చంద్రయాన్‌-2 నింగిలోకి వెళ్లనుంది

0

కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌..

  • శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి కోవింద్‌

చంద్రయాన్‌-2 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది. రేపు తెల్లవారుజామున చంద్రయాన్‌-2 నింగిలోకి వెళ్లనుంది. జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-2ని ప్రయోగించనున్నారు. చంద్రుడి దక్షిన ధ్రువంపై సెప్టెంబర్‌ 6న ల్యాండర్‌ దిగుతుంది. చంద్రయాన్‌-2 తయారీకి 1000 కోట్ల వ్యయం అయింది.

చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు తన సతీమణితో కలిసి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)కు చేరుకున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. అక్కడి నుంచి నేరుగా నక్షత్ర అతిథి భవనానికి వెళ్లారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత నూతనంగా నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని, అనంతరం రెండో ప్రయోగ వేదిక దగ్గరకు వెళ్లి చంద్రయాన్‌-2 ఉపగ్రహం ఉన్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌకను సందర్శించనున్నారు. తిరిగి అతిథి గృహానికి చేరుకోనున్న రాష్ట్రపతి.. సోమవారం వేకువ జామున 2.30 గంటలకు బయలుదేరి మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వెళ్లనున్నారు. అక్కడే ఉండి 2.51 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా షార్‌ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి కోవింద్‌ దర్శించుకున్నారు.

యావత్‌ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చంద్రయాన్‌-2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది ఇస్రో. చంద్రయాన్‌-2 ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ ఇప్పటికే స్టార్ట్‌ అయింది. ఇస్రో…చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌, రోవర్‌ను పంపనుంది. సెప్టెంబర్‌ 6 లేదా 7 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ ల్యాండ్‌ అవుతుంది. పదేళ్ల క్రితం ప్రయోగించిన చంద్రయాన్‌-1కు అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఈ చంద్రయాన్‌-2.

భారత రెండో మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో 13 పే లోడ్‌లు (ఆర్బిటర్‌లో 8, ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2 పేలోడ్లు) ఉంటాయి. అయితే చంద్రయాన్‌ మిషన్‌ కి సంబంధించి కొన్ని ఆశక్తికర విషయాలు ఉన్నాయి. చంద్రయాన్‌ ప్రాజెక్టుకి అయిన మొత్తం ఖర్చు…వందల హాలీవుడ్‌ సినిమాల బడ్జెట్‌ కన్నా చాలా తక్కువ. చంద్రయాన్‌ -2 మిషన్‌ మొత్తం ఖర్చు రూ.978కోట్లు మాత్రమే. అతి తక్కువ ఖర్చుతో భారత్‌ చంద్రయాన్‌ ప్రాజెక్టుని పూర్తి చేసింది.

చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలే లక్ష్యంగా చంద్రయాన్‌-2ను ఇస్రో చేపట్టనుంది. ఇంతవరకూ ఏ దేశం చేరుకోని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్లడానికి ఇస్రో ప్రణాళిక వేసింది. ఈ ప్రయోగం సక్సెస్‌ అయితే చంద్రునిపై వ్యర్థ రహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో అధ్యయనం చేయనుంది. ఈ అణుశక్తి ట్రిలియన్‌ డాలర్ల విలువ చేయనుంది.ఇస్రో చంద్రయాన్‌-2లో పంపనున్న రోవర్‌ ద్వారా నీరు, హీలియం-3 జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది. ఆ మూలకాలను చంద్రుడి నుంచి భూమికి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న దేశాలు ఈ ప్రక్రియను తమ చెప్పుచేతల్లో పెట్టుకొనే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగంతో భారత స్థానాన్ని చంద్రయాన్‌-2 మరింత పటిష్ఠం చేయనుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here