Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలు

ముగిసిన చంద్రయాన్‌-2 యాత్ర

స్పందన లేని విక్రం ల్యాండర్‌

? పరోక్ష ట్విట్‌

? వారికి 4 – భారత్‌ కు 48 రోజులు ఎందుకు..?

? చేతులెత్తేసిన నాసా

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

భారతీయులందరికీ ఓ విషాదవార్త. చంద్రయాన్‌2లో ఎన్నో ఉద్విగ్న సంఘటనలు.

ఎక్కడో ఓ చిన్న ఆశ. మళ్ళీ విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి మళ్ళీ సంకేతాలు రావచ్చనే ఏదో చిరు కోరిక. అయితే ఇస్రో భారతీయులకు నేరుగా చెప్పలేక ఓ ట్వీట్‌ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇక విక్రమ్‌ విషయం చరిత్రలో 2.1కివిూ దూరంలో నిలిచిన చరిత్రలో ఓ చీకటి పేజీ. నాసా కూడా మరికొద్ది గంటల్లో ఈ విషాదవార్తను అధికారికంగా ప్రకటించనుంది.

ఇదిగో ప్రయత్నం:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌ 2లోని విక్రమ్‌ ల్యాండర్‌ గురించి ఇంకా అధికారికంగా ఉత్కంఠ వీడటం లేదు. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.విూల దూరంలో ఉండగా విక్రమ్‌ ల్యాండర్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్పటి నుంచి ఈ ల్యాండర్తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

అమెరికా ప్రయత్నం:

చంద్రయాన్‌-2 విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా తన సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇక నాసా ప్రయోగించిన లూనార్‌ రికాయిన్నెసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌ఓ) మంగళవారం (భారతీయ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం) చంద్రుడి ఉపరితలానికి చేరుకొంది. విక్రమ్‌ ల్యాండ్‌ అయిన ప్రాంతం (ఢీ కొట్టిందను కునే ప్రాంతం) నుంచి ప్రయాణం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ల్యాండర్‌ ఉన్న ప్రాంతాన్ని ఫొటోలు తీసినట్లుగా సమాచారం.

బ్యాటరీ రీఛార్జ్‌ లేకపోవడం:

విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ తెలిసిందని 8వ తేదీన ఇస్రో ప్రకటించింది. అప్పటినుంచి విక్రమ్తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘ప్రతి గంట, ప్రతి నిమిషం ఇప్పుడు ఎంతో విలువైనది. విక్రమ్కు ఉన్న బ్యాటరీలో శక్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. తిరిగి శక్తిని నింపుకొనేందుకు ఎలాంటి వెసులుబాటు లేదు. అలాంటప్పుడు వచ్చే వారం రోజులు ఎంతో కీలకమైనవి’ అని ఇస్రో పేర్కొంది. అయితే, హార్డ్‌ ల్యాండింగ్‌ కారణంగా విక్రమ్‌ ల్యాండర్‌ కు కొంత నష్టం జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇస్రో ట్వీట్‌:

ఇదిలా ఉంటే తాజాగా ఇస్రో ఓ ట్వీట్‌ చేసింది. ”మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తితో మేము ముందుకు సాగుతాం” అని ఇస్రో ట్వీట్‌ చేసింది. దీంతో ‘చంద్రయాన్‌ 2’ ప్రయోగం విఫలైమంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇస్రో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి జాడను కనుగొనేందుకు ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. జూన్‌ 22న నింగిలోకి దూసుకుపోయిన చంద్రయాన్‌ 2 ఆ తరవాత ఒక్కో దశను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరితల కక్ష్యలోకి చేరింది. అక్కడ ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌.. చంద్రుడి విూద దిగడానికి 2.1కి.విూల దూరంలో ఉండగా సంకేతాలు ఇవ్వడం మానేసింది. దీంతో విక్రమ్‌ ల్యాండర్‌ బలంగా చంద్రుడి భూతలాన్ని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక ఆ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆర్బిటర్‌ పంపిన ఫొటోలతో ల్యాండర్‌ ముక్కలు అవ్వలేదని నిర్దారణకు వచ్చారు. ఆ తరువాత విక్రమ్‌ ల్యాండర్తో సంకేతాలు పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ల్యాండర్తో సంబంధాల పునరుద్ధరణకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మరి ల్యాండర్‌ పరిస్థితి ఏమిటి?. స్పందన లేదు కాబట్టి భారతీయ శాస్త్రవేత్తలు మరో పనికి శ్రీకారం చుట్టాలి.

ఃూచీ:

వారికి 4 – మనకు 48 రోజులు

? అనుమానాలు వద్దు

చంద్రుడిపై దిగడానికి నాసా అపోలో మిషన్కు 4 రోజులు పడితే, ఇస్రోకు 48 రోజులు ఎందుకు పట్టింది.? అనే అనుమానాలు అవసరం లేదు. సరిగ్గా 50 ఏళ్ల కిందట అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన అపోలో 11 అనే మానవ సహిత వ్యోమనౌక… నాలుగు రోజుల్లో గమ్యాన్ని చేరుకుని… చంద్రుడి విూద ల్యాండ్‌ అయ్యింది. కానీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 2 మాత్రం చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు పట్టింది.

