Featured

ముగిసిన సహస్ర చండీయాగం

సహస్ర మహా చండీయాగం శుక్రవారం నాడు పూర్తైంది. సీఎం కేసీఆర్‌ తన ఫామ్‌హౌజ్‌లో ఐదు రోజులుగా  చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం 8 మండపాల్లో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల మంటపం, బగలాముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది. ఈ ఎనిమిది మండపాల్లో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ప్రధాన యాగశాల అయిన చండీమాత మహా మంటపంలో పూర్ణాహుతి ప్రారంభంఅయింది. నమస్తత్వమే రాజశ్యామల మాతకీ జై అంటూ వేదపండితులు చేసిన మంత్రోచ్ఛరణం మధ్య పూజలు చేశారు. నవగ్రహ మంటపంలో, మహారుద్ర మంటపంలో, చతుర్వేద మంటపాలలో కూడా పూర్ణాహుతి జరిగింది. సహస్ర శీర్షా, పురుష సంవేద పుష్పమాం, పుష్ప మాలికాం సమర్పయామి, సౌభాగ్య ద్రవ్య సమర్పయామి అంటూ పూర్ణాహుతి నిర్వహించారు. ఇప్పటివరకు చేసిన పారాయణాలు, జపాలకు తద్దశాంశ ¬మ తర్పణాలను నిర్వహించారు. ప్రధాన కలశం అధిష్ఠాన దేవత మంటపం వద్ద శారదా కల్పవృక్షం అనుసరించి అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించారు. 

గజ్వేల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం శుక్రవారం పూర్ణాహుతితో ముగిసింది. నాలుగు రోజులపాటు చండీ పారాయణాలు, మహారుద్ర పారాయణాలు, భగళాముఖి పారాయణాలు జరుగగా.. చివరి రోజు పూర్ణాహుతితో క్రతువు ముగిసింది. ఈ యాగాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ముగింపు కార్యక్రమం కూడా స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలోనే జరగడం విశేషం. చివరి రోజు శుక్రవారం ఇప్పటివరకు చేసిన పారాయణాలు, జపాలకు తద్దశాంశ ¬మ తర్పణాలను నిర్వహించారు. ప్రధాన కలశం అధిష్ఠాన దేవత మంటపం వద్ద శారదా కల్పవృక్షం అనుసరించి అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించారు. అనంతరం చతుషష్టి యోగినీ బలి, మంగళ నీరాజన సేవ నిర్వహించారు. తదుపరి అగ్నిమథనం ద్వారా అగ్నిప్రతిష్ఠ చేసి పది కుండాల వద్ద ఇదే అగ్నితో ¬మం ఆరంభించారు. పది యజ్ఞ కుండాలలో ఒక్కో యజ్ఞకుండం వద్ద ఆచార్య బ్రహ్మతో కలిపి పదకొండు మంది వేద పండితులు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని ఆహుతులిస్తూ ¬మాన్ని నిర్వహించారు. అనంతరం అష్టదిక్పాలక బలి, ప్రాయశ్చిత్త ¬మాలను నిర్వహించారు. 700 సప్తశతి చండీ శ్లోకాల స్వాహాకారాలకు పాయసం, తెల్లనువ్వులు, నెయ్యితో కలిపిన ద్రవ్యాన్ని యజ్ఞభగవానుడికి హవిస్సుగా సమర్పించారు. మహాపూర్ణాహుతిలో భాగంగా చండీయాగ మంటపంలోని అన్ని యజ్ఞకుండాల అగ్నిని ప్రధాన యజ్ఞ కుండంలోకి తీసుకువచ్చి మహాపూర్ణాహుతిని ఆరంభించారు. యజ్ఞ ఆచార్యుడు మంగళ ద్రవ్యాలైన పసుపు, కుంకుమ, ఖర్జూర, వక్కలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జీడిపప్పు, పటికబెల్లం, బాదం, పచ్చకర్పూరం, గంధకచూరాలు, పూలు, పండ్లు, తమలపాకులు, పట్టుచీర, మారేడుకాయలు తదితరాలను పూర్ణాహుతిలో భాగంగా యజ్ఞభగవానుడికి సమర్పించారు. తరువాత వసోర్దార.. అంటే నెయ్యిని ధారగా పూర్ణాహుతి అనంతరం యజ్ఞభగవానుడికి సమర్పించే పక్రియ సాగింది. ఇదేవిధంగా మహారుద్ర, రాజశ్యామల, బగళాముఖి, చతుర్వేద, నవగ్రహ యాగ మంటపాల్లో కూడా షోడశోపచార పూజలు చేసి, ¬మాల అనంతరం పూర్ణాహుతిని నిర్వహించారు. సువాసిని పూజ, మహదాశీర్వచనం, ఋత్విక్‌ సన్మానం నిర్వహించారు. యాగంలో చివరి రోజు శుక్రవారం నాడు చండీమాత యాగశాలలో అగ్నిస్థాపన చేసి ¬మాన్ని నిర్వహించారు. చండీ సప్తశతి(700)లోని ప్రతి శ్లోకానికీ నువ్వులు, నెయ్యితో పాటు పాయసాన్ని కలిపి ఆహుతులు ఇచ్చారు. సుమారు వెయ్యి కిలోల పాయస ద్రవ్యాన్ని దీని కోసం వినియోగించారు. ఈ పాయసాన్ని బియ్యం, నెయ్యి, పాలు, బెల్లం, తేనె, యాలుకలు,

