిష్యత్తును ప్రభుత్వం కాలరాస్తోందని, రైతులకు ఇష్టం లేకుండా భూములను తీసుకునే ఈ అప్రజాస్వామిక విధానాన్ని గట్టిగా ఖండిస్తునని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యూహకర్త మండేపూడి అప్పారావు,జిల్లా కాంగ్రెస్‌ మైనారిటీ విభాగం సీనియర్‌ నాయకులు ఛోటాబాబా, బస్వాపురం సర్పంచ్‌ కొండలరావు, ఆదివాసీ నారకులు కట్ర నర్సింహారావు, వైరా నియోజకవర్గ బాధ్యులు సైదులు నారక్‌, పతంగి వెంకటేశ్వరరావు, మీలం శ్రీనివాస్‌ యాదవ్‌, చాగంటి లక్ష్మీనారాయణ,, జువ్వాది ఆనందరావు, నున్నా రవి, యవజన నాయకులు సుమంత్‌ రెడ్డి, బండి మీనా, భవానీ, గాయత్రీ

కామా అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. రీతూ చౌదరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. యవనేత ప్రతాపరుద్ర రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు.

ఖమ్మం పట్టణ సిఐలు రమేష్‌, నరేంద్ర, అర్భన్‌ సిఐ సాయి రమణతదితరులు శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, సెజ్‌లపేర పరిశ్రమలు, రోడ్లు, ఇళ్ళస్థలాల కోసం భూములను సేకరించడం జరుగుతుంది. ఒకోమారు ప్రాణాలు పోయినా తమ భూములను ఇచ్చేది లేదంటూ, మా భూములను తీసుకుంటే ఊరుకోబోమని రైతులు ఉద్యమాలు చేస్తారు. ఆర్‌.డి.వో. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూసేకరణ) ల ద్వారా ప్రభుత్వం నోటీసులు ఇచ్చి అవసరమైన భూములను సేకరిస్తుంది. అభివ ద్ధి పేరుతో జరిగిన భారీ భూసేకరణలో వ్యవసాయానికి అనువైన, రెండు పంటలు పండే భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. రైతులకు పరిహారం ఇచ్చి భూములను సేకరించే పని పరిశ్రమలదే అంటూనే రెవిన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. అనేక చోట్ల భారీ కుంభకోణాలకు ఇవి తెరతీశాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంటు, స్టీలు పరిశ్రమలు, రహదారులు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఐటీ పరిశ్రమలు.. ఇలా అనేక పేర్లతో భూములను ప్రభుత్వం సేకరించింది.

భూసేకరణకు వ్యతిరేకంగా అప్పీల్‌ చేయవచ్చు : భూ సేకరణ చట్టం కింద ప్రభుత్వం ఎటువంటి భూమినైనా సేకరించవచ్చు. కానీ, చట్టంలోని 5ఏ సెక్షన్‌ ప్రకారం భూముల యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.కొన్ని సందర్భాల్లో భూమి అత్యవసరమైతే 5ఏ సెక్షన్‌ను తోసిపుచ్చు. (17వ సెక్షన్‌). ఇతరుల భూములను ప్రభుత్వం సేకరించదలచినప్పుడు… ఆ చర్యను వ్యతిరేకిస్తూ అప్పీల్‌ చేసే హక్కు సంబంధిత భూ యజమానులకు ఉంటుంది. ప్రభుత్వం భూమిని సేకరించదలచినప్పుడు మొదట ఇందుకోసం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. భూ యజమానులకు అభ్యంతరాలు తెలిపే అవకాశాన్నిస్తుంది .భూ సేకరణ చట్టంలోని అత్యవసర నిబంధనలప్రకారం ఐతే భూ యజమానుల అభ్యంతరాలు విననక్కరలేదు. యజమానుల అభ్యంతరాలను పరిశీలించి, వాటిని నెలరోజుల్లో పరిష్కరించాలని, అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాత తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది. అత్యవసర నిబంధనలను అరుదైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలి.

భూసేకరణపై పిటిషన్‌కు ఆలస్యం తగదు: భూ సేకరణ ఉత్తర్వులను న్యాయస్థానంలో ఆలస్యంగా సవాల్‌ చేయడమంటే న్యాయప్రక్రియను దుర్వినియోగం చేయడమే.ఏ కారణాలతోనైనా ఒక వ్యక్తి సెక్షన్‌ 4 కింద ఇచ్చిన (భూసేకరణ) నోటిఫికేషన్‌ను నిర్దిష్ట కాలావధిలోగానే న్యాయస్థానంలో సవాల్‌ చేయాలి. ఆలస్యం చేస్తే అదే కారణంతో ఆ పిటిషన్‌ను కొట్టి వేయవచ్చు

-రామారావు,

(అడ్వకేట్‌)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close