50 ఏళ్ల కిందటే…:

అంత వేగంగా చేరుకోగలిగినప్పుడు.. ఇస్రో పంపిన చంద్రయాన్‌ ఇంకా వేగంగా వెళ్లగలగాలి కదా. కానీ ఎందుకు ఆలస్యంగా వెళ్తోంది అన్నదే సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. నాసా ప్రయాణం వెనుక..1969 జులై 16న… అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి శాటరన్‌ ఫైవ్‌ ఎస్‌ఏ506 రాకెట్‌ సాయంతో నీల్‌ ఏ ఆర్మ్‌ స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఈ ఆల్డ్రిన్‌, మైఖెల్‌ కొల్లిన్స్‌ అనే ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రుడిపైకి పంపింది. జులై 16 ఉదయం 8గంటల 32 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లిన అపోలో 11… 102 గంటల 45 నిముషాలకు గమ్యాన్ని చేరుకుని, చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అయ్యింది. అంటే కేవలం నాలుగు రోజుల ఆరు గంటల్లోనే వారు గమ్యం చేరుకున్నారు. ఆపై వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆల్డ్రిన్లు చంద్రుడిపై దిగి, అక్కడి మట్టి, రాళ్లను సేకరించారు. (అనేక అరోపఢలు ఉన్నాయి. భవిష్యత్తులో మాట్లాడుకుందాం).

జులై 21న భూవ్మిూదకు తిరుగు ప్రయాణం ప్రారంభించిన అపోలో 11 వ్యోమగాములున్న మాడ్యూల్‌ జులై 24న నార్త్‌ ఫసిఫిక్‌ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. అంటే భూవ్మిూద నుంచి చంద్రుడి విూదకు వెళ్లి, అక్కడ పరిశోధనలు చేసి, తిరిగి భూవ్మిూదకు రావడానికి వాళ్లకు కేవలం ఎనిమిది రోజుల 3 గంటలు మాత్రమే పట్టింది.

కానీ ఇస్రో చంద్రుడి విూద పరిశోధనల కోసం కేవలం ఆర్బిటర్‌, ల్యాండర్లను మాత్రమే పంపించింది. అయినా… అవి చంద్రుడిని చేరుకోడానికి 48 రోజులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత ఆలస్యం వెనుక చాలా పెద్ద కథే ఉంది.

ఎందుకింత ఆలస్యం..:

చంద్రయాన్‌ 2 సుదీర్ఘ ప్రయాణం వెనుక సాంకేతికంగా చాలా కారణాలున్నాయి. 1969లో నాసా ప్రయోగించిన అపోలో 11 రాకెట్‌ బరువు ఇంధనంతో కలిపి దాదాపు 2800 టన్నులు. కానీ ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్వీ మార్క్‌ త్రీ రాకెట్‌ బరువు ఇంధనంతో కలసి 640 టన్నులే. సాధారణంగా శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే పీఎస్‌ఎల్వీ రాకెట్లు ఇంతింత బరువు ఉండవు. ఎందుకంటే అవి కేవలం శాటిలైట్లను తీసుకెళ్లి జియో సింక్రనైజ్డ్‌ లేదా జియో స్టేషనరీ ఆర్బిట్లలో ప్రవేశ పెడతాయి. కానీ చంద్రయాన్‌ ఇందుకు విభిన్నం. ఎందుకంటే చంద్రుడి దగ్గరకు వెళ్లాల్సిన వాహక నౌకలో ఇంధనంతో పాటు చాలా పరికరాలు ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలకు అత్యంత శక్తిమంతమైన రాకెట్లను వినియోగిస్తారు.

ఈ విషయంలో కూడా నాసా ప్రయోగించిన రాకెట్ల బరువు ఎక్కువే. భూకక్ష్యను దాటిన తర్వాత… చంద్రుడి వైపు ప్రయాణించిన అపోలో వ్యోమనౌక బరువు… 45.7 టన్నులు. ఇందులో 80 శాతానికి పైగా ఇంధనమే. అంటే అపోలో 11లో ఈగిల్‌ అనే ల్యాండర్‌ చంద్రుడి విూద దిగి, వ్యోమగాములు చంద్రుడి విూద దిగి, పరిశోధనలు చేశాక, తిరిగి ఆ ల్యాండర్‌ ఆర్బిటర్‌ ను చేరుకుని, అది భూవ్మిూదకు రావడానికి ఇంత ఇంధనం అవసరం.

అపోలో 11 ప్రయోగానికి ఉపయోగించిన రాకెట్‌ శాటరన్‌ ఫైవ్‌ ఎస్‌ఎఏ506 అత్యంత శక్తిమంతమైనది. అంత భారీ ఇంధనం, అంత భారీ రాకెట్‌ కాబట్టే… అపోలో 11 కేవలం నాలుగు రోజుల్లో నేరుగా ప్రయాణించి చంద్రుడిని చేరిందని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బీజీ సిద్ధార్ధ్‌ తెలియచేశారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close