జీడిపప్పు, కిస్మస్‌ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారుచేశారు.

‘ కలే చండీ విశిష్యతే ‘

కలియుగంలో త్వరగా ఫలితాన్ని ఇచ్చేది చండీ దేవత . ఆమెను ఉపాసించి ఎంతోమంది సత్ఫలితాలను పొందారు . అమ్మవారితోనే ఈ సప్తశతిలో ఒక మాటను అన్నది . ఎక్కడైతే ఈ సప్తశతి పటించబడుతుందో అక్కడ నేనుంటాను . కేవలం ఉండటమే కాకుండగా సదామత ద్విమోక్షామి ఎప్పుడూ ఆ ప్రాంతాన్ని విడిచి ఉండను అన్నది .ఆమె ఎక్కడ ఉంటే అది మణి ద్వీపము , సుభిక్షము , సస్యశ్యామలము అయి ఉంటుంది . అందువల్ల చండీ ఉపాసన ప్రశస్త్యమై యున్నది . కల్వకుంట్ల చంద్రశేఖర రావు దంపతులు చండీ సంబంధమైన అన్ని రకాల ఉపాసనలు చేశారు. దేశ క్షేమం, లోక సంరక్షణమే ప్రధాన ద్యేయంగా సంకల్పించి రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, చతుర్వేద, మహారుద్ర సహిత సహస్ర చండీ మహా యాగాన్ని చేయతల పెట్టి శృంగేరీ జగద్గురులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి, విధుశేఖర భారతీ మహా స్వాములవారి ఆశీస్సులను అందుకొని గత నాలుగు రోజుల నుండి గణపతి సహస్ర మోదక ¬మం, రాజశ్యామలా మహా మంత్రానుష్టానం, లక్ష బగలాముఖీ మహా మంత్రానుష్టానం, వెయ్యి చండీ పారాయణములు, మహారుద్ర మంత్రముల అనుష్టానములను చేసి, దశాంశ ¬మ పక్షమును ఆశ్రయించి, శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మహాద్భుతంగా అన్ని యాగముల పూర్ణాహుతులు చేసి సహస్ర చండీ మహా యాగ పూర్ణాహుతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విశాఖ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్షంగా పాల్గొని అనుగ్రహించారు. శృంగేరీ, జీయర్‌, ఉడిపి పీఠాల నుండి ప్రసాదాలు వచ్చినయి. కార్యక్రమానంతరం సీఎం కేసీఆర్‌ ఋత్వికులను ఘనంగా సన్మానించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close